జనాభా

సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభాా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో జనాభాా అన్న పదం వాడబడింది.

నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభాా. ఈ జనాభాాను గురించి చేసే అధ్యయనాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం (Atecology) లేదా జనాభాా జీవావరణ శాస్త్రం (Population Biology) అంటారు. జనాభాా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది జీవ గతిజ శీలం (Population Dynamics)

జనాభాాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవనవిధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబనియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాాను ప్రభావితం చేస్తాయి. జనాభాాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాలనుండి సామాజిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటివి అధ్యయనం చేస్తాయి.

World population
వివిధ దేశాల జనాభాాను సూచించే చిత్రపటం
India-demography
భారత దేశ జనాభాా 1960లో 44.3కోట్లు ఉండగా 2000నాటికి 100కోట్లు దాటింది.
Mahakumbh
భూమి మీద ఒక మతోత్సవానికి జమకూడిన అతిపెద్ద జన సమూహం. [2][3] [4] 2001 లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు సుమారు 7కోట్ల మంది జనులు వచ్చారు.

జనాభాా గురించి కొన్ని సాంకేతిక విషయాలు

జనాభాాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి జనన, మరణ రేట్లు, వ్యాప్తి, సాంద్రత, వయోవ్యాప్తి, జనాభాా నియంత్రణ[1]

 • జనన, మరణ రేటు - ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్ధ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్ధ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువ ఉన్నపుడే ఆ జనాభాా పరిమాణం పెరుగుతుంది.
 • వలసలు - జనాభాాలోని జీన్ పూల్‌ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు (రావడం, పోవడం) అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభాా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
 • జన సాంద్రత - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివసించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
 • జీవ సామర్థ్యం (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివసించే జనాభాా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్థ్యం అంటారు.
 • వయో వ్యాప్తి - జనాభాా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
 • భార శక్తి - ఒక ఆవాసం భరించగల గరిష్ఠ స్థాయి జనాభాాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటారు.

ప్రపంచ జనాభాా

World population growth - time between each billion-person growth
ప్రపంచ జనాభాా ఒకో బిలియన్ (100కోట్లు) మంది పెరగడానికి పట్టిన సమయం చూపే గ్రాఫ్.

ఫిబ్రవరి 25 2006నాటికి [2] ప్రపంచ జనాభాా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. 2012నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభాా ఉంటుందని అంచనా.. ఐక్యరాజ సమితి జనాభాా నిధి వారు అక్టోబరు 12 1999 నాటికి ప్రపంచ జనాభాా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభాా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి. 2050 నాటికి ప్రపంచ జనాభాా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభాా విభాగం వారి అంచనా[3]. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభాా వేగంగా పెరిగింది[4][5]. ప్రపంచ జనాభాాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం, ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.

జనాభాా తరుగుదల

ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభాా తరగవచ్చును. పాతకాలంలో (ప్లేగు, కలరా వంటి) వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభాా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభాా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభాా' లేదా 'అల్ప జనాభాా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభాా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం. జపాన్‌, కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ, ఇటలీ జర్మనీ, గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్, జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి: జపాన్: నెలకి ఐదు వేల రూపాయిలు చొప్పున పన్నెండేళ్ల వయసొచ్చేదాకా సింగపూర్ : బేబీబోనస్ మొదటి బిడ్డకైనా, రెండో బిడ్డకైనా4000 మూడు లేదా నాలుగో సంతానమైతే 6000 డాలర్లు . బిడ్డ పేర బ్యాంకులో 18000 డాలర్లు రష్యా : రెండో బిడ్డకి రెండున్నర లక్షల రూబుళ్లు (మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు) బిడ్డకి మూడో ఏడు వచ్చిన తర్వాతే ఇస్తారు. జర్మనీ : తండ్రికి కూడాఏడాది సెలవులు, 75 శాతం జీతం. ఫ్రాన్స్: బిడ్డ పుట్టినపుడు 1000 డాలర్లు .బిడ్డకి మూడేళ్లొచ్చేదాకా నెల నెలా ఆర్థిక సహాయం స్పెయిన్‌:పన్నుల నుండి నెలకి 400 డాలర్లు సంవత్సరం పాటు మినహాయింపు .ప్రజా రవాణాలో డిస్కౌంట్లు

జనాభాా నియంత్రణ

BPL Data GOI
భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభాా శాతం.

జనాభాా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభాా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభాా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభాా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభాా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభాా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభాా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభాా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉంది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన ఆన్స్‌లీ కోలే విశ్లేషణ ప్రకారం జనాభాా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం. (3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.[6]. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్థిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.[7]

వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.[8] [9] ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.

