కన్ఫ్యూషియస్

కన్‌ఫ్యూషియస్ (ఆంగ్లం : Confucius) (చైనీస్ భాష : Kǒng Fūzǐ లేదా K'ung-fu-tzu), సాహిత్యపరమైన అర్థం: "కాంగ్ గురువు" ("Master Kong"),[1] (సెప్టెంబరు 28, క్రీ.పూ 551 – క్రీ.పూ. 479) చైనాకు చెందిన శోధకుడు, మరియు సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త. ఇతని బోధనలు మరియు తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగింది. ఉదాహరణకు చైనీస్, కొరియన్, జపనీస్, తైవానీస్ మరియు వియత్నామీస్ ఆలోచనలు, తత్వము మరియు జీవితం.

ఇతడి తత్వము, ప్రభుత్వ-నీతి పై, సామాజిక-సంబంధాలపై, న్యాయంపై, మరియు ప్రామాణికతపై తన ప్రభావంచే నొక్కివక్కాణించగలిగినది. ఈ నియమాలు చైనాలో అమితంగా ఆదరణ పొందాయి. ఇతర తత్వాలు దాదాపు మరచిపోయేంత ప్రభావం చూపగలిగింది, ఉదా: హాన్ సామ్రాజ్యం నాటి చైనీయుల న్యాయవాదం (法家) లేదా టావోయిజం (道家) [2][3][4] (206 క్రీ.పూ. – 220 క్రీ.శ.). కన్‌ఫ్యూషియస్ ఆలోచనలు ఆతరువాతి కాలంలో అభివృద్ధి చెంది కన్‌ఫ్యూషియానిజం (儒家) అనే కొత్త తత్వానికి ఊపిరిపోసాయి. ఈ తత్వము యూరప్కు జెసూట్ సంఘం మాట్టియో రిక్కీ చే మొదటిసారిగా పరిచయం గావింపబడినది, దీని లాటిన్ నామం "కన్‌ఫ్యూషియస్".

ఇతని బోధనలు అనలెక్‌ట్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ (論語) లో కానవస్తాయి. ఈ బోధనలన్నీ కన్‌ఫ్యూషియస్ మరణించిన తరువాత క్రోడీకరించబడ్డాయి. నవీన చరిత్రకారులు ఈ క్రోడీకరణలను అంగీకరించడంలేదు. ఈ బోధనలు, కన్‌ఫ్యూషియస్ చేతి దస్తూరీ కాదని వీరి వాదన.[5][6] కానీ దాదాపు 2,000 యేండ్ల తరువాత, ఐదు క్లాసిక్‌లు ఇతడి రచనలు లేదా వీటికి ఇతను సంపాదకుడు,[7][8] అవి క్లాసిక్ ఆఫ్ రైట్స్ (సంపాదకుడు), మరియు స్ప్రింగ్ అండ్ ఆటమ్న్ ఆన్నల్స్ (春秋) (రచయిత) మొదలగునవి అని విశ్వసిస్తున్నారు.

చైనీయ తత్వము
ప్రాచీన తత్వము
Confucius 02
孔夫子
పేరు: 孔丘|చైనీ భాష కాంగ్ కియు
జననం: క్రీ.పూ. సెప్టెంబరు 28, 551
కుఫూ, చైనా
మరణం: 479 క్రీ.పూ.
కుఫూ, చైనా
సిద్ధాంతం / సంప్రదాయం: కన్ఫ్యూషియానిజం స్థాపకుడు
ముఖ్య వ్యాపకాలు: నీతి తత్వము, సామాజిక తత్వము, ఎథిక్స్
ప్రముఖ తత్వం: కన్‌ఫ్యూషియానిజం
ప్రభావితం చేసినవారు: జ్‌హౌ కాలము చైనీయ తత్వం
ప్రభావితమైనవారు: తూర్పు తత్వవేత్తలు

వ్యక్తిగత జీవితం మరియు కుటుంబం

సంప్రదాయానుసారం, కన్ఫ్యూషియస్ క్రీ.పూ 551 లో వసంతకాలంలో జన్మించాడు. ఇతడి జన్మకాలములో నూరు తత్వాల పాఠశాల అనే తత్వ-ఉద్యమం బయలుదేరియుండినది. ఇతను లూ రాజ్యం (ప్రస్తుతంషాండోంగ్ రాష్ట్రం) లోనికుఫూ నగర సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతడి కుటుంబం అనేక కష్టకాలాలనూ చూసింది.[9]

బోధనలు

అనలెక్‌ట్స్ 論語 లలో, కన్‌ఫ్యూషియస్ తనకు తాను "ఏమీ కనుగొనని వార్తాహరుడు" ("transmitter who invented nothing") అని వ్రాసుకున్నాడు.[7] ఇతడు "చదువు" పై అమిత ప్రాముఖ్యతను ప్రదర్శించాడు,[10][11] మరియు ఇతని గ్రంథము "విద్య" కొరకు గల చైనీభాష పదం చదువు తో ప్రారంభమవుతుంది. ఈ కారణాన చైనీయులు ఇతడిని "మహా గురువు"గా గౌరవిస్తారు.జీవితం మరియు సమాజపు సిద్ధాంతాలను స్థిరపరచే సాంప్రదాయాలను నెలకొల్పే విధానాలను దూరంగా ఉంచి, స్వయంశోధన చేపట్టాలని, తద్వారా బాహ్యప్రపంచాన్ని అధ్యయనం చేయాలని తన శిష్యులకు బోధించేవాడు.[12]

