మృణ్మయ పాత్రలు

బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు. వీటిని ఆంగ్లంలో సిరామిక్స్ అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము కుండలు. మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి ఉన్నాయి.

Potter at work, Jaura, India
మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామంలో కుండలు చేస్తున్న కుమ్మరివాడు.
శ్రీకాకుళం పట్టణంలో కుండలు తయారుచేస్తున్న కుమ్మరివాడు

ఉపయోగాలు

 1. భవన నిర్మాణములో ఇటుకలుగా, పెంకులుగా
 2. లోహ పరిశ్రమతో కొలిమి నిర్మాణాలకు
 3. రసాయన పరిశ్రమలో రాతి సామాగ్రి, పింగాణీ సామాగ్రిగా
 4. పారిశుధ్య, మురుగునీటి పారుదల పనులతో రాతి సామాగ్రిగా
 5. చైనా పింగాణీగా శుభ్రత పరిరక్షణలో
 6. విద్యుత్ పరిశ్రమలో విద్యుత్ బంధకాలుగా, పింగాణీ సామాగ్రిగా

ముడి పదార్థాలు సిరామిక్స్ తయారీకి వాడే ముడి పదార్థాలు; a బంకమన్ను b పెల్‌స్ఫార్ అనే ఖనిజము c ఇసుక.

బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా (Al2O3) సిలికా (SiO2) లను మరియు కొంత పరిమాణంలో (Na2O, K2O, MgO, CaO) లను కలిగి ఉంటుంది.

విధానము

ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 20000C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 0C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 0C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 0C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.

మృణ్మయ పాత్రల పరిశ్రమ

A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel

మృణ్మయ పాత్రల పరిశ్రమలో మట్టి పాత్రలు, గోడ పెంకులు, పింగాణీ విద్యుత్ బంధనాలు, శుభ్రతా పరిరక్షణ పాత్రలు, మెరుపుగల గోడ పెంకులు మున్నగునవి ఉన్నాయి. మృణ్మయ పాత్రలను రెండు రకాలుగా విభజింపవచ్చు.

 1. సాధారణ కుండ పాత్రలు (టెర్రాకోటా లేక పోటరీ)
 2. మృత్తికా పాత్రలు (ఎర్థన్ వేర్)

సాధారణ కుండ పాత్రలు

ఇది సాధారణ బంక మన్ను నుండి తయారుచేసే పాత్రలు. సచ్చిద్ర పాత్రలైన కుండలు, కూజాలు, సాదహరణ ఇటుకలు, పైకప్పు పెంకులు మొదలైనవి. వీటికి మెరుపు ఉండదు.kaani వాటి తయారీలో ఉష్ణోగ్రత 11000C వరకు మాత్రమే పెరుగుతుంది. అందుచేత ఇవి గట్టిగా ఉండవు.

కుండపాత్రలకు ఉపయోగించు మట్టి రకాలు

కింది కుండల ఉపయోగిస్తారు మట్టి వివిధ రకాల జాబితా

 1. కయోలిన్ : దీనిని చైనా మట్టి అనికూడా అంటారు. ఎందుకంటే దీనిని ఎక్కువగా చైనాలో ఉపయోగిస్తారు.
 2. బాల్ మట్టి : యిది పాస్టిక్ వలె ఉంటుంది. యిది చూర్ణం చేయబడిన సెడిమెంటరీ మట్టి. యిది కొన్ని సేంద్రియ పదార్థములు కలిగి ఉంటుంది. దీనిని చాలా కొద్దిమొత్తంలో పోర్సలైన్ కు కలిపి ప్లాస్టిసిటీని పెంచుతారు.
 3. ఫైర్ క్లే
 4. స్టోన్ వేర్ క్లే

గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు

కూజ

ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.

నీళ్ల తొట్టి

Totti.... mattidi
మట్టితో చేసిన నీళ్లతొట్టి

గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే తొట్టి అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే కుడితి అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడా ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటుతో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి. ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.

పొంత

పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాశ్వతంగా వుండేటట్టు మట్టితో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని బాన లేదా దొంతి అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.

బుడిగి

బుడిగి అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.

ఆకారాలు చేసే పద్ధతులు

Clay Mixing for Pottery

Preparation of Clay for Pottery in India

Makingpottery

A man shapes pottery as it turns on a wheel. (Cappadocia, Turkey)

Pottery kathmandu

Handwork pottery in Kathmandu, Nepal

Töpferscheibe

Classic potter's kick wheel in Erfurt, Germany

మృత్తికా పాత్రలు

ఇవి ఎర్ర బంకమన్ను, బూడిద రంగు గల బంకమన్ను నుండి తయారుచేయబడతాయి. వీటి తయారీలో ఉష్ణోగ్రత 1450 - 1800 0C వరకు పెరుగుతుంది. అందుచేత ఇవి చాల గట్టిగా ఉంటాయి. మెరుపు కొరకు, క్వార్ట్జ్, ఫెల్‌స్ఫార్, కొంచెం బోరాక్స్, కొద్ది పరిమాణంలో లెడ్ ఆక్సైడ్ మిశ్రమాన్ని విసిరి జల్లించి సన్నని పొడిగా మారుస్తారు. ఈ పొడికి తగినంత నీరు కలిపి పలచని లేపనము తయారు చేస్తారు. ఎండిన మట్టి పాత్రలను ఈ పల్చని లేపనములో ముంచి బయటకు తీసి అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. ఇలా తయారైన పాత్రలు మెరుపును కలిగి ఉంటాయి. స్పార్క్ ప్లగ్ లు, విద్యుత్ బంధకపు పింగాణీ వస్తువులు, కుప్పెలు, వంటింటి సామాగ్రి, పింగాణీ కుండలు, మెరుపుగల గోడ పెంకులు మొదలైనవి మృత్తికా పాత్రలకు ఉదాహరణములు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.