ముదురు పెళ్లే జనాభాా నియంత్రణకు మార్గం

"జనాభాా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.అధిక జనాభాాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభాా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ"—గులాంనబీ అజాద్

అధిక జనాభాా

ప్రపంచ జనాభాా 1987 జూలై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది.ఏటా జూలై 11న ప్రపంచ జనాభాా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు. జనాభాా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు.ప్రస్తుతం మన ప్రపంచ జనాభాా 683కోట్లు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభాా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభాా రెట్టింపు అవుతున్నారు. 2015 ముగిసేసరికి దేశ జనాభాా 139 కోట్లకు చేరుతుందట.వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట.2008లో ఆ దేశ జనాభాా 132 కోట్లు. జనాభాాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.అత్యధిక జనాభాా గల దేశాల్లో 2050 నాటికి భారత్‌, చైనాల తర్వాత అమెరికా మూడో స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 165 కోట్ల మంది జనాభాా ఉంటారని, చైనాలో 130 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది.2025 నాటికల్లా భారత్‌ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభాా గల దేశంగా ఆవిర్భవించనుందని వెల్లడించింది.

భారత దేశం జనాభాా

India population density map en
భారతదేశంలో వివిధ జిల్లాలలో జనాభాాను సూచించే చిత్రపటం.

భారత దేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభాా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభాా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కతా (వెనుకటి కలకత్తా), మరియు చెన్నై (వెనుకటి మద్రాసు ). భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభాా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: క్రైస్తవులు (2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%), జైనులు (0.40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, మరియు బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు.ప్రపంచ జనాభాాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారు.

జనాభాా ప్రకారం భారత దేశములో 10 పెద్ద నగరాలు

ముంబాయి, ఢిల్లీ, కోల్కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు, పూణే, కాన్పూర్, సూరత్ గత వందేళ్లలో దేశ జనాభాా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభాాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభాా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభాా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభాా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్ళి చేసుకోవడం, విడాకులు, పెళ్ళికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.కుటుంబ నియంత్రణకు లింగ వివక్ష కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.

ఆంధ్ర ప్రదేశ్ జనాభాా 2001

భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభాా పరంగా ఐదవ స్థానంలో ఉంది. 2009 మార్చి 1 నాటికి రాష్ట్ర జనాభాా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభాా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభాా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభాా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభాా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84%తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.[10] జనాభాా వల్ల నష్టాలు‍‍ భారతదేశంలో జనాభాా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనాభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే ప్రపన్ఛ్

ఆంధ్ర ప్రదేశ్ జనాభాా 2011

గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశంలో జనాభాా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో (చదరపు కిలో మీటర్‌కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. జనాభాాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000 : 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాా 8.46 కోట్లకు చేరింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

 1. ఈనాడు ప్రతిభ ప్లస్ శీర్షిక - 20 ఫిబ్రవరి 2009 - ఎం.బి.తిలక్ వ్యాసం
 2. papers published by the United States Census Bureau
 3. "World population will increase by 2.5 billion by 2050; people over 60 to increase by more than 1 billion" (Press release). United Nations Population Division. March 13, 2007. Retrieved 2007-03-14. The world population continues its path towards population ageing and is on track to surpass 9 billion persons by 2050. Check date values in: |date= (help)
 4. BBC NEWS | The end of India's green revolution?
 5. Food First/Institute for Food and Development Policy
 6. Ansley J. Coale, "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.
 7. For illustrations of the distinction between fertility control and fertility levels, see Barbara A. Anderson and Brian D. Silver, "A Simple Measure of Fertility Control," Demography 29, No. 3 (1992): 343-356, and B. A. Anderson and B. D. Silver, "Ethnic Differences in Fertility and Sex Ratios at Birth: Evidence from Xinjiang," Population Studies 49 (1995): 211-226. The fundamental work on models of fertility control was that by Coale and his colleagues. See, e.g., Ansley J. Coale and James T. Trussell, “Model Fertility Schedules: Variations in the Age Structure of Childbearing in Human Populations.” Population Index 40 (1974): 185 – 258.
 8. For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," Population Council, Policy Research Division, Working Paper No. 173 (2003)[1].
 9. Charlotte Höhn, "Population policies in advanced societies: Pronatalist and migration strategies," European Journal of Population/Revue européenne de Démographie 3, Nos. 3-4 (July, 1988): 459-481.
 10. ఈనాడు ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం

ఇతర వనరులు

 • ఈనాడు ప్రతిభ ప్లస్ శీర్షిక - 2009 ఫిబ్రవరి 20 - ఎం.బి.తిలక్ వ్యాసం

బయటి లింకులు

అనంతపురం జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు, చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా, భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం. మరియు సాంప్రదాయిక 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)

కంది (సంగారెడ్డి)

కంది (గ్రామం), తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా,కంది మండలానికి చెందిన గ్రామం.

ఇది 7వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది.

కరీంనగర్

కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఒక నగరం.