కన్ఫ్యూషియస్ బోధనలలో ఒక బోధనపై ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూవచ్చాడు, అదే స్వీయ-శోధన మరియు నడవడికల సూత్రీకరణ. నీతిశాస్త్రముపై మరియు సామాజికనీతి, ప్రభుత్వ-నీతి మొదలగు అంశాలపై ఎక్కువ ప్రాధాన్యత ప్రకటించాడు.[13][14]

సంగీత సాధన

కన్ఫ్యూషియస్ వ్యక్తిత్వంలో, జీవితంలో సంగీత సాధనకు ప్రాధాన్యం ఉంది. చైనాదేశపు సంగీతం మనుష్యుని స్వభావంలో ఒక గుణసమత్వాన్ని, భావసమత్వాన్ని అందిస్తుందని, తద్వారా నైతిక జీవనం అలవడుతుందని చెప్పేవారు. సంగీతం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులకు, రాజుకూ నైతికత అలవడుతుందని, అది వారి పాలన వల్ల దేశంలో ప్రతిఫలిస్తుందని బోధించారు. సంగీతం వల్ల వ్యక్తికి నైతికత, శాంతి, పరతత్త్వ అనుభూతి కూడా లభిస్తుందని భావించేవారు. కన్ఫ్యూషియస్ హియాంక్సే(Hsiang tse) అనే విద్వాంసుని వద్ద సంగీతాన్ని అభ్యసించారు.[15]

పేర్లు

Confucius - Project Gutenberg eText 15250
కన్‌ఫ్యూషియస్ చిత్రం, ఇ.టి.సి.వెర్నర్ (1922) రచన "మిథ్ మరియు లెజెండ్స్ ఆఫ్ చైనా" నుండి సేకరణ.
 • మిచిలీ రుగ్గీరీ, మరియు ఇతరుడు, జెసూట్స్, చైనీయుల సాహిత్యాలను పాశ్చాత్య భాషలలో తర్జుమా చేయునపుడు, " 孔夫子 "ను 'కన్‌ఫ్యూషియస్' అని తర్జుమాచేసారు. ఈ పేరే సాధారణంగా పాశ్చాత్యదేశాలలో ఉపయోగించడం జరుగుతున్నది.
 • రోమనీ కరణ::
 • కాంగ్ ఫూజీ (Kǒng Fūzǐ, లేదా Kǒng fū zǐ) పిన్‌యిన్ లో.
 • కూంగ్ ఫూ-త్జూ (K'ung fu-tzu) వడే గైల్స్లో (లేదా, కుంగ్ ఫు-త్జే).
 • ఫూజీ అనగా గురువు (టీచరు). చైనీయుల సాంప్రదాయం ప్రకారం, గురువును పేరుతో పిలవడం సాంప్రదాయం కాదు, కావున గౌరవపూర్వక నామవాచక ఉపయోగం "మాస్టర్ కాంగ్" అని లేదా "గౌరవనీయ గురువు" అనీ పిలువసాగారు.
 • 'ఫు' అనే అక్షరం ఐచ్ఛికం; నవీన చైనాలో ఇతను సర్వసాధారణంగా కాంగ్ జీ అని పిలువబడుతాడు.
 • ఇతని అసలు నామం 孔丘, "కాంగ్ ఖియు" (Kǒng Qiū). కాంగ్" అనునది సాధారణ చైనీయ కుటుంబ నామం.

(వడే గైల్స్ లో ఇతని పేరు కుంగ్ చియూ, అనువాదం డి.సి.లౌ).

 • ఇతని సౌజన్యం పేరు 仲尼, జ్‌హోంగ్ నీ.
 • క్రీ.పూ. 9వ శతాబ్దం ( en:Han Dynasty కాలపు యువాంషీ మొదటి సంవత్సరం ), ఇతనికి మొదటి మరణాంతర నామం (బిరుదు): 褒成宣尼公, "లార్డ్ బావోఛేంగ్‌జువాన్".
 • ఇతని ప్రసిద్ధ మరణాంతరనామాలు (బిరుదులు)
 • 至聖先師, 至聖先師,జీషేంగ్‌జియాంషీ, (అర్థం : జ్ఞాన స్థానాన్ని చేరిన గతకాలపు గురువు)
 • 至聖,至聖, జీషేంగ్, "మహా ఋషి";
 • 先師,先師, జియాంషీ, "మొదటి గురువు".[16]
 • ఇంకనూ 萬世師表,"వాషీషిబియావో", చైనీయ భాష లో "ఆదర్శ గురువు".

తత్వము

Confucius Tang Dynasty
కన్‌ఫ్యూషియన్ యొక్క ఆకృతి చిత్రం టాంగ్ సామ్రాజ్యానికి చెందినది. కళాకారుడు వూ దావోజీ (680-740).

