దురద

దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు మరియు కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.

యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.

Pruritus
Classification and external resources
Itch
వీపు పై గోకడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి
ICD-10L29
ICD-9698
DiseasesDB25363
MedlinePlus003217
eMedicinederm/946
MeSHD011537

కారణాలు

  • సంక్రమణ (Infection)
  • ఎక్కువ సేపు నీటిలో గడపడం.
  • మందులు
  • ఇతర కారణాలు

దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు

  • కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
  • నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను మరియు వదరుబోతులను సంబోధిస్తారు.
  • కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.
Scabies-burrow
Scabies is one cause of itching.
CercariaDermatitis
Swimmer's itch
Athletes
Athlete's foot
ఆముదం చెట్టు

ఆముదం ఒకరకమైన నూనె చెట్టు. ఆముదం చెట్టులలో ఎరుపు, తెలుపు, పెద్దాముదం అను మూడు రకములు ఉన్నాయి. తెలుపు, ఎరుపు రంగులు గల పుష్పాలను బట్టి, పెద్దవైన ఆకులను బట్టి వీటిని గుర్తించాలి. చిన్న ఆకులు కలిగిన చిట్టాముదపు చెట్టు మిక్కిలి శ్రేష్ఠమైనది. ఆముదపు గింజల నుండి ఆముదము నూనె తయారుచేస్తారు.

ఈజిప్ట్ దేశంలో క్రీ.పూ. 4000 సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. గ్రీకు ప్రయాణీకులు ఆముదపు నూనెను దీపాలు వెలిగించుకోడానికి మరియు లేపనముగా ఉపయోగించారు.

ప్రపంచ ఆముదపు గింజల ఉత్పత్తి సంవత్సరానికి ఒక మిలియను టన్నులు. వీనిలో భారతదేశం, చైనా మరియు బ్రెజిల్ ముఖ్యమైనవి. ఆముదం ఒకరకమైన నూనె చెట్టు . ఆముదం చెట్లలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులన్నాయి. చిన్న ఆకులు గల ఆముదం చెట్టునే చిట్టాముదపు చెట్టు అంటారు. ఇది పెద్దాముదము చెట్టుకన్న శ్రేష్ఠమైనది. పొడవైన అయిదు కొనలు కలిగి అరచేయిలాగా ఆకు ఉంటుంది. ఆరోగ్యాన్ని అందివ్వటంలో మాదెప్పుడూ పై చేయి అన్నట్లుగా ఈ చెట్ట ఆకులు ఎల్లప్పుడూ పైకి ఎత్తుకునే ఉంటాయి. క్రిందికి వాలవు. ఆముదము చెట్టు లక్షణాలు * బహువార్షిక పొద. * 6-10 నొక్కులు గల హస్తాకార సరళ పత్రాలు. ఆకులకు పొడవైన కాడలుండును. * అగ్రస్థ శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు. * ఫలం 3 నొక్కులు గల రెగ్మా. కాయ లోపల మూడు గింజలుండును. కాయపైన మృదువైన ముండ్లుండును. గుణాలు... ఇది కారం, చేదు రుచులతో వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. సమస్త వాతరోగాలనూ పోగొట్టడంలో అగ్రస్థానం దీనితే. కడుపులోను, పొత్తికడుపులోను వచ్చే నొప్పులను, రక్తవికారాలను నివారింప చేస్తుంది. మొలలు హృద్రోగము, విషజ్వరము, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర బంధము మొదలైన సమస్యలను కూడా సులువుగా పోగొడుతుంది. శరీరంలో పేరుకుపోయిన దుష్ట విష పదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది. నరాలకు సత్తువ కలిగిస్తుంది. కడుపు నొప్పిని తగ్గించటంలో ఇంత నాణ్యమైనది మరొకటి లేదని కూడా చెప్పవచ్చు. ఆముదం వల్ల ఉపయోగాలు : * భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. దీనిని దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం. * చైనా వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కొన్ని తరాలనుండి ఉపయోగిస్తున్నారు. * దీపావళి రోజు భారతీయులు ఆముదపు కాడలకు నూనె దీపాలుగా చేసి వెలిగించడం వల్ల పరలోకాలలో పిత్రుదేవతలను ప్రార్ధిస్తారు. ఆరోగ్య పరంగా : చెవిపోటుకు... ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ్చచేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధు రం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుంది. శరీరంపై నల్ల మచ్చలకు... ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాముల శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్లమచ్చలన్నీ సమసిపోతాయి. బోదకాళ్ళకు... ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే మిగిలే వరకు మరగబెట్టి, వడపోసి, ఆ నూనెలో సగభాగం తేనె మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని నిలువ ఉంచి, బోదకాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది. దగ్గుకు... ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే దగ్గులు తగ్గిపోతాయి. మూత్రపిండ వ్యాధులకు... మంచి ప్రశస్తమైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది గ్రాముల మోతాదుగా నియమబద్ధంగా శారీరక శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపోతుంది. మూత్ర కోశంలోని రాళ్ళు కరిగిపోతాయి. అరికాళ్ళ మంటలకు... ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళం్ళ మంటలు అణగిపోతాయి. కీళ్ళ నొప్పులకు... ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిలేే్లడు చిగురాకులు, పొగాకు చిగురాకులు వీటిని భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించి పోతాయి. సుఖనిద్రకు... ఎర్రాముదం చెట్టు వేరు 10 గ్రాములు మోతాదుగా తీసుకొని నలగ్గొట్టి పావు లీటర్‌ నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా మరగబెట్టి, వడపోసి త్రాగితే సఖంగా నిద్ర పడుతుంది. అతి నిద్రకు... ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టువేసి, తల పైన కూడా వేసి కట్టుకడితే అతి మగతగా ఉండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది. రేచీకటికి... మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గి పోతుంది.

