పురపాలక సంఘం

పురపాలక సంఘం లేదా మున్సిపాలిటీ, భారతదేశంలో ఒక నగరాన్ని గాని పట్టణాన్ని గాని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. కార్పొరేషన్ కైతే మేయరు, పురపాలక సంఘానికైతే మున్సిపల్ ఛైర్మన్ ఉంటారు. వీరు ప్రజలచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడుతారు. పరిపాలనా యంత్రాంగం కొరకు నగర కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ నందు అధికారులు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపాలిటీలు ---- కార్పొరేషన్లు ------ మూడు గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం -- , మున్సిపాలిటీలు -- కార్పొరేషన్లు, ---- గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ [1] నిర్వహిస్తుంది.

కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రతిపాదనలు

ఆంధ్రపదేశ్

కొత్త కార్పొరేషన్లు: చిత్తూరు, ఒంగోలు

తెలంగాణ

కొత్త కార్పొరేషన్లు: ఖమ్మం,

కొత్తగా పురపాలక సంఘాల ఏర్పాటుకు నిబంధనల మార్పులు

కార్పొరేషన్ కావాలంటే మూడు లక్షల జనాభా చాలని చదరపు కిలోమీటరుకు కనీసం ఐదువేల జనాభా ఉండాలని మునిసిపల్ నిబంధనల్లో మార్పులు చేసినందువల్ల రాష్ట్రంలో కొత్తగా మరో 60 మునిసిపాలిటీలు, మరికొన్ని నగరపాలక సంస్థల ఏర్పాటుకు అవకాశం కలిగింది. గ్రేడ్-1, స్పెషల్, సెలక్షన్ గ్రేడ్ హోదాలో ఉన్న అనేక మునిసిపాలిటీలు కార్పొరేషన్‌లుగా అప్‌గేడ్ర్ అయ్యే అవకాశమేర్పడింది. ప్రతిపాదిత పట్టణంలో తగినంత జనాభా లేనిపక్షంలో సమీప గ్రామాలను విలీనం చేసుకునేందుకు కూడా వీలుంది. మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కనీస జనాభాను 20వేలకు కుదించారు.

పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు

కేంద్ర కేబినెట్ పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. (ఈనాడు 23.10.2009)

నగరపాలక సంఘాలు (ఆంధ్రప్రదేశ్)

మున్సిపాలిటీలలో కలుస్తున్న 100 గ్రామాలు

గుంటూరు జిల్లాలో మున్సిపల్‌ కేంద్రాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఊరిచివరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలను పట్టణాలలో కలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీలలో కలవడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల తీర్మానం లేకుండానే గ్రామాలను విలీ నం చేసుకోవాలని నిర్ణయించింది.

 • మహా గుంటూరు పరిధి:

నల్లపాడు, పెదపలకలూరు, కొరిటెపాడు, రెడ్డిపాలెం, పెదకాకాని, వెనిగండ్ల, అడవితక్కెళ్లపాడు, అగతవరప్పాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటుకూరు, తక్కెళ్లపాడు, బుడంపాడు, అంకిరెడ్డిపాలెం.

 • పొన్నూరు మున్సిపాలిటీ పరిధి...

చింతలపూడి, కసుకర్రు, పెద ఇటికంపాడు, కట్టెంపూడి, ఆలూరు, వడ్డిముక్కల

 • చిలకలూరిపేట మున్సిపాలిటీ...

గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు, బొప్పూడి, పోతవరం

 • నరసరావుపేట మున్సిపాలిటీ...

ఇసప్పాలెం, కేశానుపల్లి, రావిపాడు, యలమంద, లింగంగుంట్ల

 • మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి, మంగళగిరి, తెనాలి, బాపట్ల, రేపల్లె, తాడేపల్లి మున్సిపాలిటీలలో కలిసే గ్రామాలపై సర్వే కొనసాగుతోంది.
 • దాచేపల్లి, నడికుడి, నారాయణపురంలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి దాచేపల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబోతున్నారు.
 • భట్టిప్రోలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా కలిపి కొత్త మున్సిపాలిటీగా ప్రకటించబోతున్నారు. (ఆంధ్రజ్యోతి26.11.2009)

నగరపాలక సంఘాలు (తెలంగాణ)

ఉడా నియమాలు

అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ .హైదరాబాదు (హుడా), విశాఖపట్నం (వుడా), విజయవాడ (విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాభివృధ్ధి సంస్థ), వరంగల్‌, తిరుపతి (తుడా) .

