ప్రజాతి

ప్రజాతి (ఆంగ్లం Genus) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను కుటుంబములో ఉంచుతారు.

The hierarchy of scientific classification

ప్రజాతి పేరు

ఒక మొక్క ప్రజాతి పేరు లాటినీకరణం చేయబడిన నామవాచక రూపం. ఇది పెద్ద అక్షరాలతో (Capital latter) తో ప్రారంభమవుతుంది.

 • కొన్ని ప్రజాతుల పేర్లు ప్రముఖ శాస్త్రవేత్తల గౌరవ సూచకంగా ఇవ్వబడ్డాయి.

ఉదాహరణ :

  • సిసాల్పినో - సిసాల్పీనియా (Caesalpinia)
  • బాహిన్ - బాహీనియా (Bauhinia)
  • హుకర్ - హుకేరియా (Hookerea)
  • టర్నిఫోర్ట్ - టర్నిఫోర్టియా (Tournefortia)
 • కొన్ని ప్రజాతుల పేర్లు ఆ మొక్కలను కనుగొన్న దేశాల వ్యవహారిక భాష నుండి వచ్చాయి.

ఉదాహరణ :

 • కొన్ని ప్రజాతుల పేర్లు రెండు, మూడు గ్రీకు లేదా లాటిన్ పదాల కలయిక వల్ల ఏర్పడ్డాయి.

ఉదాహరణ :

  • పాలిగాల = Poly + Gala
  • హైగ్రోఫిలా = Hygro + Phila
  • ఆస్టర్ కాంత = Aster + Cantha
  • ల్యూకాడెండ్రాన్ = Leuca + Dendron

మూలాలు

 • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
అడవిబాదం నూనె

అడవిబాదం నూనెగింజలనుండి శాక నూనెను ఉత్పత్తిచేయవచ్చును.అయితే ఇది ఆహారయోగ్యమైన నూనె కాదు. ఈనూనెను ముఖ్యంగా కుష్టు\కుష్ఠు వ్యాధి, మరియు క్షయవ్యాధుల నివారణ ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ చెట్టును ఇంకానిరడి/ది , చౌల్ మోగ్రా (హిందీలీ, గరుడఫల్ అనికూడా పిలుస్తారు.ఈ చెట్టుమల్పిగియలెస్ (Malpighiales) క్రమానికి, అకారియేసి (achariaceae) లేదా ఫ్లాకర్టియెసి ( Flacourtiaceae ) కుటుంబానికి చెందిన మొక్క, ప్రజాతి హిడ్నొకార్పస్ (hydnocarpus) కు చెందినమొక్క.ఇందులో సమానమైన ప్రవృత్తి గల మూడు రకాల మొక్కలున్నాయి.1.Hydnocarpus kurzii, 2. Hydnocarpus pentandrus, 3. Hydnocarpus laurifolia.ఈ చెట్టు ఆవిర్భ స్థలం ఆసియా ఉష్ణమండల ప్రాంతం, మరియు తూర్పు ఇండియా ఉపఖండ ప్రాంతం .తూర్పు ఇండియా అనగా భారతదేశంలోని పశ్చిమబెంగాల్ (వంగదేశం, బీహారు, జార్ఖండ్, మరియు ఒరిస్సాలు చేరియున్న ప్రాంతం .ఇది బ్రిటిషుపాలకులు కలకత్తాను రాజధాని చేసుకున్న రాజ్యప్రాంతం.

ఒడిసలు నూనె

ఒడిసలు లేదా ఆంగ్లంలో Niger seed అని పిలువబడే ఈమొక్కను నూనె గింజలకై సాగు చేస్తున్నారు. ఈమొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది.ప్రజాతి గజొటియ (guizotia). వృక్షశాస్త్రనామము: గజోటియ అబ్సైస్సినిక (guizotia abyssinica) .ఈమొక్క పుట్టుక స్థానం ఇథోఫియగా భావిస్తున్నారు. తెలుగులో వెర్రి నువ్వులు లేదా ఒడిసలు/ఒలిసలు .ఆంధ్ర ప్రదేశ్‍లో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఈపంటను బాగా సాగుచేస్తారు. ఒలిసలు మొక్క యొక్క మొదటి పుట్టుక స్థానం ఆఫ్రికాలోని ఇథియోపియాప్రాంతం

కందులు

కందులు (ఆంగ్లం Pigeon pea; లాటిన్ Cajanus cajan) నవధాన్యాలలో ఒకటి. భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు.

