పారిస్

పారిస్ ఫ్రాన్స్ దేశ రాజధాని మరియు ఆ దేశపు అతిపెద్ద నగరం. ఉత్తర ఫ్రాన్సులో సీన్ నదీతీరాన ఉన్న పారిస్‌కు రెండువేల సంవత్సరాల చరిత్రపైనే ఉన్నది. నవీన యుగానికి చెందిన వింతలలో ఒకటిగా భావించబడే ఈఫిల్ టవర్ ఈ నగరములోనే నిర్మించబడినది.

  1. INSEE local statistics, including Bois de Boulogne and Bois de Vincennes.
పారిస్
Paris
Seine and Eiffel Tower from Tour Saint Jacques 2013-08
Arc Triomphe (square)Notre Dame dalla Senna
Louvre Museum Wikimedia Commons
Clockwise from top: skyline of Paris on the Seine with the Eiffel Tower, Notre-Dame de Paris, the Louvre and its large pyramid, and the Arc de Triomphe
Flag of పారిస్ Paris

Flag
Coat of arms of పారిస్ Paris

Coat of arms
Motto(s): 
Fluctuat nec mergitur
"Tossed but never sunk"
దేశంఫ్రాన్సు
RegionÎle-de-France
DepartmentParis
Subdivisions20 arrondissements
ప్రభుత్వం
 • Mayor (2014–2020) Anne Hidalgo (PS)
విస్తీర్ణం
 • Land1105.4 కి.మీ2 (40.7 చ. మై)
జనాభా
(2018)
 • Population2
2,206,488
 • Population2 density21,000/కి.మీ2 (54,000/చ. మై.)
పిలువబడువిధము(ఏక)Parisian
Parisien(ne) (fr)
INSEE/Postal code
75056 / 75001–75020, 75116
జాలస్థలిwww.paris.fr
1 French Land Register data, which excludes lakes, ponds, glaciers > 1 km² (0.386 sq mi or 247 acres) and river estuaries. 2 Population without double counting: residents of multiple communes (e.g., students and military personnel) only counted once.
Paris Night
మోపానాసే టవర్ నుండి సాయంసంధ్య వేళ ఈఫిల్ టవర్ మరియు ఆకాశహర్మ్యములతో కనపడు పారిస్ పశ్చిమ భాగం
1981

1981 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 22

అక్టోబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 295వ రోజు (లీపు సంవత్సరములో 296వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 70 రోజులు మిగిలినవి.

ఆగష్టు 19

ఆగష్టు 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 231వ రోజు (లీపు సంవత్సరములో 232వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 134 రోజులు మిగిలినవి.

ఐరీన్ జూలియట్ క్యూరీ

ఐరీన్ జూలియట్ క్యూరీ (Irène Joliot-Curie) (1897 - 1956) సుప్రసిద్ధ వైజ్ఞానికవేత్త. ఈమె మేరీ క్యూరీ మరియు పియరీ క్యూరీ దంపతుల పుత్రిక. ఐరీన్ కు మరియు ఆమె భర్త ఫ్రెడెరిక్ జూలియట్తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ చరిత్రలో క్యూరీ కుటుంబం నోబెల్ పురస్కారాల కుటుంబంగా పేరుపొందింది.

ఐరోపా

సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. యురేషియా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం మరియు నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా మరియు ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది మరియు కాస్పియన్ సముద్రం ఉన్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా మరియు వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక మరియు రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు మరియు జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.

ఒలింపిక్ క్రీడలు

ఒలింపిక్ క్రీడలు (Olympic Games) ప్రతి నాలుగేళ్ళకొకసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు. మళ్ళీ క్రీ.శ. 1896లో ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ, దాదాపు నాలుగేళ్ళకోసారి (దీనికే ఒలింపియాడ్ అని కూడా పేరు) ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలు గా, పునఃప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్లో జరిగాయి. 2012లో లండనులో జరిగాయి.

కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ (మే 5, 1818 - మార్చి 14, 1883) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.

సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ(బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతం (బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ)ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.