 • ఉడా నియమాలు:
 1. లే అవుట్ అనుమతికి భూమిపై హక్కు నిర్ధారణ పత్రం చూపించాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికేట్, లేక నోటరీ అఫిడవిట్‌లు ఉండాలి.
 2. స్థలం భూసేకరణ ప్రతిపాదనలో లేదని తెలుపుతూ మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన నిరంభ్యంతర పత్రం చూపాలి.
 3. ఒకవేళ లే అవుట్ వేసే స్థలం రెసిడెన్షియల్ పరిధిలో లేకపోతే రెసిడెన్షియల్‌గా మార్చుకోవాలి. లేఔట్‌ పొందటానికి ఒక్కో ఎకరాకు దీనికి అభివృద్ధి నిధుల కింద రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది.
 4. స్థలం నుంచి ఎల్రక్టిక ల్ లైన్స్ వేసే ప్రతిపాదన లేదని తెలుపుతూ ట్రాన్స్ కో నుంచి నిరభ్యంతర పత్రం ఉండాలి.
 5. లే అవుట్ వేసిన భూమిలో 10 శాతం కామన్ సైట్‌గా వదలాలి. 40 అడుగుల రోడ్డు ఉండాలి.
 6. 10 టన్నుల బరువైన లారీ వెళ్ళినా రోడ్డు కుంగకుండా ఉండాలి.
 7. మొక్కలు నాటటం వంటి పనులన్నీ పూర్తయ్యాకే ఉడా చివరి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే ప్లాట్ల అమ్మకాలు జరపాలి.

ఇప్పటి వరకు ఉన్న లేదా రాబోతున్న పురపాలక సంఘాలను కలుపుకున్నా సరే గుంటూరు జిల్లా అత్యధిక పురపాలక సంఘాలున్న జిల్లాగా ఉంటుంది.

పురపాలక సంఘాలు జిల్లాల వారిగా (తెలంగాణ)

హైదరాబాద్ జిల్లా

(గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోయిన మున్సిపాలిటీలు, పంచాయతీలు.)

ఆదిలాబాదు జిల్లా

మహబూబ్ నగర్ జిల్లా

మెదక్ జిల్లా

నల్గొండ జిల్లా

నిజామాబాద్ జిల్లా

రంగారెడ్డి జిల్లా

జనగామ

పురపాలక సంఘాలు జిల్లాల వారిగా (ఆంధ్రప్రదేశ్)

అనంతపురం జిల్లా

చిత్తూరు జిల్లా

వైఎస్ఆర్ జిల్లా

తూర్పుగోదావరి జిల్లా

గుంటూరు జిల్లా

కృష్ణా జిల్లా

కర్నూలు జిల్లా

నెల్లూరు జిల్లా

ప్రకాశం జిల్లా

శ్రీకాకుళం జిల్లా

విశాఖపట్టణం జిల్లా

విజయనగరం జిల్లా

పశ్చిమగోదావరి జిల్లా

మున్సిపాలిటీలు

ఆంధ్రప్రదేశ్

రాజాం · విజయనగరం · బొబ్బిలి · పార్వతీపురం · సాలూరు · అనకాపల్లి · భీమునిపట్నం · అమలాపురం · తుని · సామర్లకోట · రామచంద్రాపురం · పిఠాపురం · మండపేట · పెద్దాపురం · భీమవరం · పాలకొల్లు · తాడేపల్లిగూడెం · నర్సాపురం · నిడదవోలు · తణుకు · కొవ్వూరు · మచిలీపట్నం · గుడివాడ · జగ్గయ్యపేట · నూజివీడు · పెడన  · తెనాలి · నరసారావుపేట · బాపట్ల · రేపల్లె · చిలకలూరిపేట · పొన్నూరు · మంగళగిరి · మాచర్ల · సత్తెనపల్లె · వినుకొండ · పిడుగురాళ్ళ · జంగారెడ్డిగూడెం

తెలంగాణ

జనగామ · జగిత్యాల · రామగుండం · సిరిసిల్ల · కోరుట్ల · మెట్ పల్లి · ఖమ్మం · కొత్తగూడెం · పాల్వంచ · ఇల్లెందు · భద్రాచలం · మణుగూరు · సత్తుపల్లి · ఆదిలాబాదు · బెల్లంపల్లి · మంచిర్యాల · నిర్మల్ · కాగజ్‌నగర్ · మందమర్రి · భైంసా · తాండూరు · వికారాబాదు · నల్గొండ · సూర్యాపేట · మిర్యాలగూడ · భువనగిరి · సంగారెడ్డి · సిద్దిపేట · సదాశివపేట · జహీరాబాద్ · మెదక్ · మహబూబ్‌నగర్ · గద్వాల్ · నారాయణపేట · వనపర్తి · కామారెడ్డి · బోధన్ · ఆర్మూరు