కుక్క

కుక్క (ఆంగ్లం Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా మరియు జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావించెదరు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది.

పశువు

గొడ్లు లేదా పశువులు మానవులకు ప్రియమైన పెంపుడు జంతువులుగా జీవించే క్షీరదాలు.

పిప్పలి

పిప్పలు లేదా పిప్పలి కారపు రుచిని కలిగిఉండు ఒక మిరియపురకం. దీనిని ఆంగ్లంలో భారతీయ పొడుగు మిరియాలు (Indian long pepper) అంటారు. ఇది ఒక పుష్పించే ఎగబ్రాకే మొక్కగా పెరుగుతుంది. దీనిని పండ్ల కోసం పెంచుతారు. ప్రతి పండులోను చిన్న చిన్న గింజలుంటార్యి. ఆ పండ్లను ఎండబెట్టి సీజనింగ్ చేసి మిరియాలు వలెనే ఉపయోగిస్తారు. ఈ రెండింటిలోనుండే ఆల్కలాయిడ్ పైపరిన్ (piperine) వీటి ఘాటు రుచుకి మూలకారణం.

పెసలు

పెసలు నవధాన్యాలలో ఒకటి. ఇవి భారతీయుల ఆహారంలో ముఖ్యమైనవి.

పెసర్లతో పెసరట్టు చేస్తారు. దీని పప్పును అనేక వంటలలో వాడుతారు.

పైన్ గింజల నూనె

పైన్ గింజల నూనె (pine seed oil) కొవ్వు ఆమ్లాలను కల్గిన శాక నూనె.ఈ నూనెను ఆంగ్లంలో pine seed oil లేదా pine nut oil అంటారు.పైన్ చెట్లు పైనేసి కుటుంబానికి చెందిన, పైనస్ ప్రజాతి, Pinoideae ఉపకుటుంబానికి చెందినవి. వీటిని శృంగాకార వృక్షాలు అంటారు.అనగా కొమ్ము వంటి కొమ్మల ,ఆకుల విన్యాసం వున్న చెట్లు.పైన్ గింజల నూనె ను వంతలలో మరియు ఔషదపరంగా వాడెదరు.విప్లవానికి ముందు కాలపు రష్యాలో పైన్ గింజల నూనెను కడుపు నొప్పి మరియు ప్రేవులకు సంబంధించిన సమస్యల నివారణకు మందుగా వాడేవారు.

ప్రొద్దు తిరుగుడు

ప్రొద్దు తిరుగుడు పువ్వునే సూర్యకాంతం పువ్వు (Sun flower) అంటారు. ఇది బంతి జాతి మొక్కకు చెందినది. ఒకే మొక్కలో అనేక లాభాలనుకునేవారికి అన్నిటికంటే ప్రొద్దుతిరుగుడు పువ్వే మిక్కిలి ముఖ్యమైనది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయీ ప్రొద్దుతిరుగుడు పువ్వును చిహ్నంగా పెట్టుకున్నాడు. అందుకే అతను సన్ కింగ్ అని పిలువబడేవాడు. విన్సెంట్ వాన్ గోఘ్ అనే చిత్రకారుడు అనేక సూర్యకాంతి పువ్వుల చిత్రాలను రమణీయంగా రూపొందించాడు.

సోయా బీన్స్, వేరుశనగ ఆముదపు గింజలలాగే ప్రొద్దుతిరుగుడు కూడా నూనె గింజ. దీనిలో పుష్కలంగా ప్రోటీన్లతోపాటు నూనె మరియు కాల్షియం లభిస్తాయి. దీని గింజనుంచి నూనె లభిస్తుంది. శాఖా సంబంధమైన ఈ వెజిటబుల్ నూనెను మార్గరిన్‌లో ఉపయోగిస్తారు. దీనిని దీసెల్ నూనెకు బదులుగా వాడతారు. విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని కొలిమిలోనూ, బాయిలర్లలోనూ ఇంధనంగా వాడతారు.దీని పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన పశువులకు బలమైన ఆహారంగా వినియోగపడుతుంది. ఒలిచిన ప్రొద్దుతిరుగుడు పప్పు పెంపుడు పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అనేక విధాలుగా ఉపయోగపడే ఈ ప్రొద్దుతిరుగుడు ఔషధాల తయారీకీ, రంగులు వేయడానికీ ఉపయోగిస్తారు. 1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలను స్పెయిన్‌కు తీసుకుపోయారు. అక్కడినుంచి ఈ విత్తనం మిగిలిన ఐరోపా, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు ప్రాకిపోయింది. ఈనాడు రష్యా దీనిని అతి విస్తారంగా పండిస్తూంది.