ఇక్థియోసిస్ వల్గారిస్

ఇక్థియోసిస్ వల్గారిస్ (Ichthyosis vulgaris) అనునది వంశ పారంపర్యంగా సంక్రమించు చర్మ సంబంధ అసాధారణ స్థితి. ఈ వ్యాధి ఉన్నవారి చర్మం పొడిబారి, పొలుసులుగా విడిపోతుంది. ప్రతి 250 మందిలో ఒక్కరు దీని బారిన పడతారు. తల్లిదండ్రులలో ఎవరి ద్వారా నైనా ఒక అసాధారణ జన్యువు సంక్రమించటంతో ఈ వ్యాధి సోకుతుంది.

ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. చాలా తక్కువగా దురద ఉండటం, శరీరం కనిపించే లాగా బట్టలు వేసుకోలేకపోవటం తప్పితే వేరే ఎటువంటి హాని ఉండదు.

స్వేదం ఈ వ్యాధి తీవ్రతని తగ్గించటం మూలాన, తేమ వాతావరణం ఉన్న ప్రదేశాలు వ్యాధిగ్రస్తులకి క్షేమం. ఎయిర్-కండిషన్, మద్యం దీని తీవ్రతని పెంచవచ్చును.

ఉల్లిపాయ

ఉల్లిపాయ (Onion) కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది.ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్‌ అని, ఇంగ్లీషులో ఆనియన్‌ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు. దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది .

ఎక్జిమా

ఎక్జిమా (terumala) అనేది ఒక చర్మవ్యాధి. లేదా బాహ్యచర్మంపై వాపుగా ఉండే ఒక వ్యాధిగా చెప్పవచ్చు. ఎక్జిమా అనే పదాన్ని నిరంతర చర్మపు పరిస్థితులకు ఎక్కువగా వర్తిస్తారు. వీటిలో పొడి మరియు ఆవర్త చర్మపు దద్దురులతో సహా ఈ క్రింది వాటిలో ఒకటి లేదా ఎక్కువ వ్యాధి లక్షణాలచే సూచించబడతాయి: ఎరుపు, చర్మపు వాపు (వాచడం), దురద మరియు పొడితనం, బాహ్య పొరలో మార్పు, పెచ్చు, పొక్కులు, పగుళ్లు, కారడం లేదా రక్తం రావడం. తాత్కాలిక చర్మపు కాంతి కోల్పోయిన ప్రదేశాలు కనిపించవచ్చు మరియు కొన్నిసార్లు ఇవి మానిన గాయాల మచ్చలు కావచ్చు. ఒక మానిన గాయాన్ని గోకడం వలన రేగిన కారణంగా మచ్చ ఏర్పడవచ్చు. ఎక్జిమాని ఉర్టికారియా వలె భావించవచ్చు. పొడవ్యాధికి విరుద్ధంగా, ఎక్జిమా తరచూ కీళ్ల యొక్క ముడిచే ప్రదేశాల్లో అధికంగా ఏర్పడుతుంది.