మార్క్స్ ప్రకారం, రాజ్యాల ప్రజలందరి సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా చూపించుకున్నా, నిజానికి పాలకవర్గం ఆసక్తులకు అనుగుణంగా నడుస్తాయి. గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలోని వర్గ వైరుధ్యాలు దాని అస్థిరతకు, సంక్షోభానికి గురయ్యే లక్షణానికి కొంత కారణమై క్రమంగా కార్మిక వర్గం వర్గ చైతన్యాన్ని సాధించడానికి దారితీస్తుంది, ఇది వారు రాజకీయ ఆధిపత్యాన్ని సాధించేందుకు, చివరకు ఉత్పత్తిదారుల స్వేచ్ఛా సంఘటితంగా ఏర్పడే ప్రభుత్వం ద్వారా వర్గ రహిత, కమ్యూనిస్టు సమాజం స్థాపనకు దారితీస్తుంది. మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు.కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందింది. ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, కార్మిక సంఘాలు, కళాకారులు, రాజకీయ పార్టీలు మార్క్స్ ఆలోచనాధార, తాత్త్వికత, కృషిలకు ప్రభావితం అయ్యాయి, చాలామంది ఆయన ఆలోచనను స్వీకరించడమో, మార్పుచేసుకోవడమో చేశారు. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు.మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి.

వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామె క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.

జూలై 21

జూలై 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.

జూలై 5

జూలై 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 186వ రోజు (లీపు సంవత్సరములో 187వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 179 రోజులు మిగిలినవి.

తెనాలి

ఈ వ్యాసం తెనాలి నగరం గురించి; తెనాలి మండలం గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.

తెనాలి (Tenali), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఒక నగరం,అదే పేరుగల మండలానికి కేంద్రం. ఈ నగరాన్ని ఆంధ్ర పారిస్' అని కూడా పిలుస్తారు. ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలొని ముఖ్యమైన నగరం.

ఫిబ్రవరి 17

ఫిబ్రవరి 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 48వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 317 రోజులు (లీపు సంవత్సరములో 318 రోజులు) మిగిలినవి.

ఫ్రాన్సు

ఫ్రాన్స్ లేదా అధికారికంగా ఫ్రెంచ్ గణతంత్రం, పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.ఫ్రాంసుకు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.

ఫ్రాన్స్ ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన ఫ్రాంసు "ది హేక్స్సాగాన్" (షడ్భుజి)) అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా (ఉత్తరం నుండి గడియారం భ్రమణం వలె) బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, మొనాకో, స్పెయిన్, అండొర్రా ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో బ్రెజిల్, సురినామ్ (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ (సెయింట్-మార్టిన్‌తో సరిహద్దు కలది)లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా యునైటెడ్ కింగ్డంతో కలుపబడింది.

ఫ్రాన్స్ వైశాల్యపరంగా ఐరోపా సమాఖ్యలో అతి పెద్దదేశంగానూ అలాగే ఐరోపాలో ( రష్యా, ఉక్రెయిన్ల తరువాత) 3 వ స్థానంలో ఉంది. ఐరోపాయేతర భూభాగాలైన ఫ్రెంచ్ గయానా వంటి వాటిని కలిపితే అది 2 వ స్థానంలో ఉండేది. బలమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, రాజకీయప్రభావంతో ఫ్రాన్స్ అనేక శతాబ్దాల పాటు ప్రబల శక్తిగా ఉంది. 17 - 18వ శతాబ్దాలలో ఫ్రాన్స్ ఉత్తర అమెరికాలోని అధికభాగాలను వలసలుగా చేసుకుంది. 19వ - 20వ శతాబ్దాల ప్రారంభంలో, ఉత్తర, పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని అధికభాగాలను, ఆగ్నేయ ఆసియా, అనేక పసిఫిక్ ద్వీపాలను చేర్చుకోవడం ద్వారా ఆ కాలంలో రెండవ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది.

