బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ఆంగ్లం : Banaras Hindu University) (BHU), హిందీ: काशी हिन्दू विश्वविद्यालय, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, వారణాసి సమీపంలో గలదు.[1] ఇది ఆసియా లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.[2]

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
స్థాపితం1916
వైస్ ఛాన్సలర్పంజాబ్ సింగ్
స్థానంవారణాసి, భారతదేశం
జాలగూడుhttp://www.bhu.ac.in/
New Vishwanath Temple at BHU 2007 (2)
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.

బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపన

బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంను మదన్ మోహన్ మాలవ్యా 1916లో డా.అనీ బెసెంట్ సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి స్థలము కాశీ నరేష్ కేటాయించాడు, అలాగే మొదటి ఉపకులపతి గా కాశీ నరేష్ నియుక్తుడయ్యాడు.[3]

ఒక "హిందూ" విశ్వవిద్యాలయం"

ఈ విశ్వవిద్యాలయపు పేరులో "హిందూ" అని పేర్కొన్ననూ, ఇందులో అన్ని మతస్తులవారికి ప్రవేశమున్నది. విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బందిలో వివిధ మతస్తుల వారున్నారు. దీని అధికారిక వెబ్‌సైటులో ఈ సందేశం చూడవచ్చు:

"భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు[4] ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ మరియు పారశీకులది కూడాను. భారత్ పరిపుష్టి కావాలంటే, అన్ని మతాలవారు కులాలవారు పరస్పర సహాయసహకారాలతో శాంతియుతంగా జీవించాలి. ఈ విజ్ఞాన కేంద్రం జ్ఞానవంతులను తయారు చేస్తుందని, వీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మేధావులకు ఏమాత్రం తీసిపోరని నా ఆశ మరియు ప్రార్థన. ఇచ్చటి విద్యార్థులు ఓ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, తమ దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి వుంటారని ఆశిస్తున్నాను.[5]

విభాగాలు

 • మానవీయ శాస్త్రాల విభాగములు
  • తెలుగు శాఖ

ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు

 • అయ్యగారి సాంబశివరావు, భారతదేశ అణు శాస్త్రవేత్త, హైదరాబాదులోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.
 • ఎల్.కె.ఝా - లక్ష్మీకాంత్ ఝా , భారత దేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ 8వ గవర్నర్.
 • జస్టిస్ కాన్ సింగ్ పరిహార్ (రిటైర్డ్ జడ్జి. రాజస్థాన్ హైకోర్టు & మాజీ వైస్ ఛాన్సెలర్ జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం)
 • పండిట్ యదునందన్ శర్మ
 • శాంతి స్వరూప్ భట్నాగర్, CSIR యొక్క మొదటి డైరెక్టర్ జనరల్
 • హరివంశ్ రాయ్ బచ్చన్ (అమితాబ్ బచ్చన్ తండ్రి.)
 • ఆచార్య సీతారాం చతుర్వేది, హిందీ మరియు సంస్కృత పండితుడు మరియు డ్రామా రచయిత.
 • ఏ.డి. బోహ్రా, (ఇంజనీరు)
 • అహ్మద్ హసన్ దాని, ప్రముఖ పాకిస్తానీ పురాతత్వ శాస్త్రవేత్త మరియు చరిత్ర కారుడు
 • చంద్రధర్ శర్మ గులేరి
 • భూపేన్ హజారికా, గాయకుడు మరియు సంగీతకారుడు
 • లాల్‌మణి మిశ్రా, సంగీతకారుడు
 • రాబర్ట్ ఎమ్.పిర్‌సిగ్, అమెరికన్ తత్వవేత్త
 • డా.బి.జే.చౌబే, జంతుశాస్త్రవేత్త
 • బీర్బల్ సహాని, (పాలియో-బాటనిస్టు)
 • ప్రకాశ్ వీర్ శాస్త్రి, పార్లమెంటు సభ్యుడు మరియు ఆర్యసమాజం సభ్యుడు
 • ఆచార్య రాంచంద్ర శుక్లా, హిందీ రచయిత మరియు చరిత్రకారుడు
 • రాంచంద్ర శుక్లా, పెయింటర్
 • సి.ఎన్.ఆర్. రావు, శాస్త్రవేత్త
 • జయంత్ విష్ణు నర్లికార్, విశ్వ-భౌతిక శాస్త్రవేత్త
 • నార్ల తాతారావు, భారత విద్యుత్తు రంగ నిపుణుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్
 • డా. రమా శంకర్ త్రిపాఠి, చరిత్రకారుడు-ప్రాచీన భారత చరిత్ర
 • పండిట్ ఓంకార్ నాథ్ ఠాకుర్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతకారుడు-గాయకుడు
 • డా.ఎన్.రామ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, వయోలనిస్టు
 • డా. వి.కే. శర్మ ( శాస్త్రవేత్త)
 • డా. ఎ.బి. పాండే, మెటీరియల్ ఇంజనీరు
 • డా.వి.వి.ఎల్.ఎన్.శాస్త్రి (ఆర్థికవేత్త)
 • డా. రామినేని అయ్యన్న చౌదరి, రామినేని ఫౌండేషన్ స్థాపకులు.
 • డా. లక్ష్మీకాంత్ ఝా, భారత దేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్
 • మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు, వేద పండితులు
 • ఐనంపూడి చక్రధర్ రాజ్యసభ సభ్యులు
 • బాలి రామ్ లోక్‌సభ సభ్యుడు.
 •  శ్రీవైష్ణవ వేణుగోపాల్ కవి పరిశోధకులు
 • నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.