కంద

తెలుగులో కంద అన్నా "కంద గడ్డ" అన్నా అర్థం ఒక్కటే. ఇది భూమిలో పెరిగే ఒక దుంప. తెలుగు వారు వాడే కూరగాయలలో కందకి ఒక స్థానం ఉంది. అడవులలో తిరిగే మునులు "కందమూలాలు" తిని బతికేవారని చదువుతూ ఉంటాం. అంటే, వారు ఆహారంగా పనికొచ్చే దుంపలు (tubers), వేళ్లూ (roots) తినేవారని అభిప్రాయం.

గజ్జి

గజ్జి (ఆంగ్లం: Scabies) ఒక విధమైన పరాన్న జీవి వలన కలిగే అంటు వ్యాధి. ఇది చర్మంలో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన దురద, పుండ్లు మరియు వాపు కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం లాటిన్ స్కేబెర్ అనగా గోకడం నుండి వచ్చింది.

జఘన జుట్టు

జఘన కేశాలు లేదా ఆతులు మానవ జననేంద్రియాలపై మొలిచే జుట్టు. ఈ జుట్టు మానవులలో శైశవ దశలో ఉండనప్పటికీ బాల్యములో దీని పెరుగుదలకు బీజం పడుతుంది. యుక్త వయస్సు వచ్చే నాటికి స్త్రీ పురుషులలో ఈ జుట్టు పూర్తి స్థాయిలలో పెరగడం ఆరంభమౌతుంది. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా దీనిని శుభ్రం చేసుకోవడం ప్రతి మానవుని బాధ్యత. లేనిచో జననేంద్రియాల వద్ద దురద, నవ లేదా ఇతర చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుతాయి.

జీడి

జీడిపప్పు అనకార్డియేసి అనే వృక్ష జాతికి చెందింది. దీనిని తెలుగులో జీడిమామిడి చెట్టు అంటారు.

ఆ ఆంగ్ల పేరు జీడిమామిడి చెట్టు యొక్క పోర్ట్యుగీస్ పేరు అయిన కాజు నుంచి పుట్టింది. ఈ పేరు కూడా టూపి పదం అయిన ఆకజూ నుంచి వచ్చింది. ఈ చెట్టు ఉష్ణమండలాల్లో జీడిపప్పు మరియు జీడి పండ్ల ఉత్పత్తి కోసం విరివిగా పెంచబడుతుంది.

జీడి లేదా జీడి మామిడి (Cashew) అని కూడా అంటారు. ప్రకృతిలోనే జీడిపండు ఒక అద్భుతం. అన్ని పండ్లకీ పిక్క[గింజ] లోపల ఉంటే...దీంట్లొ అది బయటకె కనపడుతూ ఉంటుంది. ఇది ఇసుక నేలల్లో పండే పంట. జీడి పళ్లు వేసవిలో వచ్చే పళ్ళు. ఈ పళ్ళను తింటారు. చాలా వగరుగా వుంటాయి. ఈ జీడి రసం కొంచెం ప్రమాదకరం. బట్టల మీద పడితే ఆ మరక వదలదు. మానవ చర్మం మీద పడినా, కొంచెం ప్రమాదమె. ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమలు పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి అనేక కుటుంబాలు బ్రతుకు తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతి దారులు, భారత దేశానికి, విలువైన విదేశీ మారక ద్రవ్యం సంపా దించి పెడుతున్నారు.

దద్దుర్లు

దద్దుర్లు అనునవి చర్మంపై లేత ఎరుపు, లేవనెత్తిన దురద గడ్డలు పెంపొందించేవి.