వనరులు

 1. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు
గుంతకల్లు (పట్టణం)

గుంతకల్లు (పట్టణం),ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదాతో ఉన్న పట్టణం.ఇదే పేరుగల మండలానికి కేంద్రం.పెద్ద రైల్వే జంక్షన్ తో కూడిన పట్టణం

జడ్చర్ల

జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల మండలానికి చెందిన పట్టణం.ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉన్న ముఖ్య కూడలి. హైదరాబాదు నుంచి కర్నూలు, బెంగుళూరు వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది బాదేపల్లి జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి పురపాలక సంఘం చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.

తాడిపత్రి

తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం.పిన్ కోడ్ నం. 515 411., ఎస్.టి.డి.కోడ్ నం. 08558.

నరసరావుపేట పురపాలక సంఘం

నరసరావుపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.

తొలుత నూతన పురపాలక సంఘం స్పెషల్ ఆపీసరుగా వి.పరబ్రహ్మశాస్త్రి భాధ్యతలు స్వీకరణతో 1915 జూన్ 18న ఏర్పడింది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 1922 జనవరి 8న న తొలి పురపాలక సంఘం చైర్మెనుగా ఎన్నికైనాడు.అతను మొదటి థపా 1922 జనవరి 8 నుండి 1922 మే 27 వరకు, రెండవ థపా 1922 జూన్ 22 నుండి 1924 జనవరి 15 వరకు చైర్మెనుగా పనిచేసాడు.నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది పనిచేసారు.ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేయుచున్నాడు.ఇది1980 ఏప్రియల్ 28న మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.

నాగర్‌కర్నూల్ పురపాలక సంఘం

నాగర్‌కర్నూల్ నగర పంచాయతి, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన పాలక సంస్థ.2011లో ఇది కొత్తగా ఏర్పడింది.అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014, మార్చి 30న తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి.

నారాయణపేట

నారాయణపేట, తెలంగాణ రాష్ట్రములోని నారాయణపేట జిల్లా,నారాయణపేట మండలానికి చెందిన గ్రామం/పట్టణం.

ఇది హైదరాబాదుకు 168 కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది.ఇది రెండవ గ్రేడు మున్సిపాలిటీగా కొనసాగుతోంది.

నారాయణపేట పురపాలక సంఘము

ఈ పురపాలకసంఘం మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటగా అవతరించింది. నారాయణపేట పురపాలక సంఘము తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత రెండవ పురాతన పురపాలక సంఘంగా ఘనతకెక్కింది. 1947లో అవతరించిన ఈ పురపాలక సంఘానికి సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన రాంచందర్ రావు కళ్యాణి తొలి చైర్మెన్ గా వ్యవహరించగా ఇప్పటివరకు 10 మంది ఈ విధులను నిర్వహించారు.ప్రస్తుతం ఇది మూడవశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతుంది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 33 వార్డులు, 48825 ఓటర్లు కలరు. 2014 మార్చి 30న జరగబోయే ఎన్నికలకై చైర్మెన్ స్థానాన్ని బీసి (మహిళ) కు కేటాయించారు.

ఈ పురపాలక సంఘం పరిధి 11.87 చకిమీ. 2001 ప్రకారం జనాభా 37,563 ఉండగా, 2011 నాటికి 41,539కు పెరిగింది. 2010-11 నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం 19.5, వ్యయము 19.27 కోట్ల రూపాయలు.

పట్టణం

పట్టణం (Town): సాధారణంగా ఒక జనావాస ప్రాంతం. ఇది గ్రామం కంటే పెద్దదిగానూ మరియు నగరము కంటే చిన్నదిగానూ వుంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా పురపాలక సంఘం (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.

పాలకొండ

పాలకొండ (ఆంగ్లం: Palakonda), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఈ పట్టణం పాలకొండ రెవిన్యు డివిజన్ మరియు మండల కేంద్రము. పాలకొండ పట్నం ఒక మేజర్ పంచాయతీ. పిన్ కోడ్ నం. 532 440., యస్.టీ.డీ.కోడ్ = 08941. ఇది నూతనంగా యేర్పడిన పురపాలక సంఘం. దీనికి 2014 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించింది.

