దండమూడి రాజగోపాలరావు

దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 - ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1] ఈయన 1963లో విడుదలైన నర్తనశాల[2] సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు[3] సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.

రాజగోపాలరావు, కృష్ణా జిల్లా, గండిగుంట గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కోడి రామ్మూర్తి నాయుని స్ఫూర్తితో బరువులు ఎత్తటం ఒక వ్యాసంగంగా స్వీకరించాడు. కొంతకాలం బరువులెత్తడంలో శిష్ట్లా సోమయాజులు వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత కొల్లి రంగదాసుతో పాటు సంచరిస్తూ అనేక రాష్ట్రాలు మరియు దేశాలలో ప్రదర్శనలిచ్చాడు.

రాజగోపాలరావుకు అనసూయతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు - ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి. రాజగోపాలరావు 1981, ఆగష్టు 6న మరణించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి "దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం" అని నామకరణం చేశారు.[4] దీనిని అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించాడు.

దండమూడి రాజగోపాలరావు
Dandamudi rajagopal
దండమూడి రాజగోపాలరావు
జననందండమూడి రాజగోపాలరావు
అక్టోబరు 16, 1916
గండిగుంట, కృష్ణా జిల్లా
మరణంఆగష్టు 6, 1981
ప్రసిద్ధిప్రముఖ క్రీడాకారుడు
నర్తనశాల చిత్రంలో భీముడు పాత్రధారి.
పిల్లలుఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి

మూలాలు

  1. http://www.doha-2006.com/gis/menuroot/sports/Weightlifting_HR.aspx-id=WL.html
  2. http://www.imdb.com/title/tt0263778/
  3. http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_veeraabhimanyu.php
  4. http://www.hindu.com/2004/12/23/stories/2004122311461800.htm
1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1981

1981 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 16

అక్టోబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.

ఆగష్టు 6

ఆగష్టు 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ (gorgeon calander)ప్రకారము సంవత్సరములో 218వ రోజు (లీపు సంవత్సరములో 219వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 147 రోజులు మిగిలినవి.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి.

Map

గండిగుంట

గండిగుంట, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

దండమూడి

దండమూడి (పొన్నూరు మండలం) - గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన గ్రామం

దండమూడి (చిలకలూరిపేట) - గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన గ్రామముదండమూడి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.

దండమూడి రాజగోపాలరావు, అమేయ బలశాలి, అసాధారణ శక్తి సంపన్నుడు.

దండమూడి రామమోహనరావు

దండమూడి సుమతీ రామమోహనరావు

దండమూడి (ఇంటి పేరు)

దండమూడి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.

దండమూడి అను ఇంటిపేరు కలవారు కృష్ణా జిల్లా వాస్తవ్యులు.

దండమూడి రాజగోపాలరావు గారు ప్రముఖ వ్యాయమ క్రీడాకారుడు మరియు సినిమా నటుడు.

వీరి పేరున విజయవాడ నగరములో ఇండొర్ క్రీడాప్రాంగణము ఉంది.

నర్తనశాల

నర్తనశాల (ఆంగ్లం: NarthanaSala) మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకొంది.

భట్లపెనుమర్రు

భట్లపెనుమర్రు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 138., ఎస్.టి.డి.కోడ్ = 08671.

రాజగోపాలరావు

దండమూడి రాజగోపాలరావు, భారతదేశాని కి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు.

బొడ్డేపల్లి రాజగోపాలరావు, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు.

టేకుమళ్ళ రాజగోపాలరావు, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు.

వీరాభిమన్యు (1965 సినిమా)

ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా వీరాభిమన్యు (1936 సినిమా)

వీరాభిమన్యు 1965 ఆగస్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణునిగా నందమూరి తారక రామారావు, వీరాభిమన్యుగా శోభన్ బాబు అర్జునునిగా కాంతారావు, సుభద్రగా ఎస్.వరలక్ష్మి, ఘటోత్కచుడుగా నెల్లూరు కాంతారావు, భీముడుగా దండమూడి రాజగోపాలరావు, దుర్యోధనుడిగా రాజనాల నటించారు. శోభన్ బాబు కథానాయకునిగా నటించిన తొలిచిత్రము ఇది.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.