దూలగొండి

దూలగొండి లేదా దురదగొండి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది ఫాబేసి (చిక్కుడు) కుటుంబానికి చెందినది. ఇవి అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన ముళ్ళు కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపచేసిన దురద కలుగును.

పుదీనా నూనె

పుదీనా నూనె ఒక ఆవశ్యక నూనె.ఇది ఔషధతైలం.బ్రాండి పుదీనా ఆయిల్ మరియు పుదీనా ఔషధతైలం 'అని కూడా పిలుస్తారు.ఆంగ్లంలో మింట్ ఆయిల్ మరియు పిప్పరుమింటు ఆయిల్ అని కూడా అంటారు. పుదీనా నూనె మనస్సును ఉత్తేజపరచుటకు, మానసిక ఉద్వేగాలను క్రమపరచుటకు, మరియు దృష్టిని పెంచడానికి, సువాసనను ఉపయోగిస్తారు. పుదీనా నూనె మానసిక చికాకు మరియు దురదను తగ్గిస్తుంది.చర్మాన్ని చల్లబరచటానికి పుదీనా నూనె ఉపయోగపడును. పుదీనా ఆకులను వంటలలో కూరలలో ఉపయోగిస్తారు.పుదీనా ఆకులు కూరలకు మంచి ఘాటైన రూచి మరియు సువాసన ఇస్తుంది.పుదీనా నూనె వలన పలు వైద్యపరమైన ప్రయోజనాలు కలవు.

మజ్జిగ

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

మార్కండేయుడు

మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.

వెంట్రుక

జంతువుల శరీరంలో చర్మం మీద మొలిచిన వెంట్రుకలను రోమాలు అంటారు. తల మీద మొలిచిన వెంట్రుకలను జుట్టు , శిరోజాలు, అంటారు. వెంట్రుకను సంస్కృతంలో కేశం అంటారు.

సామెతలు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").

సామెతలు - ఇ

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").

ఇక్కడ "ఇ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.

రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

సామెతలు - క

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").

ఇక్కడ "క" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.

రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

సోరియాసిస్

చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ (ఆంగ్లం: Psoriasis). దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి ముఖ్యముగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. సరియైన చికిత్స లేనట్లైతే ఈ వ్యాధి జీవితాంతముంటుంది. కొన్ని వాతావరణ పరిస్తితులలో వ్యాధి పెరగడము, తగ్గడమూ సర్వసాధారణము.దీర్ఘకాలం బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. సొరియాసిస్ బాధితులు శారీరకంగా ఇబ్బందిపడుతూ, మానసికంగా నలిగిపోతూ వుంటారు. అందుకే దీనిని మొండి వ్యాధిగా పరిగణిస్తారు.

సొరియాసిస్ అంటే దీర్ఘకాలం కొనసాగే చర్మవ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపుని కలిగి ఉండవచ్చు. చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల వంటి ఇతర శరీర భాగాలు కూడా ఈ వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. చర్మంపై పొలుసులుగా వచ్చినప్పుడు గోకితే కొవ్వత్తి తాలికలను పోలిన పొట్టు రాలుతుంది. పొలుసులు తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి. నిజానికి సొరియాసిస్ ప్రధాన లక్షణం దురద కాదు. అయితే వాతావరణం చల్లగా ఉంది, తేమ తగ్గిపోయినప్పుడుగానీ, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడుకానీ దురద ఎక్కువ అవుతుంది. బాధితుల్లో 10-30శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా సంభవిస్తాయి.

సొరియాసిస్ సాధారణంగా కుడి, ఎడమల సమానతను ప్రదర్శిస్తుంది. సొరియాసిస్ ఎక్కువకాలం బాధిస్తుంటే అది సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా మారుతుంది.

కారణాలు: సొరియాసిస్ వ్యాధి ఏర్పడటానికి మానసిక ఒత్తిడినుంచి ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా సొరియాసిస్ రావచ్చు. జీర్ణవ్యవస్థలో లోపాలవల్ల కూడా సొరియాసిస్ రావచ్చని తాజా ప7రిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.