ఇది ఒక ప్రధాన పట్టణ సముదాయం, కరీంనగర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం, రాష్ట్రంలో ఐదవ అతి పెద్ద నగరం.కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ చేత పాలించబడుతుంది.ఇది గోదావరి ఉపనది అయిన మానేర్ నది ఒడ్డున ఉంది.

కర్ణాటక

కర్ణాటక ( కన్నడలో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి మరియు బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఖమ్మం దీని ముఖ్యపట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 13,89,566.

గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. దీనికి 100 కి.మీ. తీరం వుంది. కృష్ణా నది, సముద్రంలో కలిసేవరకు, ఎడమవైపు కృష్ణాజిల్లా, కుడివైపు గుంటూరు జిల్లాను వేరుచేస్తుంది. ఈ జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగి రాష్ట్రంలో రెండవ పెద్ద జనాభాగల జిల్లాగా గుర్తింపు పొందింది.ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఈ జిల్లాలోని కారంపూడిలో జరిగింది.మొగలు సామ్రాజ్యం నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైంది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమిషన్ ఉద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది.

విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. ఈ జిల్లాను మిరపకాయల భూమి అని అంటారు. రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో వుంది. పొగాకు, మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఎగుమతులు.

గ్రామం

గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం (Hamlet) కంటే పెద్దది.

మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడినది ఒక గ్రామం. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును.

చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలు విస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. సుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.

రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.

అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకు కేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.

అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.

దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో గ్రామపాలన

పూర్వం కరణం మునసబు పటేల్ పట్వారీలు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు.1985 లో వీరిని తీసేసి గ్రామపాలనాధికారుల్ని (వి.ఏ.వో ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వోలు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులను వీఆర్వోలుగా తీసుకున్న సమయంలో 'ఎక్కడి వారు అక్కడే' అన్న పద్ధతిలో వారిని ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండవలిసిన వారికంటే ఎక్కువ మంది ఉంటే.. ఇంకొన్ని చోట్ల అసలే లేకుండాపోయారు. ఈ అసమానత కారణంగా ప్రజలకేగాక పాలనపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎవరినీ సొంత గ్రామానికి బదిలీ చేసేది లేదు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది.. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రజలు పయనించాలి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. కనీసం గ్రామానికి ఒకరుండాలంటే పూర్వంలాగానే పంచాయతీ రెవిన్యూశాఖలను ఏకంచెయ్యాలి.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.రక్షణ అవుసరమైన చోటh (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.by Kumar

నల్గొండ జిల్లా

నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ.

పూర్వం నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా,దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాద్ మండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు, ప్రముఖ గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ప్రముఖుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి,బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు.ప్రముఖ కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుo మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు.

నిర్జన గ్రామాలు

నిర్జన గ్రామాలు, అంటే ప్రజలు నివశించని గ్రామాలు.వీటిని 'పోలీసు దత్తత గ్రామాలని, 'బేచిరాగులు ' అని, దీపం లేని ఊర్లని పిలుస్తారు.ఒకప్పుడు జనాలకు ఆవాసాలుగా ఉండి కాలక్రమంలో, వివిధ కారణాలచే శిథిలమై, అదృశ్యమైన గ్రామాలివి. కానీ, రెవిన్యూ దస్త్రాలలో మాత్రం వీటికి చోటు ఉంటుంది.2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5,93,731 గ్రామాలు జనావాసం ఉన్నవి.44,656 గ్రామాలు నిర్జన గ్రామాలు (Uninhabited Villages)

పెద్దాపురం మండలం

పెద్దాపురం మండలము, దక్షిణ భారత దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం.

ముంబై

ముంబయి (మరాఠీ: मुंबई), పూర్వము దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ప్రముఖ నగరము. ఇది మహారాష్ట్ర రాష్ట్రము యొక్క రాజధాని మరియు ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈనగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈనగర వాసుల సాహసము ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరము.

మెదక్ పట్టణం

మెదక్, తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణం,పురపాలక సంఘం.మెదక్ పట్టణం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మెదక్ పట్టణం 1952లో మునిసిపాలిటీగా ఏర్పడింది.ప్రస్తుతం ఇది జిల్లాలో గ్రేడ్ 2 హోదా కలిగిన ఏకైక పురపాలక సంఘం.పట్టణ ప్రస్తుతం విస్తీర్ణం 22 చ.కి.మీ.మేర విస్తరించి ఉంది.3 రెవెన్యూ వార్డులు, 27 ఎన్నికలు వార్డులు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.

1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరె రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు ప్రఖ్యాతిగాంచిన జిల్లా.

ఈ జిల్లాలో 37 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి.

విజయనగరం

విజయనగరం () పట్టణం భారత దేశము లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. ఇది విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. 1979 జూన్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

విశాఖపట్నం

విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి.

అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్‌ నోస్‌" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పనిచేస్తుంది.

శ్రీకాకుళం

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.