పడమర

పడమర లేదా పశ్చిమ (ఆంగ్లం: West) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది తూర్పుకి వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా పటములో పడమర ఎడమ వైపు ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజు పడమర పైపు అస్తమిస్తాడు.

ఎనిమిది దిక్కులు
ఎనిమిది దిక్కుల సూచిక.
అశోకవృక్షం

అశోకవృక్షం (ఆంగ్లం: Ashoka tree లేదా "sorrow-less") (S. asoca (Roxb.) Wilde, or Saraca indica L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది భారతదేశం మరియు శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.

అశోకం ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని సరాకా (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా ఆకులతో నిండివుంటుంది. వీని పుష్పాలు మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.

ఖమ్మం

ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం .

గోల్కొండ

గోల్కొండ కోట మరియు నగరము. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు.g 1336 A. D.లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.

ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ మరియు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి మరియు దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

ఝాన్సీ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఝాంసీ జిల్లా ఒకటి. ఝాంసీ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,746,715 .

1891లో ఝాంసీ జిల్లాతో లలిత్‌పూర్ ప్రాంతం ఝాంసీ జిల్లాతో చేర్చబడింది. 1974లో లలిత్‌పూర్ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది.

ఝాన్సీ (ఆంగ్లం: Jhansi; హిందీ: झांसी) భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం మరియు జిల్లా ముఖ్యపట్టణము. ఇది ఒక ప్రధానమైన రహదారి మరియు రైల్వే జంక్షన్. ఝాన్సీ పట్టణము రాతితో కట్టిన ఝాన్సీ కోట (ఝాంసీ ఫోర్ట్) చుట్టూ అభివృద్ధి చెందినది.

జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (నేషనల్ హైవే డెవెలెప్మెంట్ ప్రాజెక్ట్) మూలంగా ఝాన్సీ త్వరగా అభివృద్ధి చెందుతున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారిని కలిపే ఉత్తర-దక్షిణ కారిడార్ మరియు తూర్పు-పడమర కారిడార్ లు రెండూ ఝాన్సీ మీదుగా ప్రయాణిస్తాయి.

తూర్పు

తూర్పు (East) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఉదయించేసూర్యుడుకి ఎదురుగా నిలబడితే మన ముందు ఉన్న దిశను తూర్పు అని అంటారు. సాధారణంగా ఉపయోగించే మాప్ లో తూర్పు దిక్కు కుడి వైపున ఉంటుంది.

తూర్పు దిశను "పూర్వ దిశ" అని కూడా అంటారు. పడమర దిక్కు దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.

తెలుగు సినిమాలు 1976

ఈ యేడాది 65 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మహానటుడు అక్కినేని తనకు ప్రభుత్వం కేటాయించిన 14 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ను జనవరి 14న ఆరంభించారు. మరో మహానటుడు నందమూరి ముషీరాబాద్‌లోని తన సొంతస్థలం మూడున్నర ఎకరాలలో రామకృష్ణా సినీస్టూడియోస్‌ను జూన్‌ 7న ప్రారంభించారు. ఈ యేడాది భాస్కరచిత్ర 'ఆరాధన' సూపర్‌ హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకుంది. కె.బాలచందర్‌ విభిన్న శైలిలో రూపొందించిన 'అంతులేని కథ' కూడా సూపర్‌ హిట్‌ అయింది. "మనుషులంతా ఒక్కటే, నేరం నాదికాదు ఆకలిది, సెక్రటరీ, పాడిపంటలు, ఇద్దరూ ఇద్దరే, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ" డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. అంతకు ముందు డైరెక్టుగా లేదా సింగిల్‌ షిఫ్టుతో మన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కాని ఇక్కడ నుండి ఎక్కువ షిప్టింగులతో శతదినోత్సవాలు జరుపుకోవడం మొదలయింది. ఆ విధంగా "అమెరికా అమ్మాయి, అల్లుడొచ్చాడు, జ్యోతి, తూర్పు-పడమర, నా పేరే భగవాన్‌, బంగారు మనిషి, భలే దొంగలు, మొనగాడు" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. బాపు 'సీతాకళ్యాణం' ప్రజాదరణ పొందలేకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది. కె.రాఘవేంద్రరావు, క్రాంతి కుమార్‌ కలయికలో రూపొందిన 'జ్యోతి' మంచి విజయం సాధించింది. జయప్రద, జయసుధ నటీమణులుగా ఈ యేడాది గుర్తింపు సంపాదించారు.