ఇది ఏక వార్షిక పంట.సెప్టెంబర్ నుంచి జనవరి వరకు దీనిని నాటుతారు. మేలు రకంగా ఉండాలంటే ఒకసారి పండించిన ప్రదేశంలో తిరిగి మూడు సంవత్సరాల వరకు దీనిని పండించరాదు. దీనిని మొక్కజొన్న, జొన్న, గోధుమ పంటలతో కలిపి కలగలుపు పంటగా కూడా పండించవచ్చు.సాధారణంగా ప్రొద్దుతిరుగుడు పువ్వు 1 నుండి 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అక్కడక్కడ 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ సులభంగా జరగడానికి మొగ్గ విడవడానికి ముందు రక్షక పత్రాలు వంటి స్కేల్ లీవ్స్ సూర్యునివైపు తిరుగుతాయి. మొగ్గ విడవడానికి ఒకటి రెండు రోజులు ముందు మొగ్గ స్థిరంగా తూర్పు దిక్కుగా తిరుగుతుంది. రేకలు వెనుక ఆకుపచ్చ రంగు నుంచి పసుపుపచ్చ రంగుగా మారిన వెంటనే వీటిని కోస్తారు. అప్పుడు గింజలలో తేమ 10 శాతం కంటే తక్కువగా ఉంటుంది. విత్తనాలు రసాయనికంగా మార్చుకోగలిగినప్పుడు సాంకేతికంగా ఇవి దీసెల్ నూనెతో సరిసమానంగా ఉంటుంది.

మినుములు

మినుములు (ఆంగ్లం Black gram) నవధాన్యాలలో ఒకటి. ఇవి భారతీయుల ఆహారంలో ముఖ్యమైనది.

గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి ఉద్దులు అనే పేరు కూడా ఉంది. కందులతో పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పుదాన్యాలలో కన్నా ఈమినుములు అత్యంత భలవర్థకము. మినుములను యదాతదంగాను వాడుతారు. లేదా పొట్టుతీసి పప్పును ఉపయోగిస్తారు. మినుములను పొట్టుతీసి మినప గుళ్ళుగాను వినియోగిస్తారు.

మూసా ప్రవక్త

మూసేసి కుటుంబానికి చెందిన అరటి ప్రజాతి మూసా కోసం ఇక్కడ చూడండి.

మూసా (అరబ్బీ موسى Musa ) మోషే (ఆంగ్లం : మోజెస్ Moses (క్రీ.పూ. 1436/1228 – 1316/1108 ) అబ్రహామిక మతస్తులకు గొప్ప ప్రవక్త. మొషే విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించాడు. మోషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపినట్టు యూదుల బైబిల్లో కథలున్నాయి. ఇతని సోదరుడు హారూన్ / అహరోను కూడా ఒక ప్రవక్తే. మూసా యూదు మత స్థాపకుడు. ఇతనిపై అవతరింపబడ్డ గ్రంధములలో ఒకటైన తోరాహ్ ప్రకటింపబడింది. ఈజిప్టు రాజైన ఫరో చక్రవర్తితో మాట్లాడి అల్లా అనుమతితో అనేక అద్భుతాలు చేసి ఎర్రసముద్రాన్ని చీల్చియూదులను ఈజిప్టు (ఐగుప్తు) నుండి పాలస్తీనా (మధ్యధరా సముద్రం మరియు జోర్డాన్ నది మధ్య ఉన్న దేశం) కు తరలిస్తాడు. ఫరో ఎర్రసముద్రంలో మునిగి చనిపోయేటప్పుడు అల్లాను నమ్ముతాడు.

మేక

మేక (ఆంగ్లం Goat) ఒక రకమైన జంతువు. ఈ మేకలు ఆసియా మరియు ఐరోపా దేశపు కొండ మేకను పెంపుడు జంతువుగా మార్పుచెందినవి. ఇవి బొవిడే కుటుంబానికి చెందినవి మరియు గొర్రె, జింక లకు సంబంధించిన కాప్రినే ఉపకుటుంబం లోనివి. ఇవి నెమరువేయు జంతువులు.

