జూలై 23

జూలై 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 204వ రోజు (లీపు సంవత్సరములో 205వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 161 రోజులు మిగిలినవి.

<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2019

సంఘటనలు

 • 0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు.
 • 0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు.
 • 1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను బహిష్కరించాడు.
 • 1298: ఉర్జుబర్గ్, జర్మనీ లోని ఉర్జుబర్గ్ లో యూదులను ఊచకోత (హత్యాకాండ) కోసారు.
 • 1798: నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాను పట్టుకున్నాడు.
 • 1829: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు.
 • 1871: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) #114 కస్సండ్రను కనుగొన్నాడు.
 • 1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు.
 • 1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.
 • 1880: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.
 • 1895: ఎ. ఛార్లోయిస్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) #405 థియని కనుగొన్నాడు.
 • 1904: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.
 • 1908: 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.
 • 1909: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.
 • 1920: కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది.
 • 1921: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.
 • 1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 • 1932: '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
 • 1937: 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది.
 • 1938: '#1468 జోంబ' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
 • 1947: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)
 • 1952: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)
 • 1955: భారతీయ మజ్దూర్ సంఘ్ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.
 • 1956: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
 • 1931: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
 • 1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
 • 1965: బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.
 • 1967: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
 • 1968: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.
 • 1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
 • 1972: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
 • 1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు
 • 1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.
 • 1979: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.
 • 1980: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.
 • 1984: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
 • 1987: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది ( మహిళల రికార్డు).
 • 1987: మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.

జననాలు

Bal G. Tilak
Bal G. Tilak

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

బయటి లింకులు

జూలై 22 - జూలై 24 - జూన్ 23 - ఆగష్టు 23 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1856

1856 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1870

1870 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1906

1906 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1936

1936 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1946

1946 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1953

1953 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2004

గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం.

ఆగష్టు 23

ఆగష్టు 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.

గ్రాహం గూచ్

ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులలో ఒకడైన గ్రాహం గూచ్ (Graham Gooch) 1953, జూలై 23 న జన్మించాడు. ఇంగ్లాండు జాతీయ జట్టుకు మరియు దేశవాళీ పోటీలలో ఎస్సెక్స్ జట్టుకు నేతృత్వం వహించాడు.

1975లో ఆస్ట్రేలియా పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసి తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే అవుటై రెండో టెస్టులోనూ 6 మరియు 31 పరుగులు మాత్రమే చేశాడు. దీనితో సీరీస్ నుంచి తొలిగించబడ్డాడు. ఆ తరువాత 1978 వరకు మళ్ళీ జట్టులో స్థానం పొందలేకపోయాడు. 1982లో దక్షిణాఫ్రికాకు వెళ్ళడంతో మళ్ళీ మూడేళ్ళపాటు నిషేధానికి గురైనాడు. తరువాతి కాలంలో జాతీయ జట్టుకు అనేక సంవత్సరాల పాటు సేవలందించాడు. 1990లో భారత్‌పై లార్డ్స్లో జరిగిన టెస్టులో విశ్వరూపాన్ని ప్రదర్శించి తొలి ఇన్నింగ్సులో 333 పరుగులు మరియు రెండో ఇన్నింగ్సులో 123 పరుగులు చేశాడు. 2006 వరకు ఈ విధంగా ఒకే టెస్టులో ట్రిపుల్ సెంచరీ మరియు సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఏకైక వ్యక్తిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ ఇతని పేరుమీదుగా ఉంది.

చంద్రశేఖర్ అజాద్

చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.

జూన్ 23

జూన్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 174వ రోజు (లీపు సంవత్సరములో 175వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 191 రోజులు మిగిలినవి.

జూలై 22

జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరములో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి.

జూలై 24

జూలై 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 205వ రోజు (లీపు సంవత్సరములో 206వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 160 రోజులు మిగిలినవి.

బాలగంగాధర తిలక్

ఇదే పేరుగల తెలుగు కవి కోసం దేవరకొండ బాలగంగాధర తిలక్ వ్యాసం చూడండి.

బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak) (మరాఠీ: बाळ गंगाधर टिळक) (జూలై 23, 1856 - ఆగష్టు 1, 1920) ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest) గా భావిస్తారు. ఈయనకు లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది.

మర్యాద రామన్న (సినిమా)

ఆర్కా మీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన చిత్రం మర్యాద రామన్న. సునీల్, సలోని జంటగా నటించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. తన ఇంటిగడప దాటేంతవరకు అతిథి ప్రాణాన్ని తీయని ఒక ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి, తన తండ్రికీ ఆ పెద్దమనిషికీ తగాదాలున్నాయని తెలుసుకుని తన ప్రాణాలను కాపాడుకోవలనే ఒక యువకుడు కథను వివరించే ఈ సినిమా సునీల్ కి హీరోగా రెండో సినిమా. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా భారీవిజయాన్ని సాధించింది.

రాయసం వెంకట శివుడు

రాయసం వెంకట శివుడు (జూలై 23, 1870 - డిసెంబరు 24, 1953) ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు మరియు సంఘ సంస్కర్త.వీరు పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి (ఇరగవరం మండలం) గ్రామంలో 1870, జూలై 23 తేదీన అనగా ప్రమోదూత నామ సంవత్సరం ఆషాఢ బహుళ దశమి శనివారం నాడు సుబ్బారాయుడు, సీతమ్మ దంపతులకు జన్మించారు. రాజమండ్రిలో చదివి బి.ఏ., ఎల్.టి పరీక్షలను ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరు బి.ఏ. పరీక్ష తమ పంతొమ్మిదవ యేటనే ప్రథములుగా ఉత్తీర్ణులైనందుకు అప్పటి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ మెట్‌కాఫ్ వీరికి అమూల్యములైన గ్రంథాలను బహూకరించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తర్వాత కొంతకాలానికి కలకత్తాలో ఎం.ఏ. పూర్తిచేశారు. వీరు పర్లాకిమిడి, విజయనగరం, గుంటూరు కాలేజీలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసి ఆ తర్వాత నెల్లూరులోని వెంకటగిరి రాజావారి కళాశాలలో ప్రిన్సిపాల్ గా 1920 లో చేరి 1929 వరకు పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి గురువులు కందుకూరి వీరేశలింగం గారు. వీరు నిరాడంబరులు. ఉద్యోగము చేయు కాలములో పేద విద్యార్థులకు ద్రవ్య సహాయము చేసి వారి చదువులకు తోడ్పడినారు. ఉద్యోగుల ఉపకార వేతనము కొరకు రాజమండ్రి గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీలో ధర్మనిధిని ఏర్పాటు చేశారు. గుంటూరులోని తమ గృహమును స్త్రీ సమాజము కొరకు దానము చేశారు. వీరు సంఘ సంస్కరణ భావాలతో 1891 నుండి 1899 వరకు స్త్రీ జనోద్ధరణ మరియు సత్య సంవర్థినీ పత్రికలను నడిపారు. "జనానా" పత్రికను 1894లో కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించారు. వీరు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. వీరు 1953, డిసెంబరు 24వ తేదీన భీమవరంలో పరమపదించారు.

సంబల్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో సంబల్ జిల్ జిల్లా ఒకటి. ఇది ముందుగా భీంనగర్ అని పిలువబడింది. ఈ జిల్లాను 2012 జూలై 23 న రూపొందించబడింది.

సంబల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది.

.

సూర్య (నటుడు)

సూర్య (జననం: జూలై 23, 1975) ప్రముఖ తమిళ నటుడు. ఆయన తండ్రి శివకుమార్ నటుడు. 2009 నాటికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇతడు నటించిన గజిని అందర్నీ అలరించింది. తర్వాత విడుదలైన ఆరు, కథానాయకుడు అంత విజయవంతం కాలేదు. ఇతడు సినీనటి జ్యోతిక పెళ్ళిచేసుకున్నారు.

రజనీకాంత్ తరువాత లింగాయత్ వర్గం నుంచి దక్షిణ భారత స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.