ఫ్రాన్స్ ఒక అభివృద్ధిచెందిన దేశంగా పరిగణించబడుతుంది. నామమాత్ర జి.డి.పి పరంగా 5వ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. కొనుగోలుశక్తి పరంగా 8వ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. సంవత్సరానికి 82 మిల్లియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తూ ప్రపంచంలో అత్యధికంగా సందర్శింపబడే దేశంగా ఉంది. ఫ్రాన్స్ ఐరోపా సమాఖ్య స్థాపకసభ్యులలో ఒకటిగా ఉండి అన్ని సభ్యదేశాల కంటే ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంది. అది ఐక్యరాజ్య సమితి స్థాపక సభ్యదేశాలలో కూడా ఒకటిగా ఉంది. ఫ్రాంకోఫోనీ, జి 8, జి 20, నాటో, ఒ.ఇ.సి.డి, వరల్డ్ ట్రేడ్ యూనియన్, లాటిన్ యూనియన్‌లలో సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఐదు శాశ్వత సభ్యదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ప్రపంచంలో అధిక అణు ఆయుధాలను కలిగిన 3వ దేశంగానూ ఐరోపా సమాఖ్యలో అత్యధిక అణుఇంధన కేంద్రాలను కలిగి ఉన్నదేశంగా ఉంది.

బీజింగ్

బీజింగ్ (చైనీస్ 北京 =Běijīng) (ఆంగ్లం: Beijing) పూర్వపు పేరు పెకింగ్ (Peking) చైనా లోని ఒక మెట్రోపాలిటన్ నగరం మరియు రాజధాని. చైనా నాలుగు ప్రాచీన చైనా రాజధానులులలో బీజింగ్ ఒకటి.

బీజింగ్, చైనాలో షాంఘై తరువాత రెండవ పెద్ద నగరం.

భారతదేశ నకలు హక్కుల చట్టం

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

మే 1

మే 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరములో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.

మైథిలీ రామస్వామి

మైథిలీ రామస్వామి బాల్యంలో తిరునెల్వేలి జిల్లాలోని కడయంలో గడిచింది. స్కూలులో ఆమెకు ప్రేరణకలిగించే గణిత ఉపాధ్యాయులు లభించారు. ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం వలన ఆమెకు గణితం అంటే ఆరాధన ఏర్పడింది. ఆమె దాయాది సోదరుడు పి.ఎస్. సుబ్రహ్మణ్యం ద్వారా టి.ఐ.ఎఫ్.ఆర్ గురించి తెలుసుకుని కాలేజ్ చదువు కొరకు ముంబై పోవడం ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.

మొదటి ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధం , గ్రేట్ వార్ , లేదా వార్ టు ఎండ్ ఆల్ వార్స్ గా పిలువబడే మొదటి ప్రపంచ యుద్ధం ( WWI లేదా WW1 ) ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం 28 జూలై 1914 నుండి 11 నవంబరు 1918 వరకు కొనసాగింది. చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా 60 మిలియన్ల మంది యూరోపియన్లు సహా 70 మిలియన్ల మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు . తొమ్మిది మిల్లియన్మంది మనుషులు మరియు ఏడు మిలియన్ పౌరులు యుద్ధంలో (అనేక జాతుల యొక్క బాధితులతో సహా) మరణించారు , యుద్ధనౌకలు ' సాంకేతిక మరియు పారిశ్రామిక ఆడంబరంతీవ్రతరం చేశాయి, మరియు వ్యూహాత్మక ప్రతిష్టంభన కందక యుద్ధానికి దారితీసింది. ఇది చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఘర్షణలలో ఒకటి మరియు ప్రధాన రాజకీయ మార్పులకు దారితీసింది, ఇందులో అనేక దేశాలలో విప్లవాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత మాత్రమే వివాదాస్పద ప్రత్యర్థులు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి.

