ఆగష్టు 4

ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 216వ రోజు (లీపు సంవత్సరములో 217వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 149 రోజులు మిగిలినవి.

<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2019

సంఘటనలు

 • 0070: రోమన్లు, ​​జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు.
 • 0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటె ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) [1]
 • 1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు.
 • 1735 : బ్రిటన్ యొక్క ఉత్తర అమెరికా కాలనీలలో పత్రికా స్వాతంత్ర్యం కోసం మొదటి ముఖ్యమైన విజయం జరిగింది.జాన్ పీటర్ జెంజెర్, 1733 లో న్యూయార్క్ వీక్లీ జర్నల్ ప్రచురించడం మొదలుపెట్టాడు. వలస ప్రభుత్వ విధానాలను, తన పత్రికలో విమర్శించటంతో, వలస ప్రభుత్వం అతనిని నిర్బంధించింది. న్యాయస్థానం, అతని పత్రికలో రాసిన వాటికి, ఆధారాలు ఉన్నాయని, అతనిని విడుదల చేసింది. ఇది మొదటి పరువు ఖైదు (డిఫమేషన్) కేసు కూడా.
 • 1777: రిటైర్ అయిన, బ్రిటీష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటి సర్కస్ని ప్రారంభింఛాడు.
 • 1821: అత్కిన్సన్ మరియు అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, "సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్" అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు.
 • 1824: కోస్ యుద్దం, టర్కీ దేశం మరియు గ్రీసు దేశం మధ్య జరిగింది.
 • 1830: చికాగో నగరం కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు.
 • 1854: హినొమరు, జపాన్ నౌకల నుండి ఎగుర అధికారిక జెండాగా ప్రకటించారు.
 • 1858: మొదటిట్రాన్స్-అట్లాంటిక్ కేబుల్ పూర్తి అయింది.
 • 1884: థామస్ స్టీవెన్స్ సైకిల్ మీద అమెరికా అంతా చుట్టివచ్చిన మొదటి మనిషి. ఆ తరువాత, అతడు, సైకిల్ మీద ప్రపంచమంతా, చుట్టివచ్చాడు.
 • 1906: ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో, సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభమైంది.
 • 1914: మొదటి ప్రపంచ యుద్ధం : బెల్జియం దేశం మీద జర్మనీ దురాక్రమణ చేసింది. బదులుగా, బ్రిటన్, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
 • 1916: అమెరికా డెన్మార్క్ నుండి వర్జిన్ ద్వీపాలను 25 మిలియన్ల డాలర్లకు, కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
 • 1916: మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
 • 1925: అమెరికా నావికాబలగాలు 13-సంవత్సరాల ఆక్రమణ తరువాత నికారాగువా దేశాన్ని (నికరాగ్వా]] వదిలేసి, వెళ్ళిపోయారు.
 • 1927: అమెరికా, కెనడా ల మధ్య పీస్ బ్రిడ్జ్ (వంతెన) ప్రారంభమైంది.
 • 1929: జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞాన సమాజం, దాని అనుబంధ సంస్థల నుంచి రాజీనామా చేసాడు.
 • 1944: ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం) .
 • 1947: జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది.
 • 1954: హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. విను
 • 1956: మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది.
 • 1960: అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.
 • 1971: అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.
 • 1977: అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ డిపార్ట్ర్త్‌మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు.
 • 1983: ఇటలీ 1946 తరువాత, మొదటి సామ్యవాద ప్రధాన మంత్రిని ఎన్నుకుంది.
 • 1972: అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్]కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది.
 • 2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.
 • 2009: తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.

జననాలు

President Barack Obama
President Barack Obama

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

 • తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
 • -

బయటి లింకులు

ఆగష్టు 3 - ఆగష్టు 5 - జూలై 4 - సెప్టెంబర్ 4 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
1943

1943 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

1948

1948 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

2006

2006 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

2009

2009 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. 2009లో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం, కొద్దిరోజులకే వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించడం, రోశయ్య నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగాయి. అక్టోబరు మొదటివారంలో కృష్ణా, తుంగభద్ర వరదల వలన వందలాది గ్రామాలు, మంత్రాలయం, కర్నూలు లాంటి పట్టణాలు నీటమునిగాయి. జాతీయంగా జరిగిన ముఖ్యపరిణామాలలో కేంద్రంలో మళ్ళీ యు.పి.ఏ.అధికారంలో కొనసాగింది. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశమంతటా హడలెత్తించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను పొందినది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ దీక్ష చేపట్టడం, కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయడం, ఆ తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లు, మళ్ళీ కేంద్రం మాటమార్చడంతో తెలంగాణ పోరాటాల అగ్ని గుండంగా మారింది.

