మాస్టర్ వేణు

మాస్టర్ వేణు (1916 - 8 సెప్టెంబర్, 1981) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు మద్దూరి వేణుగోపాల్. వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన హార్మోనియం వాయించడంలో దిట్ట అయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. భీమవరపు నరసింహరావు గారి స్వరసారథ్యంలో వచ్చిన "మాలపిల్ల" సినిమాకి సహాయకునిగా అలాగే హార్మోనిస్ట్ గా పనిచేశాడు. బొంబాయిలో మనహర్ బార్వే నడుపుతున్న "స్కూల్ ఆఫ్ మ్యూజిక్"లో చేరి, ఆరు నెలలు తిరగకుండానే ఆ విద్యాలయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అప్పట్నుంచే "మాస్టర్ వేణు" అయ్యాడు. వేణుకి నౌషాద్ స్వరపరిచిన గీతాలంటే ఎనలేని మక్కువ. 1946లో వేణు బొంబాయి నుంచి తిరిగి వచ్చి మద్రాసులో ఉన్న హెచ్.ఎం.వి కంపెనీలో రెండేళ్ళు పనిచేశాడు. అక్కడ చాలా ప్రైవేట్ పాటలు స్వరపరచాడు.

విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కథ", "పాతాళభైరవి" మరియు "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించాడు.

మాస్టర్ వేణు
జననంమద్దూరి వేణుగోపాల్
1916
మచిలీపట్నం
మరణం8 సెప్టెంబర్, 1981
వృత్తిసంగీత దర్శకుడు
సాధించిన విజయాలుమాస్టర్
భార్య / భర్తశకుంతలాదేవి
పిల్లలుఇద్దరు కొడుకులు
మూర్తి చందర్, భాను చందర్

వ్యక్తిగత వివరాలు

ఆయన భార్య పేరు శకుంతలా దేవి. ఆయనకు ఇద్దరు కుమారులు. ఒకరు మూర్తి చందర్, తత్వవేత్త. మరొకరు భాను చందర్, సినీ నటుడు.

చిత్రసమాహారం

 1. మాలపిల్ల భీమవరపు నరసింహరావుతో (1938)
 2. వాల్మీకి (1945)
 3. వాలి సుగ్రీవ (1950)
 4. అంతా మనవాళ్ళే (1954)
 5. రోజులు మారాయి (1955)
 6. బీదల ఆస్తి రి-రికార్డింగ్ మాత్రమే (1955)
 7. ఏది నిజం (1956)
 8. సతీ సావిత్రి (1957)
 9. తోడి కోడళ్ళు (1957)
 10. పెద్దరికాలు (1957)
 11. ఎత్తుకు పై ఎత్తు (1958)
 12. ఆడపెత్తనం సాలూరు రాజేశ్వరరావుతో (1958)
 13. ముందడుగు (1958)
 14. మాంగల్యబలం (1958)
 15. భాగ్య దేవత (1959)
 16. వచ్చిన కోడలు నచ్చింది (1959)
 17. నమ్మిన బంటు సాలూరు రాజేశ్వరరావుతో (1960)
 18. జల్సారాయుడు (1960)
 19. రాజ మకుటం (1960)
 20. కులదైవం (1960)
 21. కుంకుమ రేఖ (1960) : తీరెను కోరిక తీయ తీయగ, హాయిగ మనసులు తేలిపోవగ
 22. శాంతి నివాసం (1960)
 23. కలసి ఉంటే కలదు సుఖం (1961)
 24. బాటసారి (1961)
 25. పెళ్లికాని పిల్లలు (1961)
 26. అర్ధరాత్రి (1961)
 27. సిరి సంపదలు (1962)
 28. సోమవార వ్రత మహత్యం (1963)
 29. ఇరుగు పొరుగు (1963)
 30. మురళీకృష్ణ (1964)
 31. ప్రేమించి చూడు (1965)
 32. అడుగు జాడలు (1966)
 33. అర్ధరాత్రి (1968)
 34. భార్య (1968)
 35. కలసిన మనసులు (1968)
 36. వింత కాపురం (1968)
 37. నిండు సంసారం (1968)
 38. బాగ్దాద్ గజదొంగ (1968)
 39. బొమ్మలు చెప్పిన కథ (1969)
 40. ఆడజన్మ (1970)
 41. విధివిలాసం (1970)
 42. అందరూ బాగుండాలి (1971)
 43. అత్తను దిద్దిన కోడలు (1972)
 44. ఉత్తమ ఇల్లాలు (1974)
 45. వధూవరులు (1976)
 46. దాన ధర్మాలు [విడుదల కాలేదు] (1976)
 47. మేలుకొలుపు (1978)
 48. మా వారి మంచితనం (1979)
 49. మోహన రాగం [విడుదల కాలేదు] (1980)
 50. ప్రేమ కానుక (1980)

బయటి లింకులు

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1981

1981 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

ఆడజన్మ (1970 సినిమా)

ఇదే పేరుతో 1951లో వచ్చిన మరొక సినిమా ఆడ జన్మ

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.