కన్‌ఫ్యూషియానిజంను చైనీయులు ఒక మతముగా అవలంబిస్తున్నప్పటికీ, అనేకానేక సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇదొక తత్వమా లేక మతమా? అని వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నవి. కన్‌ఫ్యూషియానిజం లో "జన్మాంతరము" లేదు. దేవుడు లేదా దేవతల గురించి ఒక సంక్లిష్టమైన దృష్టి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికపరమైన, ఆత్మసంబంధమయిన విషయాలను ఈ తత్వము స్పృశించలేక పోవడం మతపరంగా ఒక లోటు.

ఇవీ చూడండి

మూలాలు

 1. More commonly abbreviated to మూస:Zh-cp; see Names section
 2. Ban 111, vol.56
 3. Gao 2003
 4. Chen 2003
 5. Zhang 1899, p. 111
 6. Liu 2005, section 3
 7. 7.0 7.1 The Analects & 479 BC - 221 BC, VII.1
 8. Kang 1958
 9. Chien 1978
 10. Chien 1978, pp. 117-120
 11. The Analects & 479 BC - 221 BC, I.1
 12. The Analects & 479 BC - 221 BC, III.3; VI.13 and XVII.11
 13. Derrida 1983, p. 63
 14. Du 2005
 15. సంగీతం - సిద్ధి:శివానందమూర్తి:సుపథ ద్వైమాసిక పత్రిక:జూన్ 2011:పేజీ.45,46
 16. Zhang 1988, p. 76
 • "Windows into China", John Parker, ISBN 0-89073-050-4
 • "The Eastern origins of Western civilization", John Hobson, ISBN 0-521-54724-5

ఇతర పఠనాలు

 • Chin, Annping (2007). The Authentic Confucius: A Life of Thought and Politics. New York: Scribner. ISBN 0-7432-4618-7.
 • Confucius. (1997). Lun yu, (In English The Analects of Confucius). Translation and notes by Simon Leys. New York: W.W. Norton. ISBN 0-393-04019-4.
 • Confucius. (2003). Confucius: Analects—With Selections from Traditional Commentaries. Translated by E. Slingerland. Indianapolis: Hackett Publishing. (Original work published c. 551–479 BC) ISBN 0-87220-635-1.
 • Csikszentmihalyi, M. (2005). "Confucianism: An Overview". In Encyclopedia of Religion (Vol. C, pp 1890–1905). Detroit: MacMillan Reference USA.
 • en:Herrlee Glessner Creel (1949). Confucius and the Chinese Way. (Reprinted numerous times by various publishers.)
 • Mengzi (2006). Mengzi. Translation by B.W. Van Norden. In en:Philip J. Ivanhoe & B.W. Van Norden, Readings in Classical Chinese Philosophy. 2nd ed. Indianapolis: Hackett Publishing. ISBN 0-87220-780-3.
 • Van Norden, B.W., ed. (2001). Confucius and the Analects: New Essays. New York: Oxford University Press. ISBN 0-19-513396-X.
 • Wu, J. (1995a). "Confucius". In I. McGreal (ed.), Great Thinkers of the Eastern World: The Major Thinkers of the Philosophical and Religious Classics of China, India, Japan, Korea and the world of Islam (pp 3–8). New York: HarperCollins. ISBN 0-06-270085-5
 • Wu. J. (1995b) "Mencius". In I. McGreal (ed.), Great Thinkers of the Eastern World: The Major Thinkers of the Philosophical and Religious Classics of China, India, Japan, Korea and the world of Islam (pp 27–30). New York: HarperCollins. ISBN 0-06-270085-5
 • Confucius appears as one of the main characters in Gore Vidal's Creation (novel). The book gives a very sympathetic and human portrait of him and his times.

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
అల్లం

అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

కన్ఫ్యూషియస్ మతం

కన్ఫ్యూసియనిజం. రెండు వేల సంవత్సరాలకు పైగా చైనీయులను ప్రభావితం చేస్తున్న ఒక మతం, ఒక జీవన విధానం, ఒక ఆలోచనా సరళి. కన్ఫూసియ నిజం ఒక వ్యవస్థీకృత మతంగా కంటే ఒక జీవన విధానంగా, ఒక నైతిక ప్రవర్తన నియమావళిగా చైనా జాతిని తీర్చిదిద్దింది. ఈ మతం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్. ఇది లాటిన్ భాషలో ఉచ్చారణ. చైనీస్ భాషలో ఈ పదాన్ని ‘కంగ్‌ ఫూ జా’ అని పలకాలి. ఈ పదాలకు అర్థం పరమ గురువు కంగ్‌ (Grand Master Kung) అని. ఆయన జీవించినది క్రీ. పూ. 551 నుంచి 479 వరకు. కాని ఎందరు పాలకులు మారినప్పటికీ నాటికీ నేటికీ కన్ఫ్యూసియస్‌ సిద్ధాంతాలకు విలువ తగ్గలేదు. వ్యక్తి వికాసం మొదలు ఆదర్శ విశ్వసమాజ నిర్మాణం వరకు వివిధాంశాలపై కన్ఫ్యూసియస్‌ చెప్పిన సూక్తులు అలాంటివి. క్రీ. పూ. 210 సంవత్సరంలోనే కన్ఫ్యూసియస్‌ నైతిక సూత్రాలకు అప్పటి పాలకులు శాసన రూపం ఇచ్చారు. కమ్యూనిస్టు వ్యవస్థలో సైతం వ్యక్తి జీవితానికి గానీ, సమాజ వ్యవహారాలకు గానీ సంబంధించి ఆయన సూచించిన నీతి నియమాలకు భంగం కలగలేదు.

