గ్రెగోరియన్ కేలండర్

దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.

(జాబితా)
విశాల వాడుక అంతరిక్ష · గ్రెగోరియన్ కేలండర్ · ISO
కేలండర్ రకాలు
చాంద్ర-సూర్యమాన · సూర్యమాన · చాంద్రమాన కేలండర్

ఎంపిక చేయబడి వాడుక అసిరియన్ · ఆర్మీనియన్ · అట్టిక్ · అజ్‌టెక్ (తొనాల్‌పొహుల్లిజియుపొహుఅల్లి) · బాబిలోనియన్ · బహాయి · బెంగాలీ · బెర్బెర్ · బిక్రంసంవాత్ · బౌద్ధుల · బర్మీస్ · సెల్టిక్ · చైనీస్ · కాప్టిక్ · ఈజిప్టియన్ · ఇథియోపియన్ · కేలండ్రియర్ రీపబ్లికన్ · జర్మనిక్ · హెబ్ర్యూ · హెల్లెనిక్ · హిందూ కేలండర్ · భారతీయ · ఇరానియన్ · ఐరిష్ · ఇస్లామీయ కేలండర్ · జపనీస్ · జావనీస్ · జుచే · జూలియన్ · కొరియన్ · లిథువేనియన్ · మలయాళం · మాయ (జోల్కిన్హాబ్) · మింగువో · నానక్‌షాహి · నేపాల్ సంబత్ · పవుకోన్ · పెంటెకోంటాడ్ · రపా నుయి · రోమన్ · రూమి · సోవియట్ · తమిళ · తెలుగు కేలండర్ · థాయి (చంద్రమానసూర్యమాన) · టిబెటన్ · వియత్నామీస్· జోసా · జొరాస్ట్రియన్
కేలండర్ రకాలు
రునిక్ · మిసోఅమెరికన్ (లాంగ్ కౌంట్కేలండర్ రౌండ్)
క్రిస్టియన్ వేరియంట్లు
జూలియన్ · సెయింట్స్ · ఈస్టర్న్ ఆర్థడాక్స్ లిటర్జికల్ · లిటర్జికల్
అరుదుగా వాడుక డేరియన్ · డిస్కార్డియన్
ప్రదర్శనా రకాలు మరియు వాడుక అనంత కేలండర్ · గోడ కేలండర్ · ఆర్థిక కేలండర్

ఇవీ చూడండి

బయటి లింకులు


-->

అక్టోబర్ విప్లవం

అక్టోబర్ విప్లవం, సోవియట్ సాహిత్యంలో అధికారికంగా గొప్ప అక్టోబర్ సోషలిస్ట్ విప్లవంగానూ, సామాన్యంగా రెడ్ అక్టోబర్, ఎర్ర అక్టోబర్, అక్టోబర్ తిరుగుబాటు, బోల్షెవిక్ విప్లవం, వంటి పేర్లతోనూ ప్రఖ్యాతి పొందినది 1917 రష్యన్ విప్లవంలో భాగంగా రాజ్యం యొక్క అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన. సంప్రదాయికంగా జూలియన్ లేదా ఓల్డ్ స్టైల్ క్యాలెండర్ ప్రకారం 1917 అక్టోబర్ 25 (గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం 7 నంబర్ 1917న) తేదీన పెట్రోగ్రాడ్లో జరిగిన సాయుధ తిరుగుబాటు ద్వారా జరిగింది.

అదే సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఫిబ్రవరి విప్లవాన్ని అక్టోబర్ విప్లవం అనుసరించి ప్రయోజనం పొందగలిగింది. జార్ నియంతృత్వ పరిపాలన అంతం చేసి, జార్ నికోలస్ 2 పదవీచ్యుతుడయ్యాకా అతని తమ్ముడు గ్రాండ్ డ్యూక్ మైకేల్ అధికార బదిలీ జరిగి పదవి స్వీకరించారు, ప్రొవిన్షియల్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలో పట్టణ కార్మికులు కౌన్సిళ్ళుగా (రష్యన్లో సోవియట్ అంటారు) సంఘటితమవుతూ వచ్చి, విప్లవకారులు ప్రొవిన్షియల్ ప్రభుత్వ కార్యకలాపాలను విమర్శించసాగారు. పెట్రోగ్రాడ్ లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రొవిన్షియల్ ప్రభుత్వాన్ని కూలదోసి, స్థానిక సోవియట్లకు అధికారాన్ని ఇచ్చింది. సోవియట్లు బోల్షెవిక్ పార్టీని విస్తృతంగా సమర్థించాయి. సోవియట్ల కాంగ్రెస్ తర్వాత, పరిపాలన సంస్థ రెండో సెషన్ జరుపుకుంది. బోల్షెవిక్కుల నుంచి, లెఫ్ట్ సోషలిస్ట్ రివల్యూషనరీస్ వంటి ఇతర వామపక్ష గ్రూపుల నుంచి సభ్యులను నూతన రాజ్య వ్యవహారాల్లో కీలక స్థానాలకు ఎన్నుకున్నారు. వెనువెంటనే ఇది ప్రపంచంలోకెల్లా తొలి స్వయం ప్రకటిత సోషలిస్టు దేశమైన రష్యన్ సోషలిస్ట్ ఫెడరేటివ్ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు దారితీసింది.

సాయుధ బలగాలను సమీకృతం చేసేలా పెట్రోగ్రాడ్ సోవియట్ పై ప్రభావం చూపి బోల్షెవిక్కులు ఈ విప్లవాన్ని నడిపించారు. మిలటరీ రివల్యూషన్ కమిటీ కింద బోల్షెవిక్ రెడ్ గార్డ్స్ బలగాలు ప్రభుత్వ భవంతులను 1917 అక్టోబర్ 24న స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి. తర్వాతి రోజు వింటర్ ప్యాలెస్ (అప్పటి రష్యా రాజధాని పెట్రోగ్రాడ్ లో ప్రొవిన్షియల్ ప్రభుత్వ స్థానం), స్వాధీనం అయిపోయింది.

ఎన్నాళ్ళ నుంచో వేచిచూస్తున్న రాజ్యాంగ అసెంబ్లీ ఎన్నికలు 1917 నవంబరు 12న జరిగాయి. 715 సీట్లున్న ఆ చట్టసభలో సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీ 370 సీట్లు గెలుచుకోగా బోల్షెవిక్కులు కేవలం 175 స్థానాలు గెలుచుకుని రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు. రాజ్యాంగ అసెంబ్లీ మొట్ట మొదటి సారి 1917 నవంబరు 28న సమావేశమైంది, ఐతే ప్రమాణ స్వీకారోత్సవం బోల్షెవిక్కుల కారణంగా 1918 జనవరి 5 వరకూ ఆలస్యమైంది. సెషన్లో మొట్టమొదటిది, చిట్టచివరిది అయిన ఆ రోజున శాంతి, భూమి వంటి అంశాల్లో సోవియట్ ఉత్తర్వును తిరస్కరించారు, తర్వాతి రోజున కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ఈ రాజ్యాంగ సభను రద్దు చేశారు.ఈ విప్లవానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించకపోవడంతో రష్యన్ అంతర్యుద్ధం (1917-22) జరిగింది, సోవియట్ యూనియన్ 1922లో ఏర్పడింది.

ఇస్లామీయ కేలండర్

ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో మరియు ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు మరియు దాదాపు 354 దినాలు గలవు.

క్రీస్తు శకం

క్రీస్తు శకం లేక క్రీస్తు శకానికి ఆరంభము ను ఆంగ్లంలో Anno Domini అంటారు. ఆంగ్లంలో దీనిని మామూలుగా AD లేదా A.D. అని రాయడం లేదా పిలవడం జరుగుతుంది. తెలుగులో క్రీ.శ లేక క్రీస్తు శకం అని వాడడం జరుగుతుంది.

చాంద్రమాన కేలండర్

చాంద్రమాన కేలండర్ (ఆంగ్లం : Lunar calendar) ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడియున్నది. సూర్యమాన కేలండర్ కంటే ఈ కేలండర్ లో 11 రోజులు (లీపు సంవత్సరం లో 12 రోజులు) తక్కువ. సూర్యమాన మరియు చాంద్రమాన కేలండర్లు ఒకే స్థితికి ప్రతి 33 సంవత్సరాలకొకసారి వస్తాయి. ఈ కేలండర్ ప్రత్యేకంగా ధార్మిక అవసరాలకు ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో వాణిజ్యావసరాలకునూ ఈ కేలండర్ ను ఉపయోగిస్తున్నారు.

హిజ్రీ కేలండర్‌ను తప్పించి మిగతావి చాంద్ర-సూర్యమాన కేలండర్ లే. అనగా నెలలు చాంద్రమాన విధముగానే వుంచి చంద్రగమన చక్రాలను లెక్కిస్తారు, తరువాత అంతర్-నెలలను కొలిచి, సూర్యమాన సంవత్సరంతో మమేకం చేస్తారు.

ఎందుకనగా, ఒక సూర్యమాన సంవత్సరంలో 12 చంద్రమాన నెలలు (synodic months) వుంటాయి, దీనినే సాంప్రదాయికంగా చంద్రమాన సంవత్సరం అని అంటారు. దీనిలో 354.37 దినములు వుంటాయి.

