నిమిషము

నిమిషము అనేది ఒక కాలమానము. ఒక గంటలో 60 వ భాగం నిముషం. ఇది 60 సెకండ్ల కాలానికి సమానము.

నిముషం కోణానికి కూడా ఒక కొలమానం. కోణాన్ని కొలిచేటపుడు ఒక నిముషం అంటే డిగ్రీలో 60 వ వంతు. ఇది 60 ఆర్కు సెకండ్లకు సమానం.

క్రియలు (శుద్ధిపరచు పద్ధతులు)

హతయెగమందు ఈ యెగ ప్రక్రియలు వివరించబడినవి. ప్రధాన క్రియలు - ఘట శోధన ప్రక్రియలు : ఘటము అనగా శరీరము. శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు (షట్క్రియలు)

ముఖ్య గమనిక: ఈ పద్ధతులను అనుభవముగల యొగ గురువుల వద్ద చూచి నేర్చుకొనవలెను. కేవలము చదివి ప్రయత్నము చేయవద్దు.

'ధౌతి నేతి బస్తి నౌలి త్రాటకం తదా కపాలభాతి,ఏతాని షట్కర్మాణి ప్రచక్సతె' -1. ధౌతి : అనగా శరీరములోని అన్తర భాగములను కడుగుట. (నీరుతొ గాని, వాయువుతొ గాని, పలుచని కిచిడీతొగాని, మెత్తటి నూలు వస్త్రముతొ గాని నొటి ద్వారమునుండి ఉదరము వరకు శుద్ద్ది చేయట.) ధౌతి వలన కఫదొషములు తొలగును.జీర్ణాశయము బాగుగా పనిచేయును.ఆస్త్మావ్యాధి తగ్గు అవకాశము కలదు

2. నేతి : అనగా నాసిక రంద్రములను నీటితొ గాని, పాలతొ గాని, సూత్రముతొ గాని కడుగుట. (నేతి - జలనేతి, సూత్రనేతి, దుగ్ధనేతి మరియు ఘృతనేతి - అని నాలుగు విధములు.) నేతి క్రియ వలన శ్వాస సంబంధిత రొగములు, జలుబు రొగములు, తలబరువు తగ్గును.

3 .బస్తి ; యెనీమా ప్రక్రియ .బస్తి ; యెనీమా ప్రక్రియ వలన మలబద్దకము, మూలవ్యాధి తొలగును. రాబొవు రాచ వ్యాధులు ( కేన్షర్ వ్యది) రావు.

4. నౌలి: దక్షిణ, మధ్య,వామ అని మూడు విధములు. నౌలి ప్రక్రియ వలన విషపూరితమగు ఆహారము కూడా జీర్ణమగును. శాస్త్రము ప్రకారము మరణము రాదు.

5. త్రాటకము: అనగా ఏకాగ్రత . దీపములో గాని, ఉదయించు సూర్య చంద్రుల వేపు గాని ద్రిష్టిని నిలుపుట. త్రాటకము వలన ఏకాగ్రత పెరుగును. అన్త్రర్గత శక్తులు బయిటకు వఛ్చును.

6. కపాలభాతి :కపాలము అనగా తల భాగము.వాయువును నాసాగ్రముల ద్వారా వేగముగా బైటకు పదె పదె వదలుట. కపాలభాతి వలన శిరస్సు లోని భాగములు శుభ్రమగును.కంటికి, చెవులకు, ముక్కునకు, మెదడుకు ఛాల మంఛిది.

ఈ క్రియల వలన చాల శారీరక మానసిక లాభములు ఉన్నాయి. ఈ క్రియలను సుర్యొదయమునకు ముందుగా చేయుట మంచిది.

నంది ఉత్తమ నేపథ్య గాయకులు

The Nandi Award for Best Male Playback Singer started in the year 1977.

నిమి

నిమి ఇక్ష్వాకుపుత్రులలో ఒకఁడు. ఇతఁడు ఒకానొక సమయమునందు ఒక యాగము చేయ కోరి తన పురోహితుఁడైన వసిష్ఠుని ఒద్దకు పోయి తాను చేయఁబూనిన యజ్ఞమును నడపింప ప్రార్థించెను. అందులకు అతఁడు నన్ను ఇంతకుముందే ఇంద్రుఁడు తన యజ్ఞమునకు అధ్వర్యుఁడుగా వరించి పోయి ఉన్నాఁడు కనుక ఆయజ్ఞమును నెఱవేర్చివచ్చి నీయజ్ఞమును నడపెదను అని చెప్పెను. దానికి ఇతఁడు కోపించి ఆయనను విడిచి గౌతమఋషిని వరించి ఆయనచేత యజ్ఞమును సాగించెను. అనంతరము వసిష్ఠుఁడు ఇంద్రుని యజ్ఞమును నెఱవేర్చివచ్చి ఇతనియొక్క ఇంటివాకిట చేరి కాచి ఉండెను. అప్పుడు బడలికచేత పగలు అని ఎంచక ఇతఁడు నిద్రించుచు ఉండెను కనుక ఆవృత్తాంతము విచారింప అనుకూలింపక పోయెను. అంతట వసిష్ఠుఁడు కులగురుఁడను అగు నన్ను విడిచి యజ్ఞము చేయుటగాక నేనువచ్చి వాకిట నిలిచి ఉన్నను విచారింపక మత్తుఁడై నన్ను అవమానించిన ఈదుష్టుఁడు అంగహీనుఁడు అగుగాక అని శపించెను. అది హేతువుగ ఇతఁడును వసిష్ఠుని అట్లే శపించెను. అపుడు బ్రహ్మ వీరి తెఱఁగు ఎఱిఁగి నిమిని సకల ప్రాణుల కనుఱెప్పలయందు వసించునట్లును, వసిష్ఠుని మిత్రావరుణులకు కొడుకై దేహధారి అగునట్లును అనుగ్రహించెను. కనుకనే ఱెప్పపాటునకు నిమిషము అను పేరు కలిగెను. ఇతని కొడుకు మిథిలుఁడు.

............. పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

నీటి శుద్ధీకరణ

నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు జీవావరణమును కలుషితము చేసే తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్ధతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్దమైన పద్ధతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్కులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము.

నీటిలో కలసిన అవసరము లేని రేణువులను, పరాన్న జీవులను, బాక్టీరియాని, ఆల్గేని, వైరస్ లను, ఫంగి; మరియు వర్షము లాగా పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసేటటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్ధాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు.

తాగు నీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వము చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి.

నీటిని చూచి పరీక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినది అని చెప్పుట సాధ్యము కాదు. తెలియనటువంటి ప్రదేశములోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్ధతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటివద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ద భూగర్భ జలము కూడా ఈ రోజులలో ఒక వేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలెను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్దీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకొనే మార్గము.

2007 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారము, 1.1 బిలియను ప్రజలకు అభివృద్ధి పరచిన తాగు నీరు సరఫరా అందుబాటులో లేదు, సంవత్సరములో నమోదైన 4 బిలియన్ల అతిసార వ్యాధి కేసులలో 88% రక్షిత నీరు మరియు తగినంతగా లేని ఆరోగ్యకరమైన వాతావరణము మరియు పరిశుభ్రత లేకపోవటము వల్లనే సంభవించినవి అని ఆపాదించటము జరిగినది, మరియు ప్రతి సంవత్సరము 1.8 మిలియన్ల ప్రజలు అతిసార వ్యాధితో మరణిస్తున్నారు. WHO ఈ అతిసార వ్యాధి కేసులలో 94% కేసులను రక్షిత నీటితో సహా పర్యావరణానికి సవరణలు చేయుట ద్వారా అరికట్టవచ్చునని అంచనా వేసింది. సాధారణ ఉపాయాలైనటువంటి క్లోరినేషన్, వడపోత పరికరాలు, సూర్యరశ్మి ద్వారా క్రిములను తొలగించుట, మరియు రక్షిత నిలువ సామాగ్రులలో నీటిని నిలువ ఉంచుట వంటి ఇంటి వద్ద పాటించేటటు వంటి పద్ధతుల ద్వారా యేటా అతి పెద్ద సంఖ్యలో జీవితాలను కాపాడవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి ద్వారా సంభవించే వ్యాధులను అరికట్టటము ఒక పెద్ద ప్రజారోగ్య లక్ష్యము.

సెకను

సెకను అనగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణికాలలో (SI) సమయం యొక్క మూల ప్రమాణం మరియు ఇతర కొలత వ్యవస్థలలో సమయ ప్రమాణం కూడా, గంట సమయాన్ని 60 ద్వారా భాగిస్తే వచ్చే సమయాన్ని నిమిషము అంటారు, మళ్ళీ నిమిషాన్ని 60 తో భాగించగా వచ్చే సమయాన్ని సెకను అంటారు. సెకన్ను ఆంగ్లంలో సెకండ్ (second) అంటారు. సెకను చిహ్నం: s, సంక్షిప్తంగా s లేదా sec తో సూచిస్తారు. సెకన్లను యాంత్రిక, విద్యుత్ లేదా అటామిక్ గడియారములను ఉపయోగించి లెక్కిస్తారు.

సెకను యొక్క ఉపవిభాగాలను సూచించడానికి సెకను పదంతో అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణిక పూర్వపదాలను (SI prefixes) తరచుగా కలుపుతారు. ఉదాహరణకు మిల్లీసెకను (సెకను యొక్క వెయ్యివ భాగము), మైక్రోసెకను (సెకను యొక్క పదిలక్షో వంతు), నానోసెకను (సెకను యొక్క వందకోట్లో వంతు).

అలాగే SI పూర్వపదాలు సెకను యొక్క గుణిజాలు ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కిలోసెకను (వెయ్యి సెకన్లు) వంటివి, అయితే ఇటువంటి యూనిట్లు ఆచరణలో చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

సాధారణంగా సమయం యొక్క ప్రమాణాలు SI ప్రమాణాలు సూచించే పది యొక్క శక్తులుగా ఏర్పడి ఉండవు, దానికి బదులుగా సెకండ్ ను 60 చే గుణించగా నిమిషము రూపము, దీనిని 60 చే గుణించగా ఒక గంట, దీనిని 24 చే గుణించగా ఒక రోజు అవుతుంది.

లిప్తపాటు కాలాన్ని క్షణము అంటారు. ఐదు క్షణాలు ఒక సెకను.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.