ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని మరియు నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.

ఎం.ఎస్.సుబ్బ లక్ష్మి
M.S. Subbalakshmi
జననంమధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి
సెప్టెంబర్ 16, 1916
మదురై,తమిళనాడు రాష్ట్రం
మరణం2004 డిసెంబరు 11 (వయసు 88)
చెన్నై, తమిళనాడు రాష్ట్రం
మరణానికి కారణంఊపిరితిత్తుల న్యుమోనియా,
హృదయ సంబంధ సమస్యలతో[1]
నివాసంచెన్నై, తమిళనాడు
వృత్తికర్నాటక సంగీత గాయకురాలు
మరియు
నటి
మతంహిందూ
జీవిత భాగస్వామిత్యాగరాజన్ సదాశివన్
పిల్లలురాధా విశ్వనాథన్
తల్లిదండ్రులు
  • సుబ్రహ్మణ్య అయ్యర్ (తండ్రి)
  • షణ్ముఖవడివు అమ్మాళ్ (తల్లి)
సంతకం
M. S. Subbulakshmi

బాల్యము

తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు.[2] తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించింది.

జీవితం

Ms subbulakshmi
మీరా చిత్రంలో సుబ్బులక్ష్మి

సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బులక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం అయింది. సదాశివన్ తొలిభార్య కుమార్తె రాదను పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బులక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది.

ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం

Statue subbalaxmi 4
ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో

సుబ్బులక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.

మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.

ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.

స్వర సంకలనం

గానం భాష సంవత్సరం ఇతర వివరాలు
వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ
కోసం తిరుమల తిరుపతి దేవస్థానంవారికి గానం
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగు
బ్రహ్మ కడిగిన పాదము...
  • కీర్తన
  • అన్నమాచార్య.
వాతాపి గణ పతిం భజే...
భజ గోవిందం మూడమతే... I
తిరుమల తిరుపతి దేవస్థానంవారి కోసం శ్రీ వెంకటేశ్వర పంచరత్నమాల
రేడియో రేసిటాల్స్ వాల్యూమ్ 2 ఆడ మోడి గలదా...[3]
  • రాగం : చారుకేశి
  • తాళం : ఆది
  • స్వరకర్త : త్యాగరాజు
  • ఆల్బం : Radio Recitals Excerpts Vol 2
ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్ అంబా నీ...[3]
  • రాగం: అతనా
  • తాళం : ఆది
  • స్వరకర్త : పాపనాసం శివన్
  • ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్
అరుల్ పురివై...[3]
  • రాగం : హంస ధ్వని
  • తాళం : ఆది
  • స్వరకర్త : సుబ్రహ్మణ్య భారతి
  • ఆల్బం : ఎం.ఎస్.ఓల్డ్ జెమ్స్

చలనచిత్ర రంగం లో

ఆధ్యాత్మిక సంగీతంలో తన పటిమతో పాటు ఇటు చలనచిత్ర రంగంలో కూడా తన ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు ఎం.ఎస్. ఆమె నటించిన కొన్ని చిత్రాలు[4] :

సంవత్సరం (క్రీ.శ.) చలనచిత్రం భాష పాత్ర దర్శకుడు సంగీతం దర్శకుడు
1938 సేవాసదనం తమిళం సుమతి కె.సుబ్రమణ్యం పాపనాశం శివం
1941 సావిత్రి తమిళం నారద ముని వై.వీ.రావు కమలాదాస గుప్త & తురైయుర్ రాజగోపాల శర్మ
1945 మీరా తమిళం మీరాబాయి ఎల్లిస్ ఆర్. డంగెన్ ఎస్.వీ. వెంకటరామన్
1947 మీరాబాయి హిందీ మీరాబాయి ఎల్లిస్ ఆర్. డంగెన్ ఎస్.వీ. వెంకటరామన్

పురస్కారాలు, సన్మానాలు

తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి.