మూలాలు

 1. Rediff news
 2. "BANARAS HINDU UNIVERSITY" (PDF). Indian Academy of Sciences. 2005-07-26. Retrieved 2007-04-19. Cite web requires |website= (help)
 3. [1] Short biography of Pandit Madan Mohan Malaviya. Look under the heading Important Dates.
 4. http://internet.bhu.ac.in/NEWSPAPER/may08/bhunews2/pages/BHU%20News%20Combined%20Issue_02.html
 5. "Official home page of BHU". Retrieved 2006-08-28. Cite web requires |website= (help)

బయటి లింకులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడింది.

తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయముగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయానికి విశాఖపట్టణం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లాలో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.

కపిల కాశీపతి

కపిల కాశీపతి పత్రికా, చలనచిత్ర, రేడియో,నాటక, సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలోను, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలోను పట్టభద్రుడయ్యాడు. మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి తరువాత ఆ వృత్తిని త్యజించి టంగుటూరి ప్రకాశంపంతులు గారి స్వరాజ్యపత్రికలో చేరాడు. ది మెయిల్ పత్రికలో కొన్నాళ్లు పనిచేశాడు. నిజాం రాష్ట్రంలో ప్రత్యేక విలేఖరిగా నియమితుడైనాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వ్రాయడంతో ఆ రాష్ట్రం నుండి బహిష్కృతుడయ్యాడు. తరువాత చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. అటు పిమ్మట ఆకాశవాణిలో చేరాడు. ఢిల్లీనుండి ఆకాశవాణిలో తెలుగులో వార్తలు చదివిన తొలితరం వ్యక్తులలో ప్రముఖుడు. కేంద్ర ప్రభుత్వ సమాచారశాఖలో చేరి కలకత్తా, మద్రాసులలో ఉపసంచాలకులుగా పనిచేశాడు. సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేశాడు. మద్రాసు, హైదరాబాదు ప్రభుత్వాలలో ప్రత్యేకాధికారిగా నియమితుడై ఆయా రాష్ట్రాల సమాచారశాఖను పటిష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రానికి తొలి సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1956లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ పత్రికకు తొలి సంపాదకుడు ఇతడే.. అటు ఆంధ్ర మహాసభతోనూ, తెలంగాణా ఆంధ్ర మహాసభతోనూ ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వారి కోరిక మేరకు నెహ్రూ ఆశీర్వచనంతో, కృష్ణమీనన్ సహకారంతో మద్రాసు ప్రభుత్వం ద్వారా లండన్కు వెళ్లి అక్కడ నిజాం ప్రతినిధుల ప్రచారానికి వ్యతిరేక ప్రచార ఉద్యమం నడిపాడు. ఇతడికి కాసు బ్రహ్మానందరెడ్డి సహాధ్యాయి. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయ జీవితాన్ని గురించి బ్రహ్మానందయాత్ర అనే గ్రంథాన్ని రచించాడు.

