జూలై 22

జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరములో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి.

<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2019

సంఘటనలు

  • 1099: మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) : జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి 'బౌలియన్' కి చెందిన 'గాడ్‌ఫ్రే' ఎన్నికయ్యాడు.
  • 1298: ఇంగీషు సైన్యం 'ఫాల్కిర్క్ యుద్ధం' లో 'స్కాట్స్' ని ఓడింఛింది.
  • 1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు - బెల్‌గ్రేడ్ ముట్టడి. హంగరీ రాజప్రతినిధి, జాన్ హున్యాది, ఒట్టోమన్ రాజ్యానికి చెందిన 'మెహ్మెత్ II' ని ఓడించాడు.
  • 1461: మూస:ఫ్రాన్సు రాజైన ఛార్లెస్ VII, (1422-61) తన 58వ ఏట మరణించాడు.
  • 1587: ఇంగ్లీషు వారి రెండవ వలస 'రోనోక్ దీవి' (నార్త్ కరోలినా) లో వెలిసింది.
  • 1686: 'అల్బనీ' ( న్యూయార్క్), మునిసిపాలిటీగా ఏర్పడింది.
  • 1763: 'కేథరిన్ II' విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.
  • 1775: జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ సైన్యం అధిపతి అయ్యాడు.
  • 1796: జనరల్ మోజెస్ క్లీవ్ లాండ్, ఓహియో రాష్ట్రంలో, 'క్లీవ్‌లాండ్' నగరాన్ని స్థాపించాడు. క్లీవ్‌లాండ్, కనెక్టికట్ లాండ్ కంపెనీ అనే సర్వే కంపెనీ, అధిపతిగా ఉండే వాడు.
  • 1812: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) - ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది.
  • 1854: గ్రహశకలం (అస్టరాయిడ్) #30 యురేనియాని 'జె.ఆర్. హింద్' కనుగొన్నాడు.
  • 1898: బెల్జియన్ సిబ్బంది (బెల్జికా క్రూ అని వీరికి పేరు), అంటార్కిటికా పరిశోధనకు వెళ్ళారు. వారంతా, బయలు దేరిన, 1600 గంటల తరువాత, అంటార్కిటికా శీతాకాలంలో, సూర్యోదయాన్ని చూసారు.
  • 1908 : అమి వాండెర్‌బిల్ట్. ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదు.
  • 1908 : విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్) ' ని కనుగొన్నాడు.
  • 1912 : స్పెయిన్ లోని స్టాక్ హోమ్ లో 5వ ఒలింపిక్ గేమ్స్ పూర్తి అయ్యాయి.
  • 1917 : అలెగ్జాండర్ కెరెన్‌స్కీ రష్యా కి ప్రధాన మంత్రి అయ్యాడు
  • 1917 : ఎమ్. వుల్ఫ్ మూడు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు. ఆ మూడింటి పేర్లు '#879 రికార్డా', '#880 హెర్బా', '#881 అథెనె'.
  • 1926 : 'వాటర్‌బరి' (కనెక్టికట్) రాష్ట్రం లోని ఉష్ణోగ్రత రికార్డు. 105 డిగ్రీల ఫారెన్ హీట్, 41 డిగ్రీల సెంటిగ్రేడ్.
  • 1926 : 'ట్రాయ్' (న్యూయార్క్) రాష్ట్రం ఉష్ణోగ్రత రికార్డు. 108 డిగ్రీల ఫారెన్ హీట్, 42 డిగ్రీల సెంటిగ్రేడ్.
  • 1930 : '#1306 స్కిథియా' అనే పేరుగల గ్రహశకలా న్ని (ఆస్టరాయిడ్) 'జి. న్యూజ్మిన్' కనుగొన్నాడు.
  • 1930 : హెండ్రిక్ వాన్ జెంట్ రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్) ను కనుగొన్నాడు. వాటి పేర్లు '#1666 వాన్ జెంట్', '#1752 వాన్ హెర్క్'. అలాగే చంద్రుడి అవతలి భాగంలో ఉన్న ఒక క్రేటర్ కి ఇతని పేరు మీద 'వాన్ జెంట్' అని పేరు పెట్టారు.
  • 1940 : యూరి పి అర్త్యుఖిన్ రోదసీయాత్రికుడు (సోయుజ్ 14) జననం.
  • 1933 : విలీ పోస్ట్ ఒంటరిగా 15,596 మైళ్ళు 7 రోజుల 18 గంటల 45 నిమిషాలలో విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి.
  • 1935 : సి. జాక్సన్ రెండు గ్రహశకలాల ను (ఆస్టెరాయిడ్స్) కనుగొన్నాడు. అవి #1359 ప్రియెస్కా, #1360 తార్కా.
  • 1939 : మొదటి నల్లజాతి న్యాయాధికారిణి (స్త్రీ) పేరు జేన్ మటిల్డా బోలిన్, న్యూయార్క్.
  • 1942 : యూదుల నువార్సా ఘెట్టో నుంచి టెబ్లింకా కు ఒక పద్ధతిగా (రోజుకి 6 వేల నుంచి 7 వేల మందిని) చేరవేయటం (వారిని చంపటానికి. అలా చనిపోయిన వారు ఎంత తక్కువగా చూసినా 3 లక్షలమంది ఉంటారు) మొదలైన రోజు.
  • 1944 : పోలాండ్ లిబరేషన్ డే.
  • 1947: పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయజెండా గా ఆమోదించబడింది.
  • 1962 : శుక్ర గ్రహాని కి పంపటానికి తయారు చేసిన అమెరికన్ రోదసీ నౌక మారినర్ 1, ప్రయోగించేదశలోనే పడిపోయింది
  • 1963 : బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు.
  • 1969 : యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) స్పుత్న్కి 50, మొల్నియల్-12 అనే రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది.
  • 1972 : రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది.
  • 1983 : డిక్ స్మిత్ హెలికాప్టర్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి.
  • 1987 : సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది.
  • 1988 : ఫ్రెంచి గయానా (కౌరు) నుంచి ఇన్సాట్ 1-సి ప్రయోగించారు.
  • 1999 : మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం) ని విడుదల చేసింది.