ఈ యుద్ధం ప్రపంచంలోని ఆర్ధిక గొప్ప శక్తులలో , రెండు ప్రత్యర్థి కూటములలో సమావేశమయింది:మిత్రరాజ్యాలు ( రష్యా సామ్రాజ్యం యొక్క ట్రిపుల్ ఎంటెంట్ , ఫ్రెంచ్ థర్డ్ రిపబ్లిక్ మరియు గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ యొక్క యునైటెడ్ కింగ్డం ) జర్మనీ మరియు ఆస్ట్రియా-హంగరీ యొక్కసెంట్రల్ పవర్స్ . జర్మనీ మరియు ఆస్ట్రియా- హంగరీలతో పాటుగా ట్రిపుల్ అలయన్స్లో ఇటలీసభ్యుడు అయినప్పటికీ, సెంట్రల్ పవర్స్లో చేరలేదు, ఎందుకంటే ఆస్ట్రియా-హంగరీ సంధి యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా దాడి చేసింది. ఈ కూటములు పునఃవ్యవస్థీకరణ చేయబడ్డాయి మరియు విస్తరించబడ్డాయి, ఎందుకంటే ఎక్కువ దేశాలు యుద్ధంలోకి ప్రవేశించాయి: ఇటలీ, జపాన్మరియు యునైటెడ్ స్టేట్స్ మిత్రరాజ్యాలు చేరాయి, ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు బల్గేరియాసెంట్రల్ పవర్స్లో చేరాయి.

ఈ యుద్ధానికి ట్రిగ్గర్ ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యగా ఉంది , ఆస్ట్రియా-హంగరీ సింహాసనంకు వారసుడు, 28 జూన్ 1914 న సారజేవోలో యుగోస్లావ్ జాతీయవాద గవ్రిలో ప్రిన్సిపట్ చేత. ఈ దౌత్యపరమైన సంక్షోభాన్ని ఆస్ట్రియా-హంగేరికి అంత్య సెర్బియా రాజ్యం , మరియు అంతకుముందు దశాబ్దాల్లో ఏర్పడిన అంతర్జాతీయ పొత్తులు కూడా ఉపయోగించబడ్డాయి.వారాలలోనే ప్రధాన శక్తులు యుద్ధంలో ఉన్నాయి మరియు ఈ సంఘర్షణ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.

జులై 24-25 జూలైలో రష్యా సైన్యం పాక్షిక సమీకరణకు ఆదేశించిన మొదటిది, మరియు జూలై 28 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది, జులై 30 న రష్యా సాధారణ సమీకరణను ప్రకటించింది. డిసెంబరు 1 న రష్యాపై యుద్ధం ప్రకటించాలని జర్మనీ నిరాకరించడానికి రష్యాకు ఒక అల్టిమేటం సమర్పించింది. తూర్పు ఫ్రంట్లో మించి ఉండటంతో, పశ్చిమాన రెండవ ద్వారం తెరవడానికి రష్యా తన ట్రిపుల్ ఎంటెంట్ మిత్రపక్షాన్ని కోరింది. నలభై సంవత్సరాల క్రితం 1870 లో,ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం ముగిసింది మరియు ఫ్రాన్స్ అల్సిసే-లోరైన్ప్రావిన్సులను ఒక ఏకీకృత జర్మనీకి అప్పగించింది. ఆ ఓటమిపై తీవ్రత మరియు అల్సాస్-లారైన్ను తిరిగి పొందాలనే నిర్ణయం సులభమైన ఎంపిక కొరకు రష్యా యొక్క అభ్యర్ధనను ఆమోదించింది, కాబట్టి ఫ్రాన్స్ ఆగష్టు 1 న పూర్తిగా సమీకరణ ప్రారంభమైంది మరియు ఆగస్టు 3 న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య సరిహద్దు భారీగా రెండు వైపులా బలపర్చబడింది, ష్లిఫ్ఫెన్ ప్లాన్ ప్రకారం, జర్మనీ తరువాత తటస్థమైన బెల్జియం మరియు లక్సెంబర్గ్లుఉత్తరం నుండి ఫ్రాన్స్ వైపు వెళ్లడానికి ముందు యునైటెడ్ కింగ్డమ్కు జర్మనీపై యుద్ధం ప్రకటించటానికి దారితీసింది. బెల్జియన్ తటస్థత ఉల్లంఘన. ప్యారిస్పై జర్మన్ మార్చ్ మార్న్ యుద్ధంలో నిలిపివేయబడిన తరువాత, 1917 వరకు తక్కువగా మార్చబడిన కందక రేఖతో , పశ్చిమయుద్ధతంత్రం ఘర్షణ పోరాటంలో స్థిరపడింది. తూర్పు ఫ్రంట్లో , రష్యన్ సైన్యం ఆస్ట్రో-హంగేరియన్లకు వ్యతిరేకంగా ఒక విజయవంతమైన ప్రచారం నిర్వహించింది, కానీ జర్మన్లు తనేన్బర్గ్ మరియు మస్యూరియన్ లేక్స్ యుద్ధాల్లో తూర్పు ప్రుస్సియా దండయాత్రను ఆపివేశారు. నవంబరు 1914 లో, ఒట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్లో చేరింది, ఇది కాకసస్ , మెసొపొటేమియా మరియు సీనాయిల్లోప్రారంభ సరిహద్దులను ప్రారంభించింది. 1915 లో, ఇటలీ మిత్రరాజ్యాలు చేరింది మరియు బల్గేరియా సెంట్రల్ పవర్స్లో చేరింది; రోమేనియా 1916 లో మిత్రరాజ్యాలు చేరింది, అలాగే 1917 లో యునైటెడ్ స్టేట్స్ చేసింది.