కాళీపట్నం కొండయ్య

కాళీపట్నం కొండయ్య (1900 - 1996) సుప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త మరియు పత్రికా సంపాదకులు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఈడూరు గ్రామంలో జన్మించారు. వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. డిగ్రీ పూర్తిచేశారు. అక్కడ జాతీయోద్యమ భావాలకు ప్రేరితులై భీమవరం ప్రాంతంలో జాతీయోద్యమం నిర్వహించారు. కొంతకాలం కళాశాలలో రసాయనశాస్త్రం బోధించారు. తర్వాత "వీరభారతి" అనే రహస్య మాసపత్రిక ప్రారంభించారు. ఇది ప్రజలలో మూఢ నమ్మకాలు తొలగింపుకు ఉపయోగపడేది. కొండయ్య చారిత్రిక పరిశోధన చేసి మహమ్మదీయ రాజ్యాలలో జాతీయ వికాసం అనే గ్రంథాన్ని రచించారు. "విజ్ఞానం" అనే వైజ్ఞానిక పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఖగోళ శాస్త్రంపై విశ్వరూపం గ్రంథం రాశారు. నిడదవోలు లో రసాయన పరిశ్రమ పెట్టారు.

కృష్ణకాంత్

కృష్ణకాంత్ (Krishan Kant (28 ఫిబ్రవరి 1927 – 27 జూలై 2002) భారత ఉపరాష్ట్రపతి గాను మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గాను వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన రాజకీయ నాయకుడు.

కృష్ణకాంత్ రాజకీయ జీవితం లాహోర్ లో విద్యార్థిదశలో క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలయింది. యువకునిగా భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తర్వాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిరా గాంధీ హయాంలో భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించి యంగ్ టర్క్ బ్రిగేడ్ లో పాల్గొన్నాడు. భారత పార్లమెంట్ లోను కాంగ్రెసు లో వివిధ పదవులు నిర్వహించి తర్వాత కాలంలో జనతా పార్టీ మరియు జనతా దళ్ లో చేరారు.

He was a member of the Executive Council, for several years, of the Institute for Defence Studies and Analyses.

కృష్ణకాంత్ పౌరహక్కుల సంఘానికి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా జయప్రకాష్ నారాయణ్ ప్రెసిడెంట్ గా 1976 లో పనిచేశారు. అత్యవసర పరిస్థితిని ఎదిరించినందుకు 1975 లో భారత జాతీయ కాంగ్రెసు నుండి బహిష్కరించబడ్డాడు. తర్వాత 1980 సంవత్సరం వరకు లోక్ సభ సభ్యునిగా పనిచేశారు. ఇతడు రైల్వే రిజర్వేషంస్ మరియు బుకింగ్స్ కమిటీకి ఛైర్మన్ గా 1972 -1976 ల మధ్య పనిచేశాడు.

మధులిమాయె తో కలిసి 1979 లో మొరార్జీ దేశాయి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.ఇతడు భారత అణువిధానాలను తీవ్రంగా సమర్ధించాడు.కృష్ణకాంత్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా వి.పి.సింగ్ ప్రభుత్వం 1989 లో నియమించింది. ఇతడు ఆ పదవిలో అత్యంత ఎక్కువకాలం అనగా ఏడు సంవత్సరాలు ఉపరాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డ వరకు కొనసాగాడు.

ఇతడు కాంగ్రెస్ మరియు యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి అభ్యర్థిగా భారత పార్లమెంటు కు ఉపరాష్ట్రపతి గా ఎన్నికయ్యాడు. ఇతడు కొత్తఢిల్లీ లో పదవిలో ఉండగానే పరమపదించాడు.

కేంద్రీయ విశ్వవిద్యాలయం

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (Central University) భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిధుల ద్వారా నిర్వహించబడుతున్న విశ్వవిద్యాలయాలు. ఇవి ప్రత్యేకమైన పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడ్డాయి.