1881లో ప్రచురితమైన భారతదేశ ఇంపీరియల్ గెజెట్టెర్ ప్రకారం, 1,300 కి.మీ.2 (502 చదరపు మైళ్ళు) వైశాల్యంతో పాలకొండ తాలూక వైజాగపట్టణం జిల్లాలో ఉండేది. సాగు భూములు నాగావళి నదిపై అధారపడి ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో 150 కి.మీ.2 వైశాల్యంగల అభయారణ్యం ఉంది. ఇక్కడ కోయ, సవర మరియు ఇతర కొండజాతులకు చెందిన సుమారు 11,000 జనాభా 106 గ్రామాలలో నివసిస్తున్నారు.

1891లో 2,01,331 జనాభాతో పోలిస్తే, 1901లో 2,15,376 జనాభా ఉంది.

బైంసా పురపాలక సంఘం

బైంసా (ఎం), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బైంసా మండలానికి చెందిన పట్టణం,గ్రామం

బోధన్ పురపాలక సంఘం

బోధన్,తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘం. బోధన్ పట్టణం నిజామాబాదు జిల్లాలోకెల్లా ప్రసిద్ధమైన పారిశ్రామిక కేంద్రం.వివిధ రకాలైన పంటలు సమృద్ధిగా పండే ఈ ప్రాంతాన్ని పూర్వం బహుధాన్యపురి అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు బోధన్గా మారి స్థిరపడింది. సుమారు 77వేల జనాభా గల ఈ మున్సిపాలిటీ పట్టణం నిజామాబాదుకు 28 కి. మీ. దూరంలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే యొక్క నిజామాబాదు - బోధన్ మార్గం ఇక్కడే అంతమౌతుంది. బోధన్ నగరపాలికను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు - బోధన్, రాకాసిపేట, శక్కర్ నగర్. ఒకప్పుడు ఆసియాలోనే పెద్దదిగా పేరు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ పట్టణంలోని శక్కర్ నగర్ లోనే ఉంది.

మెట్‌పల్లి పురపాలక సంఘం

మెట్‌పల్లి పురపాలక సంఘం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలానికి చెందిన పట్టణం. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మెట్‌పల్లిని 2004లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు, 37174 ఓటర్లు ఉన్నారు.మెట్‌పల్లిని ది.11.10.2016 నుండి రెవెన్యూ డివిజను కేంద్రంగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మెదక్ పట్టణం

మెదక్, తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణం,పురపాలక సంఘం.మెదక్ పట్టణం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మెదక్ పట్టణం 1952లో మునిసిపాలిటీగా ఏర్పడింది.ప్రస్తుతం ఇది జిల్లాలో గ్రేడ్ 2 హోదా కలిగిన ఏకైక పురపాలక సంఘం.పట్టణ ప్రస్తుతం విస్తీర్ణం 22 చ.కి.మీ.మేర విస్తరించి ఉంది.3 రెవెన్యూ వార్డులు, 27 ఎన్నికలు వార్డులు ఉన్నాయి.

వికారాబాద్

వికారాబాద్, తెలంగాణ రాష్ట్రములోని వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలానికి చెందిన పట్టణం.

ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్బనికి రైలుమార్గం ఉంది.

సంగారెడ్డి పురపాలక సంఘము

సంగారెడ్డి పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి.

సదాశివపేట

సదాశివపేట, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.

సదాశివపేట పురపాలక సంఘము

సదాశివపేట పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. 1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది. 2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది. 2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255. పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.

సాలూరు పురపాలక సంఘం

సాలూరు పురపాలక సంఘం, విజయనగరం జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఈ పట్టణానికి తూర్పున వేగావతి నది ప్రవహిస్తుంది. 2001లో 43,435 జనాభా ఉండగా, 2011 నాటికి 48,362కు పెరిగింది. తద్వారా దశాబ్ది జనాభా పెరుగుదల రేటు 10.18%గా నమోదుచేసుకొన్నది.

సిరిసిల్ల

సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.

ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
మున్సిపల్
కార్పొరేషన్లు
పురపాలక సంఘాలు
నగర పంచాయతీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజధాని
జిల్లాలు
ప్రధాన నగరాలు
తెలంగాణ పురపాలక సంఘాలు
నగరపాలక సంస్థలు
పురపాలక సంఘాలు
మరియు
నగర పంచాయతీలు
జిల్లాలు
పట్టణాలు

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.