ఆగష్టు 3

ఆగష్టు 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరములో 216వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి.

ఆగష్టు 5

ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 217వ రోజు (లీపు సంవత్సరములో 218వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 148 రోజులు మిగిలినవి.

ఉండవల్లి అరుణ కుమార్

ఉండవల్లి అరుణ కుమార్ (జ: ఆగష్టు 4, 1954), భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి 14 వ, 15 వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శిని ఫైనాన్సియర్స్ మరియు దాని యజమాని రామోజీరావును విమర్శించి ఉండవల్లి 2008లో వార్తలకెక్కాడు. ఉండవల్లి అరుణ కుమార్ ఒక తెలివైన రాజకీయ నాయకుడు. రాజీవ్, సోనియా లకు ట్రాన్సిలేటర్ (అనువాదకుడు) గా ఉన్నాడు.

ఉండవల్లి అరుణ కుమార్ బ్రాహ్మణ కులమునకు ఛెందినవాడు.

రామోజీరావు నడుపుతున్న ఈనాడు దినపత్రికకు వ్యతిరేకంగా ఇతడు కొందరు కాంగ్రేస్ యువ రాజకీయనాయకులతో కలిసి "ఈవారం" అనే రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు

ఎనికెపాడు

ఎనికేపాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామము పిన్ కోడ్ నం. 521 108., ఎస్.టి.డి.కోడ్ = 0866.

ఎన్.ఆర్.నంది

ఎన్‌.ఆర్‌. నంది (నంది నూకరాజు) ప్రముఖ సాహితీవేత్త, కథ, నవల, నాటక రచయిత. ప్రవాసాంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపకుడు.

కంకతావ

కంకటావ, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 149., ఎస్.టి.డి. కోడ్ = 08672.

(kankata)

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (ఆంగ్లం:Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.

వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

జూలై 4

జూలై 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 185వ రోజు (లీపు సంవత్సరములో 186వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 180 రోజులు మిగిలినవి.

డి.వి.సదానంద గౌడ

డీవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన డి.వి.సదానంద గౌడ మార్చి 18, 1953న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మండెకోలులో జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 1988 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందినారు. 1994లో తొలిసారి పుత్తూరు నుంచి విజయం సాధించి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో రెండో సారి కూడా అదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా వ్యవహరించారు. 2003లో పబ్లిక్ అక్క్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. 2004లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నుకయ్యారు. 2009లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి రెండవసారి లోకసభకు ఎన్నికైనారు. బి.ఎస్.యడ్యూరప్పను లోకాయుక్త తప్పుపట్టడంతో పార్టీలో వివాదరహితుడైన సదానందగౌడకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ఆగష్టు 4, 2011న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2014లో 16వ లోకసభకు ఎన్నికై 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.

పుల్లలచెరువు

పుల్లలచెరువు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము.

పిన్ కోడ్:523 328. ఎస్.టి.డి కోడ్:08403.

పుల్లలచెరువు ప్రకాశం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2024 ఇళ్లతో, 8861 జనాభాతో 3593 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4530, ఆడవారి సంఖ్య 4331. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2178 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 916. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590553.పిన్ కోడ్: 523328.

బెజవాడ గోపాలరెడ్డి

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 - మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను మరియు రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.

ముఖ్యమంత్రి

భారతదేశంలో రాష్ట్రాల ప్రభుత్వాధినేతను ముఖ్యమంత్రి అంటారు. శాసనసభలో కనీస ఆధిక్యత కలిగిన పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడై ఉండాలి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు, కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి.

ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనకు బాధ్యుడు. గవర్నరు పేరిట పరిపాలన జరిగినప్పటికీ, అధికారం యావత్తూ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. పరిపాలనలో తనకు సహాయంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని నియమించుకుంటారు.

మోపిదేవి

మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండల కేంద్రము. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

శత్రుచర్ల విజయరామరాజు

శత్రుచర్ల విజయరామరాజు (Satrucharla Vijayarama Raju), విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి.

వీరు ఆగష్టు 4, 1948 సంవత్సరంలో చినమేరంగిలో జన్మించారు. వీరు బొబ్బిలి రాజా కళాశాలలో చదువుకున్నారు. వీరు రాణీ శశికళాదేవిని 1973 జూన్ 28లో వివాహం చేసుకున్నారు.

ఇతడు రాజకీయాలలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత మూడు సార్లు తొమ్మిది, పది మరియు పన్నెండవ పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

సెప్టెంబర్ 4

సెప్టెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరములో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.

ఇతర భాషలు

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.