పురస్కారం పేరు బహూకరించింది సంవత్సరం (క్రీ.శ.) ఇతర వివరాలు
Padma bhushan award
పద్మభూషణ్[5] భారత ప్రభుత్వం 1954
బిరుదు సంగీతకళానిధి ది మ్యూజిక్ అకాడమి
చెన్నై, తమిళనాడు
1965 మొట్టమొదటి సారిగా అందుకున్న స్త్రీ గాయకురాలు
డాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
అంధ్రప్రదేశ్
1971
డాక్టరేట్ ఢిల్లీ యూనివర్సిటి
ఢిల్లీ
1974
రామన్ మెగసెసే పురస్కారం[6] ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం 1974
Padma vibhushan award
పద్మవిభూషణ్[5] భారత ప్రభుత్వం 1975
డాక్టరేట్ బెనారస్ యూనివర్సిటి
ఉత్తరప్రదేశ్
1980
డాక్టరేట్ యూనివర్సిటి ఆఫ్ మద్రాస్
తమిళనాడు
1987
కాళీదాస్ సన్మాన్[1] మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డు భారత ప్రభుత్వం 1990
Bharataratna award
భారతరత్న[5] భారత ప్రభుత్వం 1998 సంగీత విభాగం క్రింద మొట్టమొదటి సారిగా ఈ అత్యున్నత పురస్కారం అందుకుని
చరిత్ర సృస్టించిన వ్యక్తి, స్త్రీ, గాయకురాలు
జీవిత సాఫల్య పురస్కారం[7]
( లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు )
ఢిల్లీ ప్రభుత్వం 2004 ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తనకు పురస్కారం క్రింద వచ్చిన
11 లక్షల రూపాయల నగదును స్వర్గీయ కంచి ఆచార్య చంద్రసేఖరేంద్ర సరస్వతీ స్మృతి కట్టడానికి విరాళమిచ్చారు.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గురించి ప్రచురణలు

పుస్తకం పేరు భాష సంవత్సరం (క్రీ.శ.) ఇతర వివరాలు
MS a life in Music book cover
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర
సంకలన్ పరిచింది. టి.జే.ఎస్.జార్జి[8]
ఇంగ్లీష్ 2004
  • ప్రచురణ కర్త: హార్పెర్ కాలిన్స్ (Harper Collins)
  • పేజీలు : 303
  • వెల: రూ.495
  • ఐ.ఎస్.బి.ఎన్ (ISBN) : 8172235275

పుస్తకం ఆన్ లైన్ ద్వారా కొనుటకు:

ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[1] కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది.

వెలుపలి లింకులు

మూలాలు

  1. 1.0 1.1 1.2 హిందూ పత్రిక వెబ్సైట్ నుండి M.S. subbulakshmi passes away, aged 88.జూన్ 10,2008న సేకరించబడినది.
  2. గార్లపాటి, పల్లవి. "ఎమ్మెస్ ఆవేదనా రాగం ఇది!". eenadu.net. ఈనాడు. మూలం నుండి 13 May 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 13 May 2017.
  3. 3.0 3.1 3.2 మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ వెబ్సైట్ నుండి...ఎం.ఎస్. సుబ్బలక్ష్మిజూన్ 13,2008న సేకరించబడినది.
  4. ఎం ఎస్ సుబ్బలక్ష్మి సినీప్రస్థానం
  5. 5.0 5.1 5.2 పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మిజూన్ 10,2008న సేకరించబడినది.
  6. రామన్ మెగసెసె పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. జూన్ 10,2008న సేకరించబడినది.
  7. హిందూ పత్రిక వెబ్సైట్ నుండి Lifetime Achievement Award for M.S. Subbulakshmi జూన్ 10,2008న సేకరించబడినది.
  8. హిందూ పత్రిక వెబ్ సైట్ నుండిఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రజూన్ 13,2008న సేకరించబడినది.
అన్నమాచార్య కీర్తనలు

అన్నమాచార్య కీర్తనలు తెలుగులో పదకవితా సాహిత్యంలోనూ, భక్తి సంగీతంలోనూ, భజన సంప్రదాయంలోనూ, కర్ణాటక సంగీతంలోనూ కీలకమైన కృతులుగా పేరుపొందాయి. వీటిని 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు కూర్పు చేశాడు.

కామిశెట్టి శ్రీనివాసులు

కామిశెట్టి శ్రీనివాసులు (జూన్ 25, 1941) అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖుడు. ఇదే రంగంలో కీలకమైన పరిశోధన చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ శిష్యుడు.