అంతులేని కథ

అల్లుడొచ్చాడు

అమెరికా అమ్మాయి

అత్తవారిల్లు

ఆడవాళ్లు అపనిందలు

ఆదిమానవులు

ఆరాధన

ఉత్తమురాలు

ఊరుమ్మడి బ్రతుకులు

ఒక అమ్మాయి కథ

ఒక దీపం వెలిగింది

ఓ మనిషి తిరిగి చూడు

కొల్లేటి కాపురం

పాడవోయి భారతీయుడా

బంగారుమనిషి

భలేదొంగలు

బ్రహ్మముడి

భక్త కన్నప్ప

తల్లిమనసు

తూర్పు పడమర

దశావతారాలు

దేవుడిచ్చిన భర్త

దేవుడే గెలిచాడు

దేవుడు చేసిన బొమ్మలు

దొరలు దొంగలు

నాడు నేడు

నాపేరే భగవాన్

నేరం నాదికాదు ఆకలిది

నిజం నిద్రపోదు

పల్లెసీమ

ప్రచండవీరుడు

పాడవోయి భారతీయుడా

పిచ్చోడిపిళ్ళి

పీటలమీదపెళ్ళి

పెద్ద అన్నయ్య

పెళ్ళికాని పెళ్ళి

పొగరుబోతు

పొరుగింటి పుల్లకూర

ప్రేమాయణం

ప్రేమబంధం

మనిషి మృగము

మనిషి మృగము

మనుషులంతా ఒక్కటే

మగాడు

మహాత్ముడు

మహాకవి క్షేత్రయ్య

మహేశ్వరి మహత్యం

మనవడి కోసం

మనఊరి కథ

మంచికి మరో పేరు

మాదైవం

మాయావి

మాంగల్యానికి మరో ముడి

ముద్దబంతి పువ్వు

ముగ్గురు మూర్ఖులు

ముత్యాల పల్లకి

మొనగాడు

మోసగాడు

మోసగాళ్ళకి సవాల్

యవ్వనం కాటేసింది

రాధ

రాజువెడలె

రామరాజ్యంలో రక్త పాతం

రత్తాలు రాంబాబు

వధూవరులు

వింతఇల్లు సంతగోల

వేములవాడ భీమకవి

శీలానికి శిక్ష

శ్రీరాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్

శ్రీతిరుపతి వేంకటేశ్వరకళ్యాణం

సంసారంలో సరిగమలు

స్వామి ద్రోహులు

సిరిసిరి మువ్వ

సీతాకళ్యాణం

సీతమ్మ శపథం

సుప్రభాతం

సెక్రటరీ

దక్షిణ అమెరికా

దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.

ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు మద్య ఒక ఆకు వలె కనిపించును.

ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు.

దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.

దక్షిణ మధ్య రైల్వే రైళ్ళు

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తూర్పు, పడమర మరియు భారతదేశం యొక్క ఉత్తరం నుండి బయలు దేరే రైళ్లు అనుసంధానం, మరియు ఇంటర్ కనెక్టడ్ రైల్వే మార్గం, మరియు దక్షిణ భారతదేశంకు గమ్యస్థానం, వీటి దిక్కుల మధ్య వివిధ రైళ్లు నడుపుతూ, వివిధ స్టేషన్లు బాగా అభివృద్ధి పరచడం వలన ఇది ఒక కీలకమైన జోన్‌గా భావిస్తారు.

సికింద్రాబాద్ దీని ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో అత్యధిక ప్రాంతము దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండగా, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం మాత్రము తూర్పు తీర రైల్వే, విశాఖపట్నం డివిజను పరిధి లో ఉంది. దక్షిణ మధ్య రైల్వే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొద్ది ప్రాంతములలో కూడా విస్తరించి ఉంది.

దశదిశలు

దిక్కు లేదా దిశ రెండూ ఒకటే.