జననాలు

Gregor Mendel
Gregor Mendel

మరణాలు

  • 1826: గియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్న శాస్త్రవేత్త.
  • 1987: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933)
  • 2003: 'ఉదయ్', ఖుసే హుస్సేన్', సద్దాం హుస్సేన్ కుమారులు. ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.

పండుగలు మరియు జాతీయ దినాలు

  • - మ్యాంగో డే.

బయటి లింకులు

జూలై 21 - జూలై 23 - జూన్ 22 - ఆగష్టు 22 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1763

1763 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1812

1812 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1822

1822 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1922

1922 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1923

1923 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1925

1925 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1947

1947 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం.

1965

1965 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1987

1987 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2016 నాటి ఎఎన్-32 విమాన అదృశ్యం

2016 జూలై 22 న, భారత వైమానిక దళానికి చెందిన ఏంటోనోవ్ ఎఎన్ -32 ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ రవాణా విమానం బంగాళాఖాతం మీదుగా ఎగురుతున్నప్పుడు అదృశ్యమైంది. ఈ విమానం చెన్నై లోని తాంబరం వైమానిక దళ కేంద్రం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ వరకు వెళుతోంది. విమానంలో 29 మంది ఉన్నారు. ఉదయం 9:12 గంటలకు, చెన్నై నుండి తూర్పున 280 కి.మీ. దూరాన ఉండగా విమానంతో రాడార్ సంపర్కం కోల్పోయింది. సముద్రంలో తప్పిపోయిన విమానాన్ని వెతకడం కోసం భారతదేశం అతి పెద్ద ఆపరేషన్ను చేపట్టింది.1986, 2019 లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.

ఆగష్టు 22

ఆగష్టు 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 234వ రోజు (లీపు సంవత్సరములో 235వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 131 రోజులు మిగిలినవి.

గ్రెగర్ జోహన్ మెండల్

జన్యుశాస్త్రము యీనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు గ్రెగల్ మెండల్ (జూలై 22, 1822 - జనవరి 6, 1884) . యీయన ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి. అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని పెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు.

జూన్ 22

జూన్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 173వ రోజు (లీపు సంవత్సరములో 174వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 192 రోజులు మిగిలినవి.

జూలై 21

జూలై 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.

జూలై 23

జూలై 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 204వ రోజు (లీపు సంవత్సరములో 205వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 161 రోజులు మిగిలినవి.

దాశరథి కృష్ణమాచార్య

అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండితెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

ముకేష్

ముకేష్ (హిందీ: मुकेश ) (జూలై 22, 1923 - ఆగస్టు 27, 1976) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు. ఇతని సమకాలికులు మహమ్మద్ రఫీ మరియు కిషోర్ కుమార్, 1950 నుండి 1970 ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు.ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు.

ముకేష్ పాడిన కొన్ని మధుర గీతాలు:

జానే కహాఁ గయే వొ దిన్, కెహ్తే థే తేరీ రాహ్ మేఁ, నజరోఁ కో హమ్ బిఛాయేఁ గే

దునియా బనానే వాలే కా తేరే మన్ మేఁ సమాయీ, కాహే కో దునియా బనాయీ

సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదా కే పాస్ జానా హై

హమ్ తుమ్ సే మొహబ్బత్ కర్ కే సనమ్ రోతే హీ రహే

రాగతి పండరి

రాగతి పండరి (జూలై 22, 1965 - 19 ఫిబ్రవరి, 2015) తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి, కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంటున్నది. ఆమె మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన తటపటాయింపు లేకుండా, తాను కార్టూన్లు గీయాలన్న కోరిక మరియు స్ఫూర్తి, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెపుతుంది. అలాగే, జయదేవ్ కూడా రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటాడు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.