నానాక్షాహి కేలండర్

నానాక్షాహి (పంజాబీ: ਨਾਨਕਸ਼ਾਹੀ, nānakashāhī)కాలెండారు సౌర కాలెండరు. ఇది శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ చే తీసుకోబడినది. ఈ కాలెండరులో ముఖ్యమైన సిక్కుల సంఘటలను, పండగలు ఉంటాయి. ఈ కాలెండరు సిక్కులకు నాయకత్వం వహించిన తాకత్ శ్రీదాందమ సాహిబ్ వద్ద గల ప్రసిద్ధ సిక్కు గురువు ప్రొఫెసర్ కృపాల్ సింగ్ బాదుంగర్ ఎస్.జి.పి.సి అధ్యక్షునిగ ఉన్న సమయంలో అమలుచేయబడినది. దీనిని పాల్ సింగ్ పూరెవాల్ చే రూపొందించాడు. ఇది శక కాలెండరు స్థానంలో వచ్చి 1998 నుండి వాడకంలో ఉన్నది. ఈ కాలెండరు యొక్క శకం మొదటి సిక్కుల గురువైన నానక్ దేవ్ జన్మసంవత్సరమైన 1469 నుండి ప్రారంభమైనది. ప్రతీ సంవత్సరం కొత్తసంవత్సరం గ్రెగారియన్ కాలెండరు ప్రకారం మార్చి 14 న ఉంటుంది. ఈ కాలెండరును ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం గురుద్వారాలలో అంగీకరించారు. సిక్కుల యొక్క సనాతన శాఖలలో ఈ కాలెండు గూర్చి వివాదాలున్నాయి. కొన్ని సనాతన సిక్కు శాఖలు దీనిని అంగీకరించడం లేదు.

ఈ కాలెండరు యొక్క ముఖ్యమైన లక్షణాలు:

ఒక ఉష్ణమండల సౌర క్యాలెండర్

గురునానక్ తరువాత నానాక్షి కాలెండరు గా పిలుస్తారు.

గురునానక్ జన్మ సంవత్సరం (1469 CE) మొదటి సంవత్సరం. ఉదాహరణకు, ఏప్రిల్ 2014 CE అనగా నానాక్షహి 546.

పశ్చిమ కాలెండరు యొక్క మెకానిక్స్ అధికంగా వాడుతారు.

పశ్చిమ కాలెండరు వలెనే సంవత్సరం నిడివి ఒకే విధంగా ఉంటుంది. (365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు)

ఐదు నెలలకు 31 రోజులు , ఏడు నెలలకు 30 రోజులు ఉంటాయి.

ప్రతీ నాలుగు సంవత్సరాలకు లీపు సంవత్సరం చివరి నెల ఫాల్గున మాసంలో ఒక రోజు ఎక్కువ వస్తుంది.

2003 లో అకల్ టక్త్ చే అమోదించబడినది తరువాత సవరించబడినది.

మీలాదె నబి

మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది.

మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియాలో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.

రంజాన్ (నెల)

రంజాన్ నెల ఇస్లామీయ కేలండర్ లో 9వ నెల.

శకం

శకం లేదా శకము అనేది కాలగమనం లేదా చరిత్ర రచన యొక్క ప్రయోజనాల కోసం నిర్వచించిన సమయ వ్యవధి. చారిత్రక ప్రాధాన్యము మరియు భౌగోళిక ప్రాంతములను బట్టి శకములు అనేకం ఏర్పడినది. ఏక కాలంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు శకములు కూడా ఏర్పడినవి. ప్రపంచవ్యాప్తంగా అధికంగా క్రీస్తుశకమును ఉపయోగిస్తున్నారు. పూర్వం భారతదేశంలో విక్రమ శకం మరియు శాలివాహన శకం మంచి ప్రాధ్యానమును సంతరించుకొని నేటికి ఉపయోగించబడుతున్నాయి.

షాబాన్

షాబాన్ ఇస్లామీయ కేలండర్ లో 8వ నెల.

హిందూ కేలండర్

హిందూ కేలండర్ (ఆంగ్లం : Hindu calendar), ప్రాచీన కాలంలో సర్వసాధారణంగా ఉపయోగించబడిన కేలండర్. రానురాను అనేక మార్పులకు లోనై, ప్రస్తుత కేలండర్ రూపుదాల్చింది. మరియు భారత జాతీయ కేలండర్గా గుర్తింపు పొందినది. భారత్ లో అనేక ప్రాంతీయ కేలండర్లు వాడుకలో ఉన్నాయి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.