గుంటుపల్లి జగన్నాధం

జగన్నాథం పొనుగుపాడు గ్రామంలో 1946 ఆగష్టు 20 న వ్యవసాయ కుటుంబానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య స్వగ్రామం పొనుగుపాడులోనే సాగింది. గుంటూరు ఎ.సి కాలేజిలో పి.యు.సి.చదివిన తరువాత ఐ.ఐ.టి. బెనారస్, హిందూ విశ్వవిద్యాలయం నుండి (వారణాసి, ఉత్తరప్రదేశ్) బి.యస్.సి. (మెటలర్జికల్ ఇంజనీరింగు) పట్టా (1969) పొందాడు.1980 లో ముంబాయి నుంచి యం.ఐ.ఐ.ఐ.ఇ. పట్టాను పొందాడు.

జయంత్ విష్ణు నార్లికర్

జయంత్ విష్ణు నార్లికర్. (1938 జూలై 19 ) భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఈ విశ్వంలో భూమిపై తప్ప మరెక్కడా జీవులు లేవా? అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్నదే. ఈ అంశంపై సాధికారికమైన పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో భారత దేశానికి చెందిన జయంత్‌ విష్ణు నార్లికర్‌ ఒకడు.

తరిమెల నాగిరెడ్డి

తరిమెల నాగిరెడ్డి (ఫిబ్రవరి 11, 1917 - జులై 28, 1976) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో నాగిరెడ్డి ఒకడు. అందరూ నాగిరెడ్డి గారిని టి.ఎన్ అని పిలిచేవారు.

తేళ్ల లక్ష్మీకాంతమ్మ

తేళ్ల లక్ష్మీకాంతమ్మ (జూలై 16, 1924 - డిసెంబర్ 13, 2007) ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు.తెలుగు పాప్ సింగర్ స్మిత ఈమె మనవరాలే. లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జన్మించింది. ఈమె స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.

లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందింది.పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.

లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితురాలు. నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ది ఇన్‌సైడర్‌లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు. ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.

లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో విజయవాడలోని తన కూతురు ఇంట్లో డిసెంబర్ 13, 2007న మరణించింది.

నార్ల తాతారావు

నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్.

నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన జన్మించాడు. కౌతవరంలోనే ప్రాథమిక విద్యనభ్యసించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్‌ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించాడు. పిదప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్‌ఈబీ) డివిజనల్‌ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపాడు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. 1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్‌ఈబీ ఛైర్మన్‌గా పనిచేసాడు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించినందుకుగాను 1983లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరు లలో విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించాడు.

రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించాడు. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.

నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించాడు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరుడు.

పేరాల భరతశర్మ

పేరాల భరతశర్మ సంస్కృతాంధ్రాలలో విద్వత్కవి, పండితుడు, అవధాని, నాటకకర్త మరియు నవలాకారుడు.

బాలి రామ్

డా: బాలిరాం 15వ లోక్‌సభలో బహుజన సమాజ్ పార్టీ తరుపున పార్ల మెంటు ఉత్తర ప్రదేశ్ లోని లాల్ గంజ్ (ఎస్.సి) పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

బూదాటి వెంకటేశ్వర్లు

బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) కవి, సాహిత్య విమర్శకుడు, భాషావ్యాకరణ పరిశోధకులు. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.

మదన్ మోహన్ మాలవ్యా

మదన్ మోహన్ మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.

మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.

మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్

గురూజీగా ప్రసిద్ధులైన మాధవ్ రావ్ సదాశివ రావ్ గోల్వల్కర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు రెండవ సర్ సంఘ్ చాలక్.

రేబాల దశరథరామిరెడ్డి

రేబాల దశరథరామి రెడ్డి ఆంధ్రప్రదేశ్ అయిదవ శాసనసభ (1972-1978) సభాపతిగా 1975వ సంవత్సరం జనవరి 28వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1978వ సంవత్సరము మార్చి 14వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగాడు.

ఇతని శాసనసభాపతి పదవీ కాలంలో 1976-77 సంవత్సరంలో మొదటి సారిగా అనుసూచిత వర్ణముల సంక్షేమ కమిటి, అనుసూచిత జాతుల సంక్షేమ కమిటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటి, లైబ్రరీ కమిటీలను ఏర్పాటు చేశారు.