కన్ఫ్యూషియస్ మతం అనబడునది అతని పర్యటనల, అనుభవముల, ప్రాచీన జ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా ఏర్పడినది, లౌడ్జును అసలు విమతస్తుడు (irreligious) అంటారు. వీరికి అసలు మతమే లేదని చెబుతారు. ఏది ఏమైనా అతని పేరుతో ఒక మతం ఉంది. ఒక తత్వం ఉంది. అతడు ఒక గొప్ప ఆలోచనాపరుడు. ఇతడి మతం చైనీయుల తత్వానికి ఒక వ్యాఖ్యానం.

కళాశాల

కళాశాల లేదా కాలేజ్ (లాటిన్: కొల్లేజియం ) అనే పదం యునైటెడ్ స్టేట్స్ లో డిగ్రీ-ప్రధానం చేసే తృతీయస్థాయి విద్యా సంస్థను సూచించడానికి మరియు ఇతర ఆంగ్లం-మాట్లాడే దేశాలలో ప్రైవేట్ విద్యావ్యవస్థలోని పాఠశాల యొక్క ద్వితీయ సోపానాన్ని సూచించడానికి నేడు తరచు వాడబడుతుంది. మరింత వివరంగా, అది ఏదైనా కళాశాలల సమూహం యొక్క పేరు కావచ్చు, ఉదాహరణకు, ఒక ఎన్నికల కళాశాల, ఒక ఆయుధ కళాశాల లేదా కార్డినల్స్ యొక్క కళాశాల వంటివి. కొంతమంది వ్యక్తులు కొన్ని ఉమ్మడి నియమాలకు లోబడి (కాం- = "కలసి" + లెగ్- = "చట్టబద్ధంగా" లేదా లెగో = "నేను ఎంపికచేసుకున్నాను") కలసి నివసించడం; నిజానికి, కొన్ని కళాశాలలు వాటి సభ్యులను "ఫెలోలు"గా పిలుస్తాయి. ఆంగ్లం-మాట్లాడే దేశాలలో ఈపదం యొక్క సంక్షిప్త వాడకం మారుతూ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఐర్లాండ్ లలో, ఉదాహరణకు, "కళాశాల" మరియు "విశ్వవిద్యాలయం" అనే పదాలు ఒకదాని బదులు ఒకటి వాడబడతాయి, యునైటెడ్ కింగ్డం, కెనడా, ఆస్ట్రేలియా మరియు ఇతర కామన్ వెల్త్ దేశాలలో, సాధారణంగా "కాలేజ్" అనేది పాఠశాల మరియు విశ్వవిద్యాలయస్థాయిల మధ్య ఉండే సంస్థగా ఉంటుంది(అయితే కొన్నిసార్లు విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పాఠశాలలను కూడా "కళాశాలలు"గా వ్యవహరిస్తారు). ఫ్రెంచ్ లో, "కళాశాల" అనే పదం 4 సంవత్సరాల మాధ్యమిక పాఠశాలను మరియు ఒక సంస్థను పంచుకోవడం అనే సాధారణ భావనను సూచిస్తుంది, మరియు కామన్వెల్త్ దేశాలలో, కొన్ని పురాతన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు ఈపదం యొక్క భావాన్ని అలాగే ఉంచాయి(ఉదాహరణకు, ఎటన్ కాలేజ్).

టాంగ్ రాజవంశం

మూస:Contains Chinese text

మూస:History of Chinaటాంగ్ రాజవంశం (Chinese: 唐朝; pinyin: Táng Cháo; మూస:IPA-cmn; మధ్య చైనా: ధంగ్) (జూన్ 18, 618–జూన్ 4, 907) సుయి రాజవంశం తరువాత ఐదు రాజవంశాలు మరియు పది రాజ్యాల కాలానికి ముందు పాలించిన ఒక సంపూర్ణాధికార చైనా రాజవంశం. సుయి సామ్రాజ్యం యొక్క క్షీణత మరియు పతన కాలంలో దానిని ఆక్రమించిన లీ (李) కుటుంబం చేత ఇది స్థాపించబడింది. ఈ రాజవంశం కొద్ది కాలం రెండవ ఝౌ రాజవంశం (అక్టోబరు 8, 690–మార్చి 3, 705) కి చెందిన సామ్రాజ్ఞి వూ జెతియాన్ చేత ఆక్రమించబడింది, ఈమె తన స్వయం నిర్ణయాధికారంతో చైనాను పాలించిన మొట్ట మొదటి మరియు ఒకే ఒక ప్రసిద్ధి చెందిన సామ్రాజ్ఞి.