మార్చ్ 1917 లో రష్యన్ ప్రభుత్వం కూలిపోయింది మరియు నవంబరులో ఒక విప్లవం తరువాత మరింత సైనిక ఓటమి కారణంగా రష్యన్లు బ్రెట్స్ట్-లిటోవ్స్క్ ఒప్పందం ద్వారా సెంట్రల్ పవర్స్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు , దీనికి జర్మన్లు ​​గణనీయమైన విజయాన్ని అందించారు. 1918 వసంతకాలంలో పశ్చిమ ఫ్రంట్ వెంట ఒక అద్భుతమైన జర్మన్ దాడి తర్వాత, మిత్రరాజ్యాలు విజయవంతంగా పోరాడుతూ , జర్మనీలను విజయవంతమైన దాడుల వరుసలో నడిపించాయి.నవంబరు 4, 1918 న, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం యుద్ధ విరమణకు అంగీకరించింది, మరియు జర్మనీ, విప్లవకారులతో తన సొంత ఇబ్బందులను ఎదుర్కొంది , నవంబరు 11, 1918 న యుద్ధనౌకకు మిత్రరాజ్యాల విజయానికి ముగింపును అంగీకరించింది.

యుద్ధం ముగిసిన వెంటనే లేదా జర్మనీ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం ఉనికిలో లేనంత వరకు నిలిచిపోయాయి. జాతీయ సరిహద్దులు పునర్నిర్వహించబడ్డాయి, 9 స్వతంత్ర దేశాలు పునరుద్ధరించబడ్డాయి లేదా సృష్టించబడ్డాయి మరియు జర్మనీ యొక్క కాలనీలు విజయం సాధించినవారిలో పాల్గొన్నారు.1919 పారిస్ పీస్ కాన్ఫరెన్స్ సమయంలో, బిగ్ ఫోర్ (బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇటలీ) ఒప్పందాల వరుసలో తమ నిబంధనలను విధించాయి. అటువంటి వివాదం యొక్క పునరావృతాన్ని నివారించే లక్ష్యంతో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. ఈ ప్రయత్నం విఫలమైంది, ఆర్థిక మాంద్యం, పునరుద్ధరించబడిన జాతీయత, బలహీనపడిన వారసత్వ రాష్ట్రాలు, మరియు అవమానకరమైన భావాలు (ముఖ్యంగా జర్మనీలో) చివరకు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో దోహదపడింది.

యునెస్కో

ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం మరియు సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది.[1] ఇది నానాజాతి సమితి యొక్క వారసురాలు కూడా.

యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.

హుసేన్ సాగర్

హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.