తూర్పు (East)

ఆగ్నేయం (South-East)

దక్షిణం (South)

నైఋతి (South-West)

పడమర (West)

వాయువ్యం (North-West)

ఉత్తరం (North)

ఈశాన్యం (North-East)

భూమి (క్రింది ప్రక్క)

ఆకాశం (పైకి)ఈ పదింటిని దశదిశలు అంటారు. వీనిలో మొదటి ఎనిమిదింటిని అష్టదిక్కులు లేదా అష్టదిశలు అంటారు

నాగపూర్ (మహారాష్ట్ర)

నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం, మహారాష్ట్ర రెండవ రాజధాని. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం. ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.

నాగపూర్ మొదటిగా గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ కు కేంద్రంగా చేసుకుంది.

రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా, నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు - పడమర ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 6, ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 7 కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.

పద్మ పురాణం

పద్మ పురాణం (ఆంగ్లం: Padma Purana) హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ పురాణం యొక్క రాతప్రతులు వివిధ పాఠాంతరాల రూపంలో లభ్యమౌతున్నాయి. వీటిలో రెండు ముఖ్యమైనవి. ఈ రెండింటి మధ్యలో చాలా తేడాలున్నాయి. ఒకటి భారతదేశం తూర్పు ప్రాంతానికి చెందినది కాగా మరొకటి పడమర ప్రాంతానికి చెందినది. ఇది 55,000 శ్లోకాలు కలిగిన పెద్ద గ్రంథాలలో ఒకటిగా చెప్పబడుతున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతులలో సుమారు 50,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలోని పాఠ్యాన్ని మేళవించిన విధానాన్ని పరిశీలిస్తే ఇది వివిధ యుగాలలో వేర్వేరు రచయితలు రాసిన వేర్వేరు విభాగాలను సంకలనం చేసినట్లుగా కనిపిస్తుంది. ఇందులో సృష్టి నిర్మాణం, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ముఖ్యంగా (రాజస్థాన్ లోని బ్రహ్మదేవాలయం ) తీర్థయాత్రలు, వాల్మీకి రామాయణంలోని సీతా రాముల కథ కన్నా భిన్నమైన కథనం, పండగలు, ఎక్కువగా విష్ణువును కీర్తించే, కొంచెం శివుని, కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగా, ఆత్మను గురించిన తాత్విక వివరణ, అద్వైతం, మోక్షం లాంటి అంశాలను స్పృశించారు.

రాశి

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు.

సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.

వరంగల్ పట్టణ జిల్లా

వరంగల్ పట్టణ జిల్లా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

ఈ జిల్లా పరిపాలన కేంద్రం వరంగల్ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.

వరుణుడు

వరుణుడు అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు పడమర దిక్కుకు అధిపతి. వరుణుడిని వరుణదేవుడు, వానదేవుడు అని కూడా అంటారు. ఇతనికి జ్యేష్ఠాదేవి ద్వారా అధర్ముడు అనే కొడుకు కలిగాడు.

వరుణుడి పట్టణం శ్రద్ధావతి.

వరుణుడి ఆయుధం పాశం.

వరుణుడి వాహనం మొసలి.

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం వున్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లా గా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా లో భాగమైంది.

ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. Map

శ్రీలంక

శ్రీలంక (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు మరియు ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతము నకు మరియు సంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు మరియు ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

టీ, కాఫీ, రబ్బరు, మరియు కొబ్బరి కాయల ఎగుమతులకు శ్రీలంక ప్రసిద్ధి గాంచింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక వాణిజ్య వ్యవస్థ, ప్రకృతి అందాలు సముద్ర తీర ప్రాంతాలు, మరియు అడవులు ఘనమైన సంస్కృతి మరియు నాగరికతలు దీనిని పర్యటక కేంద్రంగా నిలుపుతున్నాయి. రెండు వేల సంవత్సరాలపాటు చిన్న రాజ్యాలుగా పాలింపబడిన శ్రీలంకకు, 16వ శతాబ్దం మొదటి భాగంలో పోర్చుగీసు వారి రాకతో విదేశీయుల రాక ఆరంభమైంది. 1815వ సంవత్సరంకల్లా బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948 లో స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈశాన్య ప్రాంతంలో పొంచిఉన్న తమిళ పులులు.

హవాయి

హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్టు 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ రేఖాంశం, 157°47′47″ అక్షాంశాలపై ఉంది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19వ శతాబ్దంలో హవాయిని శాండ్విచ్ ద్వీపాలని కూడా వ్యవహరించేవారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.