టాంగ్ రాజవంశం, ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరుపొందిన చాంగన్ (ప్రస్తుతం జియాన్) ముఖ్య పట్టణంగా కలిగి, చైనీయుల నాగరికతలో అత్యున్నత స్థానం కలిగి—దానికి ముందున్న హన్ రాజవంశంతో సమానంగా, లేదా దానిని అధిగమించి —విశ్వజనీన సంస్కృతియొక్క స్వర్ణయుగంగా గౌరవింపబడుతోంది. వారి ప్రారంభ పాలకుల సైనిక దాడుల ద్వారా సంక్రమించిన, దాని అధికార ప్రాంతం, హన్ యుగం కంటే విశాలమై, తరువాత పాలించిన యువాన్ రాజవంశం మరియు క్వింగ్ రాజవంశం పాలిత ప్రాంతాలకు దీటుగా ఉంది. 7వ మరియు 8వ శతాబ్దాలలో జరుపబడిన రెండు జనాభా గణనలలో, టాంగ్ అధికార ప్రతులు నమోదిత గృహాల సంఖ్యనుబట్టి జనాభాను దాదాపు 50 మిల్లియన్లుగా అంచనా వేశాయి. ఇంకా, 9వ శతాబ్దంలో కేంద్ర ప్రభుత్వం పతనమౌతున్న సమయంలో జనాభా గణన కచ్చితంగా మదింపు చేయలేనప్పటికీ, అప్పటికి జనాభా దాదాపు 80 మిల్లియన్లకు చేరినట్లు అంచనా వేయబడింది. దాని భారీ జనాభా ఆధారంగా, రాజవంశం అంతర ఆసియా మరియు వ్యాపారపరంగా లాభదాయక సిల్క్ మార్గం వెంట ఉండే సంచార జాతుల అధికారాన్ని తట్టుకునేందుకు నిపుణులైన మరియు నిర్బంధ సైనికులైన వందల వేల దళాలను తయారు చేసుకోగలిగింది. టాంగ్ ఆస్థానానికి వివిధ రాజ్యాలు మరియు రాష్ట్రాలు విధేయత ప్రకటించాయి, కాగా ఒక రక్షణ ఒప్పంద వ్యవస్థ ద్వారా పరోక్షంగా కూడా టాంగ్ అనేక ప్రాంతాలను స్వాధీనం లేదా లొంగదీసుకోవటం జరిగింది. రాజకీయ అధికారంతో పాటు, టాంగ్ తన పొరుగున ఉన్న కొరియా, జపాన్, మరియు వియత్నాం వంటి రాజ్యాలపై బలీయమైన సాంస్కృతిక ప్రభావాన్ని కలిగించింది.

ఆన్ షి తిరుగుబాటు మరియు రాజవంశం యొక్క తరువాతి అర్ధ భాగంలో కేంద్ర నియంత్రణ తగ్గుతున్న సమయాలలో మినహాయిస్తే, టాంగ్ రాజవంశ పాలన ముఖ్యంగా ఒక పురోగమనం మరియు స్థిరత్వం కలిగినది. గత సుయి రాజవంశంలో వలెనే, టాంగ్ రాజవంశం కార్యాలయాలకు ప్రామాణిక పరీక్షలు మరియు సూచనల ద్వారా ప్రత్యేక విధుల అధికారుల చేత నిర్వహింపబడే పౌర సేవ వ్యవస్థను అమలుచేసింది. 9వ శతాబ్దంలో ఈ పౌర క్రమణిక జియెడుషి అనబడే ప్రాంతీయ సైనిక పాలనాధికారుల ప్రాబల్యంతో క్షీణించడం జరిగింది. టాంగ్ యుగంలో చైనీయుల సంస్కృతి మరింత వికాసంచెంది వర్ధిల్లింది; చైనీయుల కవిత్వానికి ఇది అత్యున్నత కాలంగా పరిగణింపబడుతోంది. చైనా యొక్క అత్యంత పేరు పొందిన కవులలో ఇద్దరు, లి బాయ్ మరియు డు ఫులు, అలాగే, అనేకమంది ప్రఖ్యాత చిత్రకారులు హన్ గన్, ఝాంగ్ జువాన్, మరియు ఝౌ ఫంగ్ వంటివారు ఈకాలానికి చెందినవారు. పండితులచే సేకరింపబడిన సుసంపన్న వైవిధ్యం కలిగిన చారిత్రిక సాహిత్యం, అలాగే విజ్ఞానసర్వసాలు మరియు భౌగోళిక రచనలు ఉన్నాయి.

టాంగ్ కాలంలో అనేక ప్రసిద్ధ ఆవిష్కరణలు ఉన్నాయి, వీటిలో చెక్క పలక ముద్రణ అభివృద్ధి కూడా ఉంది. స్థానిక చైనీయ శాఖలు ప్రాముఖ్యత పొందడంతో, బుద్ధిజం చైనా సంస్కృతిలో ప్రధాన ప్రభావంగా మారింది. ఏదేమైనా, తరువాతి కాలంలో బుద్ధిజం రాజ్యంచే అవమానించబడింది మరియు దాని ప్రభావం తగ్గిపోయింది. 9వ శతాబ్దానికి రాజవంశం మరియు కేంద్ర ప్రభుత్వం పతనమైనప్పటికీ, కళ మరియు సంస్కృతి వర్ధిల్లడం కొనసాగింది. బలహీనమైన కేంద్ర ప్రభుత్వం దేశం యొక్క ఆర్థికవ్యవస్థ నిర్వహణ నుండి దాదాపుగా వైదొలగింది, అయితే దేశం యొక్క వర్తక వ్యవహారాలు అలాగే కొనసాగాయి మరియు వాణిజ్య వర్తకం అభివృద్ధి చెందడం కొనసాగింది.