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య (మార్చి 28, 1904 - డిసెంబరు 30, 1973) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336 కి పైగా సినిమాల్లో నటించాడు. 1938 లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో ఆయన సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. 1939లో స్థాపించబడిన వాహినీ స్టూడియోస్ తరపున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాల్లో పని చేశాడు. తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచాడు. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి.

డి.కె.పట్టమ్మాళ్

డి.కె.పట్టమ్మాళ్ (తమిళం: தாமல் கிருஷ்ணசுவாமி பட்டம்மாள்) (1919 మార్చి 28 – 2009 జూలై 16) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. ఆమె అనేక భారతీయ భాషా చలన చిత్రాలలో పాడారు. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి ఆమెకు సమకాలీనులు. ఈ ముగ్గురు గాయకులు "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం"గా సుప్రసిద్ధులు. ఆమె ప్రపంచ సంగీత ప్రేమికులచే ఆరాధించబడింది.

డిసెంబర్ 11

డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.

తిరుమల తిరుపతి దేవస్థానములు

తిరుమల తిరుపతి దేవస్థానము (ఆంగ్లం: Tirumala Tirupati Devasthanams or TTD), ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది. ప్రపంచములోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి.రు.1925 కోట్ల వార్షిక బడ్జెట్‌, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.

ఇది వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ. 1830ల నాటికే తిరుమల ఆలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్టిండియా కంపెనీ వారికి సంవత్సరానికి రూ.లక్ష వచ్చేది. స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్‌ను తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తితిదే 19 రికార్డులను నిర్వహిస్తోంది.

తులసీ దళములచే సంతోషముగా పూజింతు

తులసీ దళములచే సంతోషముగా పూజింతు కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి వారు రచించిన కీర్తన. ఇది సాధారణంగా మాయామాళవగౌళ రాగము లో పాడబడుతుంది.

దక్షిణ భారతదేశము

దక్షిణ భారతదేశము దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు పాండిచ్చేరి (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత ద్వీపకల్పములో వింధ్య పర్వతములకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రము, దక్షిణమున హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం కన్యాకుమారి. ఇరువైపులా ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య దక్కన్ పీఠభూమిలతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. తుంగభద్ర, కావేరి, కృష్ణ మరియు గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు.

నేదునూరి కృష్ణమూర్తి

నేదునూరి కృష్ణమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి బిరుదు పొందినవాడు.

భారతీయ సినిమా నటీమణులు జాబితా

ఈ క్రింద ఉదహరించిన స్త్రీల పేర్లు గుర్తించదగిన భారతీయ సినిమా నటీమణుల ఒక అక్షర జాబితా.

రాధా విశ్వనాథన్

రాధావిశ్వనాథన్ (1934 డిసెంబరు 11 – 2018 జనవరి 2) భారతీయ సంగీత విద్వాంసురాలు మరియు శాస్త్రీయ నర్తకి. ఆమె ప్రముఖ సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కుమార్తె. ఆమె తన తల్లితో పాటు కచేరీలను చేసింది.

సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్

సెమ్మంగుడి రాధాకృష్ణ శ్రీనివాస అయ్యర్ (తమిళం: செம்மங்குடி ராதாக்ருஷ்ண ஸ்ரீநிவாஸ ஐயர்) (25 జూలై 1908 – 31 అక్టోబర్ 2003) కర్ణటక సంగీత గాత్ర కళాకారుడు (గాయకుడు). సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం 1947లో స్వీకరించి ఆ పురస్కారం పొందినవారిలో అత్యంత పిన్నవయస్కునిగా రికార్డు సాధించారు. మరియు భారతప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ పురస్కారం (1953), తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇసై పెరరిఙ్గర్ and మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్ సహా అనేక ఇతర ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందారు. శిష్యులు ఆయనను ఆప్యాయంగా "సెమ్మంగుడి మామ" అని పిలుచుకుంటూంటారు. ఆయనను ఆధునిక కర్ణాటక సంగీత పితామహునిగానూ, ఆద్యునిగానూ భావిస్తూంటారు. 1979లో కేరళ విశ్వవిద్యాలయం నుంచి సెమ్మంగుడ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

1954 -1960
1961 -1980
1981 -2000
2001 - ప్రస్తుతం
రామన్ మెగసెసే పురస్కార విజేతలు (భారతదేశము)

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.