మేకలలో సుమారు 300 సంకర జాతులున్నాయి.మేకలు అతి పుతాతన కాలం నుండి మానవుడు పెంచుకుంటున్న జంతువులు. వేల సంవత్సరాల నుండి వీటిని పాలు, మాంసం, ఊలు మరియు తోలు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి. మేక మాంసాన్ని మటన్ అంటారు. నిక్కచ్చిగా చెప్పాలంటె chevon చెవన్ అని అంటారు.

మొక్కజొన్న

మొక్కజొన్న (Maize) ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. దీని శాస్త్రీయ నామము -"zea mays " . మొక్కజోన్నా చాల చౌకగా లభించే ఆహారము . దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్ , జీక్జాన్‌డిన్ " అనే ఎమినో యాసిడ్స్ ... మంచి యాంటి-ఆక్షిడెంట్లుగా పనిచేస్తాయి . విటమిన్లు :

లినోలిక్ ఆసిడ్, /విటమిన్ ఇ, బి 1, బి 6, /నియాసిన్, /ఫోలిక్ ఆసిడ్, /రిబోఫ్లావిన్ .. ఎక్కువ . /

రాగులు

రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. హిమాలయాల పర్వతసానువుల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు.

వేరుశనగ

వేరుశనగ (ఆంగ్లం : Groundnut) : వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.

వేరుశెనగ జన్మస్దలము దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికి చెందిన మొక్క. శాస్త్రీయ నామం arachis hypogaea legume'. అన్ని రకాల వాతావరణ పరిస్దితులను తట్టుకోగలదు. వేరుశనగ పుష్పాలు బయట ఫలధికరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారును.

శనగలు

శనగలు ఒక బలమైన ఆహారము.

భారతదేశము 5970000 టన్నులతో శనగల ఉత్పత్తిలో ప్రపంచములో అగ్రగామిగా ఉంది తరువాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది.

శనగలు ఆంధ్రప్రదేష్ లో కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో అధికంగా వర్షాదారంగా సాగవుతోంది. శనగలు మంచి పౌష్టికాహారము ఇందులో ప్రొటీనులు అధికంగా ఉంటాయి.

శనగల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 2005 లో

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division, faostat.fao.org

100 గ్రాముల శనగల్లో ఉండే గుణాలుమొత్తం శక్తి

686 kJ (164 kcal), కార్బోహైడ్రేడ్స్- 27.42 g, చక్కెర- 4.8 g, ఫైబర్ - 7.6 g, కొవ్వు పదార్తాలు -2.59 g,

saturated - 0.269 g, monounsaturated -0.583 g, polyunsaturated - 1.156 g, ప్రొటిన్లు - 8.86 g, నీరు - 60.21 g

విటమిన్ A - 1 μg (0%), థయమైన్ (విట. B1) - 0.116 mg (10%, బొఫ్లేవిన్ (విట. B2) -0.063 mg (5%)

నియాసిన్ (విట. B3) -0.526 mg (4%, పాంటోతెనిక్ ఆసిడ్ (B5) - 0.286 mg (6%, విటమిన్ B6 - 0.139 mg (11%)

ఫ్లోట్ (vit. B9) - 172 μg (43%), విటమిన్ B12 - 0 μg (0%), విటమిన్ C - 1.3 mg (2%), విటమిన్ E - 0.35 mg (2%)

విటమిన్ K - 4 μg (4%), కాల్షియం - 49 mg (5%), ఐరన్ - 2.89 mg (22%), మెగ్నిషియం -48 mg (14%),

పాస్పరస్ -168 mg (24%), పొటాషియం - 291 mg (6%), సోడియం - 7 mg (0%, జింక్ - 1.53 mg (16%).

శాస్త్రీయ వర్గీకరణ

శాస్త్రీయ వర్గీకరణ జంతువులకు మరియు మొక్కలకు చాలాsss ముఖ్యమైనది.

సజ్జలు

సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (మిల్లెట్) . దీన్ని ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ అని పిలుస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలుగా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.

సోయా నూనె

సోయా చిక్కుడు మొక్క అపరాలకు చెందిన మొక్క. వృక్షకుటుంబం ఫాబేసి, ప్రజాతి గ్లైసీన్. మొక్క వృక్షశాస్త్రనామము: గ్లైసీన్ మాక్స్

భారతదేశములో సోయా చిక్కుడు పంట సాగు 1977 నుండి మొదలైనది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో ప్రయోగాత్మంగా సాగుచేసి, దిగుబడులు ఆశాజనకంగామ, ప్రోత్యాహకరంగా వుండటంతో ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా సాగు మొదలైనది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.