పారిశ్రామిక విప్లవం

18 నుండి 19 వ శతాబ్ద మధ్యకాలంలో వ్యవసాయం, యాంత్రిక ఉత్పత్తి, గనుల త్రవ్వకం, రవాణా మరియు సాంకేతికతలలోని ప్రధాన మార్పులు ఆ కాలంలోని సాంఘిక ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులపై గొప్ప ప్రభావాన్ని చూపిన కాలం పారిశ్రామిక విప్లవం గా పిలువబడుతుంది. ఇది యునైటెడ్ కింగ్డంలో ప్రారంభమై, అనతరం ఐరోపా, ఉత్తర అమెరికా, తుదకు ప్రపంచం అంతటా వ్యాపించింది.

పారిశ్రామిక విప్లవం మానవ చరిత్రలో ఒక ప్రధాన మలుపుగా ఉంది; నిత్య జీవితంలో దాదాపు ప్రతి అంశము ఏదో ఒక విధంగా ప్రభావితమైంది. ముఖ్యంగా, సగటు ఆదాయం మరియు జనాభా అనూహ్యంగా నిలకడతో కూడిన అభివృద్ధిని ప్రదర్శించడం ప్రారంభించాయి. 1800 తరువాత రెండు శతాబ్దాలలో, ప్రపంచం యొక్క సగటు తలసరి ఆదాయం 10- రెట్లకు పైగా పెరుగగా, ప్రపంచం యొక్క జనాభా 6-రెట్లకు పైగా పెరిగింది. నోబెల్ బహుమతి విజేత రాబర్ట్ E. లుకాస్, జూనియర్ మాటలలో, "చరిత్రలో మొదటిసారి, సాధారణ ప్రజా సమూహాల జీవన ప్రమాణాలు నిలకడతో అభివృద్ధి చెందాయి..... ఈ ఆర్ధిక స్వభావం వంటి దానికి వేరే విధమైనది గతంలో ఎప్పుడూ ఏర్పడలేదు."18వ శతాబ్దపు తరువాత భాగంలో ప్రారంభించి, గతంలో మానవశ్రమ మరియు జంతువులతో-లాగబడటంపై ఆధారపడిన గ్రేట్ బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థలోని భాగాలలో మార్పు ప్రారంభమై, యంత్ర-ఆధారిత తయారీవైపు మరలాయి. అది నూలు పరిశ్రమల యాంత్రీకరణ, ఇనుము-తయారీ పద్ధతులలో అభివృద్ధి మరియు శుద్ధమైన బొగ్గు ఉపయోగంలో పెరుగుదలలతో ప్రారంభమైంది. కాలువలు, మెరుగుపరచబడిన రహదారులు మరియు రైలుమార్గాల ద్వారా వర్తక విస్తరణకు అవకాశం కల్పించబడింది.బొగ్గు ప్రాధాన ఇంధనంగా ఆవిరి శక్తి ప్రవేశం, జల చక్రముల విస్తృత వినియోగం మరియు యంత్రాల యొక్క శక్తి (ప్రధానంగా నూలు తయారీలో) ఉత్పత్తి సామర్ధ్యంలో నాటకీయ పెరుగుదలలకు బలాన్ని కలిగించాయి. 19వ శతాబ్దం యొక్క మొదటి రెండు దశాబ్దాలలో అన్ని రకాల-లోహ యాంత్రిక పరికరముల అభివృద్ధి ఇతర పరిశ్రమలలో తయారీకి అవసరమైన ఉత్పత్తి యంత్రాల తయారీకి వీలు కలిగించింది. 19వ శతాబ్దంలో ఈ ప్రభావాలు పశ్చిమ ఐరోపా మరియు ఉత్తర అమెరికా అంతా వ్యాపించి, చివరకు పారిశ్రామికీకరణగా కొనసాగుతున్న ప్రక్రియలో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసాయి. సమాజంపై ఈ మార్పు యొక్క ప్రభావం అపరిమితంగా ఉంది.18వ శతాబ్దంలో మొదలైన మొదటి పారిశ్రామిక విప్లవం, సుమారు 1850 నాటికి రెండవ పారిశ్రామిక విప్లవంలో కలిసిపోయింది, ఆ సమయంలో ఆవిరి-శక్తితో కూడిన పడవలు, రైలు మార్గాలు, మరియు తరువాత 19వ శతాబ్దంలో అంతర్గత దహన యంత్రం మరియు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి యొక్క అభివృద్ధితో సాంకేతిక మరియు ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంది. పారిశ్రామిక విప్లవం జరిగిన కాలాన్ని వివిధ చరిత్రకారులు విభిన్న రకాలుగా పేర్కొన్నారు. ఎరిక్ హాబ్స్బావ్మ్, అది బ్రిటన్‌లో 1780లలో "ఒక్కసారిగా ప్రారంభమైందని" మరియు 1830లు లేదా 1840ల వరకు పూర్తిగా గుర్తించబడలేదని పేర్కొనగా, T. S. అష్టన్, సుమారుగా 1760 మరియు 1830ల మధ్యభాగంలో జరిగిందని చెప్పాడు.జాన్ క్లాఫం మరియు నికోలస్ క్రాఫ్ట్స్ వంటి కొందరు 20వ శతాబ్ద చరిత్రకారులు ఆర్థిక మరియు సాంఘిక మార్పు క్రమంగా జరిగిందని మరియు విప్లవం అనేది తప్పు పేరని వాదించారు. చరిత్రకారుల మధ్య ఇది ఇప్పటికీ వివాదాస్పద విషయంగానే ఉంది. పారిశ్రామిక విప్లవం మరియు ఆధునిక సామ్రాజ్యవాద ఆర్థికవ్యవస్థల ఉద్భవానికి ముందు GDP తలసరి స్థూలంగా స్థిరంగా ఉంది. పారిశ్రామిక విప్లవం సామ్రాజ్యవాద ఆర్థికవ్యవస్థలలో తలసరి ఆర్థిక పెరుగుదల యుగాన్ని ప్రారంభించింది. పశువులు మరియు మొక్కల పెంపకం తరువాత పారిశ్రామిక విప్లవ ప్రారంభం మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని ఆర్థిక చరిత్రకారులు అంగీకరిస్తారు.