కె.బి.కె.మోహన్ రాజు

కె.బి.కె.మోహన్ రాజు (మార్చి 23, 1934 - మార్చి 16, 2018) సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. ఈయన పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు.

కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాసిన సినిమా పాటల జాబితా

ఈ క్రింది పట్టికలో కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినిమాల కోసం రచించిన పాటలు, పద్యాలు,దండకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథల వివరాలు ఉన్నాయి.

నమ్మిన బంటు

నమ్మిన బంటు అనేది 1960 ల నాటి తెలుగు చిత్రం, శంభు ఫిల్మ్స్ పతాకంపై యర్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించింది. ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రలలో నటించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు, మాస్టర్ వేణు సంయుక్తంగా సమకూర్చారు. తమిళ చిత్రం పట్టాళిన్ వెట్రి, తెలుగు సినిమా రెండు సినిమాలు ఇదే బ్యానర్లో ఒకే సమయంలో తయారు చేయబడినందున ఈ చిత్రం పునర్నిర్మాణం జరిగింది. కొన్ని సీన్లు, కళాకారులుతో రెండు వెర్షన్లు ఒకరే దర్శకత్వం వహించాడు. విడుదలైన తర్వాత ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఈ సినిమా తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది.

బాటసారి

బాటసారి 1961 సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద పి.ఎస్.రామకృష్ణారావు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ చిత్రకథకు శరత్ చంద్ర రచించిన 'బడా దీది' నవల ఆధారం. తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ సినిమా తెలుగులో 1961 జూన్ 30న విడుదలకాగా తమిళంలో "కాణల్ నీర్" పేరిట 1961 జూలై 21న విడుదలయ్యింది.

భానుచందర్

భానుచందర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.

మాంగల్య బలం (1958 సినిమా)

మాంగల్య బలం 1958లో విడుదలైన తెలుగు చిత్రం.

మాస్టర్

మాస్టర్ (Master) అనగా ఆంగ్ల భాషలో ఉపాధ్యాయుడు.మాస్టర్ (సినిమా), 1997 లో విడుదలైన తెలుగు సినిమా.

మాస్టర్ వేణు, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

మాస్టర్ కిలాడి, 1971 లో విడుదలైన తెలుగు సినిమా.

ప్రైవేట్ మాస్టర్, 1967 లో విడుదలైన తెలుగు సినిమా.

స్టేషన్ మాస్టర్, 1988 లో విడుదలైన తెలుగు సినిమా.

వాల్మీకి (1945 సినిమా)

వాల్మీకి 1945లో విడుదలైన ఐదు తెలుగు చలనచిత్రాల్లో ఒకటి. వాల్మీకి చిత్రాన్ని మద్రాసులోని ప్రస్తుతపు వడపళని ఏరియాలో అప్పుడు అడవిగా వున్న ప్రదేశంలో చిత్రీకరించారు. భామా ఫిలిమ్స్‌ పతాకాన ఎల్లిస్‌ ఆర్‌ డంగన్‌, ఎం.ఎల్‌.టాండన్ దర్శకత్వంలో రూపొందించారు. వాల్మీకి జీవిత చరిత్రను, రామాయణంలోని ముఖ్య సన్నివేశాలు, సీతావనవాసం, లవకుశ జననం వంటి ఘట్టాలు చిత్రీకరించారీ చిత్రంలో. ఈ చిత్రం ద్వారా మాస్టర్ వేణు సంగీత దర్శకుడుగా పరిచయమయ్యాడు.మల్లాది విశ్వనాథ కవిరాజు, రచన అడవి బాపిరాజు కళాదర్శకత్వాన్ని నిర్వహించారు. కస్తూరి నరసింహారావు, సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు, రామకృష్ణ శాస్త్రి, బెల్లంకొండ సుబ్బారావు, కుమారి, దాసరి కోటిరత్నం, తవమణిదేవి, బాలాత్రిపుర సుందరి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 14, 1945న విడుదలైంది. రామ నామమే మధురం మధురం, నీలి మబ్బులు అనే పాటలు హిట్టయ్యాయి.

వింత కాపురం

పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై పి.పుల్లయ్య బావమరిది వెంకటేశ్వర్లు నిర్మాతగా, మరో బావమరిది వి.వి.సుబ్బారావు (అబ్బి) దర్శకత్వంలో నిర్మించిన వింత కాపురం 1968 నవంబర్ 3న విడుదలైంది.

సడిసేయ కో గాలి సడిసేయబోకే

సడిసేయ కో గాలి సడిసేయబోకే రాజమకుటం (1960) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన భావ గీతం. ఈ గీతాన్ని పి. లీల మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. ఈ సన్నివేశంలో ఎన్.టి.రామారావు మరియు రాజసులోచన లపై చిత్రీకరించారు.

సెప్టెంబర్ 8

సెప్టెంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 251వ రోజు (లీపు సంవత్సరములో 252వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 114 రోజులు మిగిలినవి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.