భాష

భాష : ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్యమైన అంశాలు.

భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. మాట మరియు A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. దేశ భాష the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. మాటాడుట. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, మాటలాడు. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. భాష్యము n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. భాష్యకారులు లేదా భాష్యకార్లు n. అనగా A commentator or expounder of technical texts; బాసికములు fillets worn at weddings పెళ్ళిలో నుదుట ధరించేవి.

తెలుగు భాష

ఉపోద్ఘాతం

 1. చరిత్ర
 2. లిపి పుట్టు పూర్వోత్తరాలు
 3. వ్యాకరణము
  1. తెలుగు ధ్వనులు
  2. తెలుగు అక్షరాలు
  3. గుణింతాలు
 4. సాహిత్యం

భారతీయ భాషలు

మూలాలు

 1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం భాష పదప్రయోగాలు.
ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది.నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 20114 జూన్ 2 నుండి పది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశముంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది.. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తాతీరం ఈరాష్ట్రంలో ఉంది.

ఆదిలాబాద్ జిల్లా

ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్..బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును 'ఎడ్లవాడ' అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 11 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం.

కన్నడ భాష

సిరిగన్నడగా పేరొందిన ಕನ್ನಡ పురాతన ద్రావిడ భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు.

కర్ణాటక

కర్ణాటక ( కన్నడలో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి మరియు బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఖమ్మం దీని ముఖ్యపట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 13,89,566.

తమిళ భాష

తమిళం లేదా అరవం (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. తమిళం దక్షిణ భారత దేశంలో తెలుగు తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.

తెలంగాణ

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్ హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీసీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

తెలుగు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌' గా వ్యవహరించారు. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది. తెలుగు భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా కన్నడ భాషను పోలియుంటాయి.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

ప్రపంచము

ప్రపంచము అని సాధారణంగా భూ గ్రహాన్ని గురించి వ్యవహరిస్తారు. ఆంగ్లములో దీన్ని వరల్డ్ అని అంటారు. వరల్డ్ అన్న పదము అంతరించిపోయిన ప్రాచీన పదబంధము చే యేర్పడినది. వర్ అనగా మనిషి, ఎల్డ్ అనగా వయసు. కలిపి వరల్డ్ అంటే మనిషి జీవిత కాలము అని అర్ధము.

బంగ్లా భాష

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ మరియు సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి మరియు స్థాయి ఉన్నాయి.

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్ మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ లేదా 6వ స్థానములో ఉన్నది).

బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష మరియు భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

బ్రిటిషు

బ్రిటిష్ అనే పదం యునైటెడ్ కింగ్ డమ్ లేదా గ్రేట్ బ్రిటన్ యొక్క ద్వీపం మరియు దాని ప్రజలతో పాటు వివిధ విశేషణాలను సూచిస్తుంది.

మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

మరాఠీ భాష

మరాఠీ (मराठी Marāṭhī) ఒక ఇండో-ఆర్యన్ భాష, దీనిని పశ్చిమ భారతదేశంలోని మరాఠీ ప్రజలు ఉపయోగిస్తారు. ఇది మహారాష్ట్ర యొక్క అధికార భాష. ప్రపంచంలో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో నాలుగవ స్థానంలో ఉంది. మరియు ప్రపంచంలో 15వ భాష.. బెంగాలీ భాషతో బాటు మరాఠీ భాష కూడా ఇండో-ఆర్యన్ భాషలలో ప్రాచీన ప్రాంతీయ భాష. ఇది క్రీ.శ్. 1000 నుండి మాట్లాడబడుచున్నది. మరాఠీ 1300 సంవత్సరాల వయస్సు గలది, మరియు సంస్కృతం నుండి "ప్రాకృతం" మరియు అపభ్రంశ ద్వారా ఆవిర్భవించింది. దీని గ్రామరు పాళీ భాష నుండి గ్రహించబడింది. ప్రాచీనకాలంలో మరాఠీ భాషను "మహారాష్ట్రి" అని "మర్హటీ" అని "మహ్రాట్టి" అని పిలిచెడివారు.

మలయాళ భాష

మలయాళ (മലയാളം) దక్షిణ భారతదేశములోని కేరళ రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళ మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల తర్వాత మలయాళం అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు.

మలయాళ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి ఉంది.

మొక్క

ఎంత పెద్ద వృక్షమైనా మొక్కగానే మొదలవుతుంది. తెలుగు భాష ప్రకారంగా మొక్క పదం మొలక యొక్క పొట్టి పేరు.

సంస్కృతము

సంస్కృతము (దేవనాగరి: संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష మరియు భారతదేశ 23 ఆధికారిక భాషల లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.

అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.

సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.

హిందీ భాష

హిందీ భాష (దేవనాగరి: हिन्दी) ఉత్త్రర, మధ్య భారతదేశములో మాట్లాడే ఒక భాష. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, indirect గా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశములో ముస్లిం ప్రభావము వలన పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ద") హిందీని ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.

భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కాని హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజనకు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.