పాలనా తత్త్వశాస్త్రం

పాలనా తత్త్వశాస్త్రం లేదా పాలనా సిద్ధాంతం అనేది "వివిధ పాలనా సమస్యలను పరిష్కరించడంలో అధికారుల అనుభవాలు, వ్యవస్థల పరిశీలన ద్వారా రూపొందించిన పద్ధతులు, విజ్ఞుల, మేధావుల తాత్త్విక భావాలను అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించడం" అని పాలనా తత్త్వవేత్తలు అనే పుస్తకం నిర్వచనమిస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పాలనా సిద్ధాంతం వీటి అధ్యయనం : రాజనీతిశాస్త్రం, స్వేచ్ఛ, న్యాయం, సొత్తు, హక్కులు, చట్టం, మరియు అధికారం ద్వారా ఆ చట్టాల అమలు; అవి ఏమిటి, అవి (అసలు) ఎందుకు కావాలి, ప్రభుత్వానికి అధికారాన్ని ఎవరు కట్టబెట్టారు, ఆ ప్రభుత్వం ఏం-ఏం అంశాల్లో ప్రజల స్వేచ్ఛను, వారి హక్కులను కాపాడాలి, ఎందుకు కాపాడాలి, ప్రభుత్వం ఎలాంటి పరిధిని ఏర్పరుచుకోవాలి, ఎందుకు అలా చేయాలి, చట్టమంటే ఏమిటి, మరియు ఒక సమ్మతమైన ప్రభుత్వానికి ప్రభుత్వాధీన ప్రజలు ఎలాంటి బాధ్యతలు (అసలుంటే) కలిగి ఉండాలి, (ఒకవేళ) ఎలాంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని ప్రజలు దింపేయవచ్చు.

ప్రభుత్వ కార్యకలాపాల పరిధి విస్తృతం కావడంతో పందొమ్మిదవ శతాబ్దంలో ఒక స్వతంత్ర, ప్రత్యేక అధ్యయనంగా ప్రభుత్వ పాలన మొదలయింది. ప్రభుత్వ పాలన విస్తృతమౌతున్న కొద్దీ, ఏర్పడుతున్న సమస్యల పరిష్కారం కోసం వివిధ అంశాలపై రాజకీయ తత్త్వవేత్తలు పరిశోధనలు చేపట్టారు. వివిధ పరిశోధకులు, అధికారులు, వృత్తిపర అనుభవజ్ఞులు వివిధ సమస్యలను పరిష్కరించి, తద్వారా నూతన అన్వేషణలకు మార్గాలు వేసారు. ఈ క్రమంలో వెలువడిన వివిధ పరిష్కారాలు, భావనలే పాలనా సిద్ధాంతానికి పునాదులు వేసి పాలా తత్త్వశాస్త్ర వికాసానికి తోడ్పడ్డాయని ప్రభుత్వపాలనాశాస్త్ర ఆచార్యులు డి. రవీంద్రప్రసాద్ ప్రతిపాదించారు.చాలా మార్లు పాలనా తత్త్వశాస్త్రమంటే రాజకీయ వ్యవస్థ పట్ల సాధారణ దృక్కోణం లేదా ఒక విశిష్ట నీతి లేదా ఒక రాజకీయపరమైన విశ్వాసంగా చెప్పుకొస్తారు. దీనిని రాజకీయ ఆలోచనా ధోరణికి నానార్ధంగా వాడత్తారు కూడా.

