భౌగోళిక నిర్దేశాంక పద్ధతి

భౌగోళిక నిర్దేశాంక పద్ధతి అనగా ఒక నిర్దేశాంకాల వ్యవస్థ, ఇది భూమిపై ఉన్న ప్రతి స్థానాన్ని సంఖ్యలు లేదా అక్షరాల సమితి ద్వారా సూచిస్తుంది. నిర్దేశాంకము తరచుగా సంఖ్యల యొక్క ఒకదానిని నిలువు స్థానము ఆధారంగా మరియు సంఖ్యల యొక్క రెండొవ లేదా మూడవ దానిని సమాంతర స్థానం ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. నిర్దేశాంకము యొక్క సాధారణ ఎంపికగా అక్షాంశం, రేఖాంశం మరియు ఎలివేషన్ ఉన్నాయి.

Latitude and Longitude of the Earth-te
భూమి యొక్క అక్షాంశం (Latitude) మరియు రేఖాంశం (Longitude)
Geographic coordinates sphere
రేఖాంశం ఫై (φ) మరియు అక్షాంశం లామ్డా (λ)

భౌగోళిక అక్షాంశం మరియు రేఖాంశం

ప్రధాన వ్యాసాలు: అక్షాంశం మరియు రేఖాంశం

అక్షాంశం:
భూగోళాన్ని తూర్పు, పడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం లామ్డా, \lambda\,\! అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0° గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. అంతర్జాతీయ తేదీ రేఖ చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది.

రేఖాంశం:
భూగోళాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను రేఖాంశాలని (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం భూమధ్యరేఖ ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం ఫై, \phi\,\! రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.