మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
Mikkilineni Radhakrishna Murthy
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
జననంమిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
జూలై 7, 1916
గుంటూరు జిల్లా లింగాయపాలెం
మరణంఫిబ్రవరి 22, 2011
విజయవాడ
మరణ కారణముమూత్ర సంబంధమైన, అనారోగ్యం
ఇతర పేర్లుమిక్కిలినేని
ప్రసిద్ధిప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత
మతంహిందూ
భార్య / భర్తసీతారత్నం
Notes
ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదు

జీవిత చరిత్ర

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

Mikkileneni Radhakrishna Murthy
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.

ఐదుసార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్య్రయోధుడూ- కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు! గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు.[1] "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే.

మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!

పల్నాటియుద్ధం-బొబ్బిలియుద్ధం-కాటమరాజు కథ తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో కేబీ తిలక్, తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.మోహనదాసు, టి.చలపతిరావు, వి.మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ముఖ్యులున్నారు.

వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శిం చిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. అరవపల్లి సుబ్బారావు, ఆరణి సత్యనారాయణ, దేవతాసుబ్బారావు, నరసింహగుప్త, రెంటచింతల సత్యనారాయణ, భీమప్ప శ్రేష్టి, వంకాయల సత్యనారాయణ, రేపల్లె వెంకటశేషయ్య తదితర నటులు తమవారని తెలుసుకున్నామని, మిక్కిలినేని పరిశోధనలకు వైశ్యప్రముఖులు నివాళి పలికారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు.

సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.

రచనలు

  • నటరత్నాలు (1980, 2002)
  • ఆంధ్ర నాటకరంగ చరిత్ర
  • తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.
  • ప్రజా పోరాటాల రంగస్థలం
  • ఆంధ్రుల నృత్య కళావికాసం
  • తెలుగువారి చలన చిత్ర కళ

నటించిన సినిమాలు

పురస్కారాలు

  1. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం

బయటి లింకులు

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 23.02.2011
1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2011

2011 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

ఆంధ్రప్రభ (వారపత్రిక)

ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక 1952లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ప్రారంభమైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు ఈ పత్రికను ప్రచురించింది.

ఆవేటి పూర్ణిమ

ఆవేటి పూర్ణిమ (మార్చి 1, 1918 - నవంబరు 26, 1995) ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి.

ఉషాపరిణయం (సినిమా)

ఉషాపరిణయం (Usha Parinayam) 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం మరియు కన్నాంబ దర్శక నిర్మాత మరియు నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.

కర్నాటి లక్ష్మీనరసయ్య

కర్నాటి లక్ష్మీనరసయ్య (అక్టోబరు 5, 1927 - నవంబర్ 5, 2019) రంగస్థల నటుడు, ప్రయోక్త, దర్శకుడు. జానపద కళా బ్రహ్మగా పేరుగాంచిన ఈయన చిరకాలం కళారంగానికి సేవ చేశాడు.

కళా ప్రపూర్ణ

కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.

జూలై 7

జూలై 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 188వ రోజు (లీపు సంవత్సరములో 189వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 177 రోజులు మిగిలినవి.

తెలుగువారి జానపద కళారూపాలు

తెలుగువారి జానపద కళారూపాలు డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన విశిష్టమైన రచన. ఈ పుస్తకంలో జానపద కళలు ఆది మానవుని దగ్గరనుండి, ఇటీవలి గోల్కొండ రాజుల వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందీ వివరించారు. ఒక్కొక్క కళారూపాన్ని వివరణాత్మకంగా వివరించారు.

జిల్లాల వారీగా వున్న జానపద కళారూపాలు మరియు ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం కూడా ఇవ్వబడింది.

నటరత్నాలు

నటరత్నాలు అనేది మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రచించిన విశిష్టమైన తెలుగు పుస్తకం.

నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన నాటకరంగ చరిత్రలో ఎందరో మహానటులు తెలుగు నాటకరంగానికి సేవ చేశారు. అటువంటి వారి జీవిత విశేషాల్ని ఒకచోట చేర్చడంలో రచయిత కృతకృత్యులయ్యారు. దీనిని పద్మశ్రీ, కళాప్రపూర్ణ యన్. టి. రామారావు గారికి అంకితమిచ్చారు.

ఆంధ్ర నాటకరంగంలో మహోజ్వలంగా వెలిగిన ఎందరో మహానటుల ప్రదర్శనలను చూచి, పులకించి, వారి నటనకు స్పందించి మిక్కిలినేని వారి వివరాల్ని భావి తరాలకు అందించే సదుద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, కొన్ని సార్లు దొంగతనం కూడా చేసి సమాచారాన్ని సేకరించారు. కొన్ని నటరత్నాలు అనే శీర్షికతో ఆంధ్రప్రభ పత్రికలో ముద్రించబడ్డాయి. వాటిని చదివి కొందరు మహానటుల కుటుంబానికి చెందిన వ్యక్తులు జీవిత విశేషాలు పంపించి సహకరించారు. అలా 320 మంది నటీనటుల జీవిత చరిత్రలను సేకరించి ధన్యుడయ్యారు.

ఈ పుస్తకం 1980 సంవత్సరంలో ప్రథమ ముద్రణ పొందినది. తర్వాత 2002 సంవత్సరంలో ద్వితీయ ముద్రణ జరిగింది.

నటరత్నాల జీవిత విశేషాల తర్వాత ఇంకా ఎందరో మహానుభావులను మరచిపోయానని జ్ఞప్తికి వచ్చి 144 మంది ప్రసిద్ధ నాటక దర్శకులు, 157 మంది ప్రసిద్ధ నటులు మరియు 94 మంది ప్రసిద్ధ నటీమణులు జాబితాలను చివరగా చేర్చారు.

నాటక విజ్ఞాన సర్వస్వం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినద విజ్ఞాన సర్వస్వం సంపుటాలలో నాటక విజ్ఞాన సర్వస్వం 8వది.

ప్రజానాట్యమండలి

సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో ప్రజానాట్యమండలి స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది. 1943లో స్థాపించబడింది

ఫిబ్రవరి 22

ఫిబ్రవరి 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 53వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 312 రోజులు (లీపు సంవత్సరములో 313 రోజులు) మిగిలినవి.

రాధాకృష్ణమూర్తి

రాధాకృష్ణమూర్తి పేరు ఈ క్రింది వ్యక్తులని సూచిస్తుంది:

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత

కోగంటి రాధాకృష్ణమూర్తి, హేతువాది

పురాణపండ రాధాకృష్ణమూర్తి, సుప్రసిద్ధ రచయిత

అంచా రాధాకృష్ణమూర్తి, శిల్పకళా ప్రముఖులు మరియు సంగీత విద్వాంసులు

యలమంచిలి రాధాకృష్ణమూర్తి , మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడు.

వంగర వెంకటసుబ్బయ్య

వంగర వెంకట సుబ్బయ్య (నవంబరు 24, 1897 - 1975) (Vangara Venkata Subbaiah), తెలుగు సినిమా మరియు నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు .

విన్నకోట రామన్న పంతులు

విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.