వేపూరు హనుమద్దాసు

వేపూరు హనుమద్దాసు (19వ శతాబ్దం) భక్తకవి. ఆయన గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి. ఆయన బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు. మొత్తానికి రామాయణం ఎంత సనాతనమో అంత నిత్య నూతనంగా ఉంటుంది.

సూరారం కవిరంగదాసు

20వ శతాబ్దికి చెందిన వాగ్గేయకారుడు సూరారం కవిరంగదాసు. మహబూబ్ నగర్ జిల్లా సూరారం (కోయిలకొండ) గ్రామానికి చెందిన వాడు. ఎన్నో సంకీర్తనలు రచించారు. అంతే కాకుండా తాళపత్ర గ్రంథాలు రచించారు. ఇందులో జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, జలార్గ శాస్త్రము, మంత్ర శాస్త్రమునకు సంబంధించిన వివరణ ఉందని వీరి కుటుంబీకులైన శ్రీవైష్ణవ వేణుగోపాల్ తెలిపారు. ఇతని కీర్తనలు మహబూబ్ నగర్ జిల్లా అంతటా వ్యాప్తి చెందాయి. తన పేరుమీదనే కవిరంగ దాసునికి అంకితం ఇస్తున్నట్లు కీర్తనలు రచించారు. సూరారం గ్రామంలో వీరి పొలం దగ్గర పులిగట్టు గుహలో తపస్సు చేసి భగవంతుని సాక్షత్కారము పొందిన గొప్ప పండితుడు వాగ్గేయకారుడని సూరారం గ్రామ పెద్దలు చెప్పుకుంటారు. వీరి కుటుంబానికి చెందిన యువకవి శ్రీవైష్ణవ వేణుగోపాల్ శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలపై మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు. ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కాశీలో తెలుగు సాహిత్యంలో సరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు..

హాలికుడు (నాటకం)

హాలికుడు చెలమచెర్ల రంగాచార్యులు రచించిన తెలుగు నాటకం. ఇది 1940 సంవత్సరంలో మొదటి ముద్రణ పొంది; 1946 లో రెండవసారి ముద్రించబడినది.

సత్కవుల్ హాలికులైననేమి, కందమూల గౌద్ధాలికులైననేమీ అంటూ సగర్వంగా హాలిక వృత్తిని అవలంబించిన కవి- పోతన. ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవతం ఎంత ప్రఖ్యాతమో, తన కృతిని భగవంతునికి తప్ప మనుజేశ్వరాధములకు ఇవ్వనని పట్టిన పట్టూ అంతే ప్రసిద్ధము. పోతన జీవితాన్ని అల్లుకుని పాఠకుల్లో ఎన్నెన్నో కథలు ఉన్నాయి. వాటికి మూలసూత్రం పోతన, శ్రీనాథుడు బావ బావమరుదులు కావడం. ఇవన్నీ సాహిత్యలోకంలో పోతన, శ్రీనాథుల సాహిత్యాన్ని ఎలా చూస్తారన్న దానికి గీటురాయి. ఈ నాటక ఇతివృత్తం అటువంటి కథలతోనే అల్లుకుంది.

హైదరాబాదు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషా నిలయం వారు నిర్వహించ తలపెట్టిన ' పోతన సప్తాహము ' లో ప్రదర్శించుటకు మిత్రులు కోరగా ఈ నాటకాన్ని కవి రచించారు. ఇది రెడ్డి విద్యార్థి వసతిగృహంలో ప్రదర్శించినపుడు చూచిన శ్రీ చెన్నకేశవుల హనుమంతరావు నాయుడు గారు స్వయంప్రేరితులై నాటకాన్ని ముద్రించడానికి ఉత్సాహాన్ని చూపారు.

కవి ఈ గ్రంథాన్ని స్వతంత్రులై సత్సంకల్పం కోసం తమ సర్వస్వాన్ని సమర్పించే సాహసం గల సరసమైన కవులకు అంకితం చేశారు.

ఇది మద్రాసు విశ్వవిద్యాలయం వారి విద్వాన్ పరీక్షకు మరియు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారి ఇంటర్నీడియన్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించబడినది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.