పాలనా తత్త్వశాస్త్రమనేది తత్త్వశాస్త్రంలోని ఒక శాఖ. కొందరి ప్రకారం పాలనా తత్త్వశాస్త్రమనేది రాజకీయ వ్యవస్థ అధ్యయనం లో ఒక భాగం. ఐతే, అలాంటి సందర్భాలలో పాలనా తత్త్వశాస్త్రం అనే పదం బదులు పాలనా సిద్ధాంతం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాంటి సందర్భాలలో ఈ శాస్త్రం కేవలం సైద్ధాంతిక శాస్త్రంగా మిగిలిపోతుంది. అలాంటి సందర్భంలో ఈ శాస్త్రం తన తాత్త్విక గుణాన్ని కోల్పోతుంది.

సంగీత వాయిద్యం

సంగీత ధ్వనులను ఉత్పత్తి చేయడానికి నిర్మించబడిన లేదా ఉపయోగించే పరికరం సంగీత వాయిద్యం . సూత్రబద్ధంగా, ధ్వనిని జనింపచేసే ఏదైనా సంగీత వాయిద్యంగా ఉపయోగపడుతుంది. సంగీత వాయిద్యాల చరిత్ర మానవ సంస్కృతి ప్రారంభంతోనే మొదలవుతుంది. సంగీత వాయిద్యాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఆర్గనాలజి అంటారు.

సంగీత వాయిద్యంగా వివాదాస్పద గుర్తింపు పొందిన మొదటి పరికరం 67,000 సంవత్సరాల పురాతనమైనది; పూర్వ చారిత్రిక వస్తుజాలంగా సాధారణంగా అంగీకరింపబడిన పురాతన వేణువు దాదాపు 37,000 సంవత్సరాలనాటిది. ఏమైనప్పటికీ, నిర్వచనం యొక్క కేంద్రభావన సంక్లిష్టత వల్ల సంగీత వాయిద్యం యొక్క ప్రత్యేక కాలాన్ని నిర్ణయించడం అసంభవమని అత్యధిక చరిత్రకారుల అభిప్రాయం.

ప్రపంచపు అధిక జనసాంద్రత ప్రాంతాలలో సంగీతవాయిద్యాలు విడివిడిగా అభివృద్ధి చెందాయి. ఏమైనప్పటికీ, నాగరికతల మధ్య సంబంధాల ఫలితంగా ఇవి వాటి జన్మస్థానంనుండి సుదూరంగాఉన్న ప్రాంతాలలో కూడా వేగంగా వ్యాప్తిచెంది ఉపయోగించబడ్డాయి. మధ్య యుగాల నాటికల్లా, మెసపొటోమియా యొక్క పరికరాలు మలయ్ ద్వీపసమూహం లోను మరియు ఉత్తర ఆఫ్రికా వాయిద్యాలు యూరోపియన్లచేత వాడబడ్డాయి. అమెరికాలలో అభివృద్ధి మందగమనంలో సాగినా, ఉత్తర, మధ్య, మరియు దక్షిణ అమెరికాలు సంగీత వాయిద్యాలను మాత్రం పంచుకున్నాయి.

సమురాయ్

సమురాయ్ అనే పదం పూర్వ పారిశ్రామిక జపాన్ యొక్క సైనిక ప్రభువులకు ఉద్దేశించింది. విలియం స్కాట్ విల్సన్ అనే అనువాదకుని ప్రకారం: "చైనా భాషలో, 侍 అనే అక్షరం ఒక క్రియ, దీనికి అర్ధం వేచిఉండటం లేదా సమాజంలో ఉన్నత పదవిలో ఉన్నవారికి తోడుగా ఉండటం, ఇది జపనీయుల సహజ పదం, సబురుకు కూడా సరిపోతుంది. రెండు దేశాలలో కూడా ఈ పదం "కులీనుల వద్ద సేవకు హాజరయ్యే అంతరింగిక సేవకులకు సంబంధించినది," జపాన్ భాషలో దీని ఉచ్ఛారణ సబురాయ్కి మారింది." విల్సన్ ప్రకారం, "సమురాయ్" అనే పదానికి సంబంధించిన మొదటి సూచన కోకిన్ వాకషు (905-914)లో కనిపిస్తుంది, ఇవి తొమ్మిదో శతాబ్ది మొదటి భాగానికి చెందిన అతిగొప్ప నీతి పద్యాలు.

12వ శతాబ్దాంతానికి, సమురాయ్ దాదాపు బుషీ (武士) తో సమానమైన పదంగా మారింది, మరియు ఈ పదం యుద్ధ తరగతుల యొక్క మధ్య మరియు ఉన్నత స్థాయిలతో సమీప సంబంధం కలిగిఉండేది. సమురాయ్ బుషిడోగా పిలువబడే లిఖిత నియమాలను అనుసరించే వారు. వారి సంఖ్య జపాన్ యొక్క జనాభాలో 10% కంటే తక్కువ. సమురాయ్ బోధనలు నేటి ఆధునిక సమాజంలో యుద్ధ కళలైన ఖడ్గం యొక్క మార్గం అనే అర్ధాన్ని కలిగిన కెన్డో, వంటి వాటిలో ఇప్పటికీ కనుగొనవచ్చు.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.