కోన ప్రభాకరరావు

కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ సభాపతి, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.

కీ.శే. కోన ప్రభాకర రావు
కోన ప్రభాకరరావు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
పదవీ కాలము
1981 – 1981
ముందు దివికొండయ్య చౌదరి
తరువాత అగరాల ఈశ్వరరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1916
బాపట్ల, గుంటూరు జిల్లా
మరణం 1990
జాతీయత భారత దేశం

విద్యాభ్యాసం

ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసు లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణే లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.

పాఠశాలలో ఉండగా మోతీలాల్ నెహ్రూ మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. ఉప్పు సత్యాగ్రహము లోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.

రాజకీయ జీవితం

ప్రభాకరరావు 1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972 మరియు 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతిగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. భవనం వెంకట్రామ్ మరియు కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో ఆర్థిక మరియు ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.

గవర్నరుగా

ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న సిక్కిం గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న మహారాష్ట్ర గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రియల్ లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చెలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడడంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశాడు.[1]

క్రీడలు, సినిమాలు

క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవాడు. మరియు బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉంది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమా లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో మంగళసూత్రం, నిర్దోషి, ద్రోహి మరియు సౌదామిని.[2]

శాసనసభ్యునిగా

బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరిలో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.

మరణం

ఈయన అక్టోబరు 20, 1990హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

  1. President Shankar Dayal Sharma, the Scholar and the Statesman By Attar Chand పేజీ.46 [1]
  2. ఐ.ఎమ్.డి.బి.లో కోన ప్రభాకరరావు పేజీ.
1916

1916 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

1990

1990 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

అక్టోబర్ 20

అక్టోబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 293వ రోజు (లీపు సంవత్సరములో 294వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 72 రోజులు మిగిలినవి.

అగరాల ఈశ్వరరెడ్డి

అగరాల ఈశ్వర రెడ్డి ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా 1982వ సంవత్సరం సెప్టెంబరు 7వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1983వ సంవత్సరం జనవరి 16వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ

తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న అమరావతిలో ప్రారంభించారు. ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.

ఉయ్యాల జంపాల

ఇది 1965లో వచ్చిన ఒక తెలుగు సినిమా. అభ్యుదయ భావాలతో కె.బి.తిలక్ అనుపమ పతాకంపై చిత్రాలు నిర్మించారు.హిందీ చిత్రం 'ఝూలా'కు తెలుగు రూపం ఉయ్యాల జంపాల. స్త్రీపురుష ప్రణయానుబంధానికి సంబంధించిన విశిష్టమైన కథతో రూపొందింది ఈ సినిమా. కళావిలువలు ఉన్నా ఈ చలన చిత్రం ఆర్థికంగా పరాజయాన్నే చవిచూసింది, కానీ సినిమాలోని అపురూపమైన పాటల వల్లనే చిరకాలం సినీ ప్రియులకు గుర్తుండిపోయింది.

కోన

కోన పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.

కోన (కొండ) - కోన కొండకు పర్వతానికి మధ్యస్తంగా ఉంటుంది.

కోన (కలకడ) - చిత్తూరు జిల్లాలోని కలకడ మండలానికి చెందిన గ్రామము

కోన (కొమరాడ) - విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలానికి చెందిన గ్రామము

కోన (మక్కువ) - విజయనగరం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన గ్రామము

కోన (మచిలీపట్నం) - కృష్ణా జిల్లా జిల్లాలోని మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామముకోన సీమ, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది.కోన ఇంటి పేరుతో కొందరు ప్రముఖులు:

కోన ప్రభాకరరావు, సుప్రసిద్ధ నటులు, రాజకీయవేత్త, మాజీ గవర్నరు.

కోన వెంకట్ - ప్రముఖ సినిమా రచయిత.

కోన వెంకట్

కోన వెంకట్ తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్‌కు మంచి స్నేహితుడు. పరిచయం అయిన కొత్తల్లో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తను రాసిన సంభాషణలూ సీన్లూ చదివి వినిపించేవాడు. ఆయన రచయిత కావడానికి బీజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మంత్రి కోన ప్రభాకరరావు ఆయన తాత. రాజకీయనాయకుడైనా సినిమాలపైనా బాగా ఆసక్తి ఉండేదాయనకు. మంగళసూత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎల్వీప్రసాద్‌ ద్రోహి సినిమాలో విలన్‌గా చేశాడు.

జూలై 10

జూలై 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరములో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.

దివికొండయ్య చౌదరి

దివి కొండయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఇతను ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా 1978 మార్చి 16న ఏకగ్రీవంగా ఎన్నికై 1980 అక్టోబరు16 వరకు ఆ పదవిని నిర్వహించాడు.

ద్రోహి (1948 సినిమా)

ద్రోహి ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో, ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం తదితరులు నటించిన 1948 నాటి తెలుగు చలనచిత్రం.

నాటక సంస్థలు

తెలుగు నాటకరంగం ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో నాటక సంస్థలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఆదరణ లేకనో, ఆర్థిక భారం వల్లనో కనుమరుగయ్యాయి. కొన్ని మాత్రం ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలనుండి ఆర్థిక సహాయం పొందుతూ నడుస్తున్నాయి.

బాపట్ల

బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని పట్టణం.

బాపట్ల శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17

శాసనసభ వరుస సంఖ్య : 211

మంగళసూత్రం (అయోమయ నివృత్తి)

మంగళసూత్రం ధరించడం ఒక హిందూ సాంప్రదాయం.

మంగళసూత్రం (1939 సినిమా), నాగయ్య, కాంచనమాల నటించారు.

మంగళసూత్రం (1946 సినిమా), కోన ప్రభాకరరావు, లక్ష్మీరాజ్యం నటించారు.

మంగళసూత్రం (1966 సినిమా), ఎన్.టి.రామారావు, దేవిక నటించారు.

ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్లు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
(తెలంగాణ విభజన తరువాత)

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.